వికీపీడియా:విషయ ప్రాముఖ్యత (రచయితలు): కూర్పుల మధ్య తేడాలు

Created page with 'తెలుగు వికీపీడియాలో ఒక వ్యాసం ఉండదగినదా లేదా అన్న విషయం బేర...'
(తేడా లేదు)

11:24, 28 జూన్ 2020 నాటి కూర్పు

తెలుగు వికీపీడియాలో ఒక వ్యాసం ఉండదగినదా లేదా అన్న విషయం బేరీజు వేయడానికి ఆ విషయపు ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకోవాలి. రచయితలు, కవులు వంటి సాహిత్యకారుల వ్యాసాలు ఉండదగినవా కాదా అన్నది పరిశీలించడానికి విషయ ప్రాముఖ్యతకు అవసరమైన ప్రమాణాలు ఇవి. ఇవి ఏర్పడినది రచ్చబండలో 2016లో జరిగిన చర్చ

ప్రమాణాలు

అవార్డ్ గ్రహీతలు, ప్రముఖ పత్రికలు నిర్వహిస్తున్న పోటీలలో గెలుపొందిన రచయితలు రచనల ఆధారంగా సినిమాలు తయారైతే ఆ రచయితల వ్యాసాలు ఉండవచ్చు. రచయితలు ప్రాచుర్యం చెందిన వారైతే వారి గురించి, వారి రచనల సమీక్షలు పత్రికల్లో, అంతర్జాలంలో లభ్యమవుతుంటాయి. వాటిని మూలాలుగా తీసుకుని వ్యాసాలు రాయాలి. దీర్ఘకాలం పత్రికలలో ప్రత్యేక శీర్షికలు నిర్వహించిన వారు పత్రికలలో సీరియల్స్‌గా వచ్చిన నవలా రచయితలు బహుమతి పొందిన కధలను వ్రాసిన రచయితలు వారి రచనలు ఇతర భాషల్లోకి అనువాదమయినవారు. వారి స్వంత ప్రచురణ అయితే ఆ పుస్తకం కనీసం 3 పునర్ముద్రణలైనా ఉండాలి.