వికీపీడియా:విషయ ప్రాముఖ్యత (రచయితలు): కూర్పుల మధ్య తేడాలు

Created page with 'తెలుగు వికీపీడియాలో ఒక వ్యాసం ఉండదగినదా లేదా అన్న విషయం బేర...'
 
పంక్తి 1:
తెలుగు వికీపీడియాలో ఒక వ్యాసం ఉండదగినదా లేదా అన్న విషయం బేరీజు వేయడానికి ఆ విషయపు ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకోవాలి. రచయితలు, కవులు వంటి సాహిత్యకారుల వ్యాసాలు ఉండదగినవా కాదా అన్నది పరిశీలించడానికి విషయ ప్రాముఖ్యతకు అవసరమైన ప్రమాణాలు ఇవి. ఇవి ఏర్పడినది [[వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_49#తెలుగు_రచయితలు_ప్రాజెక్టు-తెలుగు_రచయితల_నోటబిలిటీ|రచ్చబండలో 2016లో జరిగిన చర్చ]]
== ప్రమాణాలు ==
* అవార్డ్ గ్రహీతలు, ప్రముఖ పత్రికలు నిర్వహిస్తున్న పోటీలలో గెలుపొందిన రచయితలు
* రచనల ఆధారంగా సినిమాలు తయారైతే ఆ రచయితల వ్యాసాలు ఉండవచ్చు.
* రచయితలు ప్రాచుర్యం చెందిన వారైతే వారి గురించి, వారి రచనల సమీక్షలు పత్రికల్లో, అంతర్జాలంలో లభ్యమవుతుంటాయి. వాటిని మూలాలుగా తీసుకుని వ్యాసాలు రాయాలి.
* దీర్ఘకాలం పత్రికలలో ప్రత్యేక శీర్షికలు నిర్వహించిన వారు
* పత్రికలలో సీరియల్స్‌గా వచ్చిన నవలా రచయితలు
* బహుమతి పొందిన కధలను వ్రాసిన రచయితలు
* వారి రచనలు ఇతర భాషల్లోకి అనువాదమయినవారు.
* వారి స్వంత ప్రచురణ అయితే ఆ పుస్తకం కనీసం 3 పునర్ముద్రణలైనా ఉండాలి.
*