నెల్లూరు కాంతారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
నెల్లూరు కాంతారావు ఒక చలన చిత్ర నటుడు. అనేక సినిమాలలో ప్రతినాయక పాత్ర పోషించాడు. [[టైగర్ ప్రొడక్షన్స్]] అనే చిత్రనిర్మాణ సంస్థను ఎస్.హెచ్.హుసేన్ అనే వ్యక్తితో కలిసి స్థాపించి కొన్ని చిత్రాలను నిర్మించాడు. ఇతనికి నెల్లూరులో కనకమహల్ అనే సినిమా ప్రదర్శనశాల కూడా ఉండేది.
==జీవిత విశేషాలు==
ఇతడు [[నెల్లూరు]]లో [[1931]], [[జనవరి 24]]న జన్మించాడు. నెల్లూరు వి.ఆర్.కాలేజిలో ఇంటర్‌మీడియట్ వరకు చదువుకున్నాడు. ఇతనికి ముగ్గురు సోదరులు, ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. చిన్నతనం నుండే శరీరవ్యాయామం చేస్తూ, దేహధారుఢ్యాన్ని పెంచుకున్నాడు. 1948 నుండి 1956 వరకు ఆంధ్ర, ఉమ్మడి మద్రాసు రాష్ట్రాలలో వివిధ ప్రాంతాలలో కుస్తీ పోటీల్లో పాల్గొంటూ ఎందరో వస్తాదులను ఓడించి అనేక బిరుదులు, బహుమతులు, ఛాంపియన్‌షిప్‌లు సంపాదించాడు. 'ఆంధ్రా టైగర్' అనే బిరుదును పొందాడు.1952లో ఇండియా ఒలింపిక్ గేమ్స్‌కు ఉమ్మడి మద్రాసురాష్ట్ర ప్రతినిధిగా, 1956లో [[పోలాండ్]] దేశం వార్సాలో జరిగిన వరల్డ్ యూత్ ఫెస్టివల్‌కు భారతదేశ ప్రతినిధిగా పాల్గొన్నాడు<ref name="పత్రిక">{{cite news |last1=విలేకరి |title=నటుడు పహిల్వాన్ ఎన్.కాంతారావు మరి లేడు |url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=9015 |accessdate=30 June 2020 |work=ఆంధ్రపత్రిక దినపత్రిక |date=23 October 1970}}</ref>. నెల్లూరులో ఉన్న కనక్‌మహల్ థియేటర్‌లో ఇతడు ఒక భాగస్వామి. [[రేచుక్క-పగటిచుక్క]] సినిమాలో వస్తాదు పాత్ర ద్వారా చిత్రసీమలో ప్రవేశించి నటుడిగా, నిర్మాతగా మారాడు. పరిశ్రమకు వచ్చిన కొత్తలోనే ఇతడు ఎందరికో స్నేహపాత్రుడైనాడు. అంతగా అనుభవం లేకున్నా కేవలం తన మంచితనంతోనే నిర్మాతగా మారి [[అసాధ్యుడు (1968 సినిమా)|అసాధ్యుడు]], [[అఖండుడు]] లాంటి సినిమాలను నిర్మించాడు. ఇతడు [[1970]], [[అక్టోబరు 8]]వ తేదీ [[నూజివీడు]]లో ఆసుపత్రిలో మరణించాడు<ref>{{cite journal|last1=సంపాదకుడు|title=నెల్లూరు కాంతారావు మృతి|journal=విజయచిత్ర|date=1 November 1970|volume=5|issue=5|page=29|accessdate=30 April 2017}}</ref>.
 
==చిత్రరంగం==
"https://te.wikipedia.org/wiki/నెల్లూరు_కాంతారావు" నుండి వెలికితీశారు