కీచకుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
== మహాభారతంలో==
పాండవులు ఒక సంవత్సరం పాటు విరాట రాజు రాజ్యభవనంలో పనివాళ్ళుగా చేరినప్పుడు పాండవుల భార్య ద్రౌపది, మహిళా సేవకురాలు (మాలిని) వేషంలో విరాట రాజు సుధేష్ణ దేవికి సేవలు చేయడానికి వెళ్ళింది. కీచకుడు మాలిని చూసి ఆమె అందాన్ని ఆస్వాదించాలని కోరగా దానికి ఆమె నిరాకరించింది. కీచకుడు మాలిని పట్ల తనకున్న కోరికును రాణి సుధేష్ణకు తెలిపి, తనకు మధువు పోయడానికి ఆమెను పంపమని కోరాడు. మాలిని మధువు పోస్తుండగా, కీచకుడు మాలినిని కౌగిలింత చేసుకోవడానికి ప్రయత్నించగా మాలిని ఏడుస్తూ అతన్ని కిందకు తోసేస్తుంది. దాంతో కీచకుడు మాలినిని వెంబడించగా, మాలిని సభా వేదిక గదిలోకి వెళ్తుంది. అక్కడ ఆమెను వెంట్రుకలతో పట్టుకుని, నేలమీద పడవేసి, మారువేషంలో ఉన్న భర్త [[యుధిష్ఠిరుడు]], విరాటరాజుతో సహా సభికులందరి ముందు కాలితో తన్నాడు. ఆ సంఘటనను చూసి ఎవరూ స్పందించలేరు. కోపంతో పళ్ళు కొరుకుతున్న [[భీముడు|భీముడి]]ని యుధిష్ఠిరుడు ప్రతీకారం తీర్చుకోవాలని ఆజ్ఞాపించాడు.
 
ఆ రోజు రాత్రి మాలిని, వంటవాడిగా ఉన్న భీముడిని కలుస్తుంది. వారిద్దరూ కలిసి కీచకుడిని చంపడానికి ప్రణాళికను రూపొందిస్తారు. రాత్రి సమయంలో కీచకుడు నర్తనశాలకు వచ్చేలా పథకం వేస్తారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కీచకుడు" నుండి వెలికితీశారు