అరకులోయ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు → వర్గం:ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు, typos fixed: ఉ
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 57:
== ప్రకృతి సౌందర్యం ==
అరకు లోయకు ఘాట్ రోడ్డు మార్గం ద్వారా వెళుతున్నప్పుడు రోడ్డుకిరువైపుల ఉన్న దట్టమైన [[అడవులు]] కనువిందు చేస్తాయి. ఇక్కడ ట్రెక్కింగ్ భలే సరదాగా ఉంటుంది. మొత్తం 46 టన్నెళ్లు, బ్రిడ్జిలు ఉంటాయి. ఇక అరకులోయకు వెళ్లే మార్గమధ్యంలో దర్శనమిచ్చే అనంతగిరి కొండలు కాఫీ తోటలకు ప్రసిద్ధి. [[బొర్రా గుహలు]] అరకులోయకు సుమారు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.<ref>{{Cite news|url=http://telugu.webdunia.com/article/mountain-places/%E0%B0%85%E0%B0%B0%E0%B0%95%E0%B1%81-%E0%B0%85%E0%B0%82%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81-%E0%B0%9A%E0%B1%82%E0%B0%B8%E0%B1%8A%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%BE%E0%B0%82-%E0%B0%B0%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF-109111200036_1.htm|title=Araku Valley {{!}} Vizag {{!}} Visakhapatnam {{!}} Tourist spot {{!}} అరకు అందాలు చూసొద్దాం రండి!!|last=I|first=Venkateswara Rao.|access-date=2018-04-10}}</ref> సముద్రమట్టానికి 3వేల అడుగుల ఎత్తున బొర్రాగుహలు ఉన్నాయి. ప‌చ్చ‌ని చెట్లూ, కొండ చరియలూ, పచ్చని తివాచీ పరిచినట్టుండే పచ్చిక మైదానాలూ ఇక్క‌డికొచ్చే సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఈ గుహలను ఆగ్లేయ పరిశోధకుడు విలియం కింగ్ కనుగొన్నట్లు చారిత్రిక కథనం. ఈ గుహలు సున్నపు పొరల వల్ల 150మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయని పరిశోధనల ద్వారా తెలిసింది. విశాఖపట్నం జిల్లాలో గల గోస్తనీ నది ఈ గుహ్గల్లో పుట్టి జలపాతంగా మారి తూర్పు దిశలో ప్రవహించి భీమునిపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. గోస్తనీకి చెందిన కొండ ఏరులూ సెలయేరుల నీటి తాకిడికి సున్నపురాతిపొరలు కరిగి నిక్షేపాలుగా భూమి నుంచి పైకి, పైకప్పు నుంచి భూమికి వారధిగా ఏర్పడ్డాయి. ఈ ఆకారాలు రకరకాల జంతు, వస్తు, మానవ ఆకృతులతో విద్యుత్తు కాంతులతో వెలుగులీనుతున్నాయి. ఇక్కడి [[గిరిజనులు]] ఈ ఆకృతులనే దేవతలుగా కొలుస్తున్నారు. బొర్రా గుహలకు వందమీటర్ల వ్యాసంతో ప్రవేశద్వారం ఉంది. కిలోమీటరు పొడవునా సొరంగం ఉంటుంది. ఇందులో చాలా చోట్ల మూడు అరలు కలిగిన సొరంగాలు ఉన్నాయి.
అరకులోయలోని పద్మావతి ఉద్యానవన కేంద్రం పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఇక్కడి అందాలను వీక్షించేందుకు దేశ, విదేశాల పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి చెట్లపై నిర్మించిన హట్స్‌ పర్యాటకులకు మరువలేని అనుభూతిని అందిస్తున్నాయి. చల్లని వాతావరణం మధ్య హట్స్‌లో బస చేసే సౌకర్యం ఉంది. గార్డెన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన గిరిజన మహిళ, మత్స్యకన్య, [[అల్లూరి సీతారామరాజు]], శివపార్వతుల విగ్రహాలు, టాయ్‌ ట్రైన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గార్డెన్‌లో గులాబీ మొక్కలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.<ref>{{Cite web|url=http://www.eenadu.net/special-pages/travel-special/travel-inner.aspx?catfullstory=6513|title=అరకు... అందాల కనువిందు|website=www.eenadu.net|access-date=2018-04-10|archive-url=https://web.archive.org/web/20161025014631/http://www.eenadu.net/special-pages/travel-special/travel-inner.aspx?catfullstory=6513|archive-date=2016-10-25|url-status=dead}}</ref>
== గిరిజన మ్యూజియం ==
పద్మాపురం ఉద్యానవనం నుంచి 3 కి.మీ. దూరంలో [[గిరిజనులు|గిరిజన]] మ్యూజియం ఉంది. ఈ మ్యూజియం ప్రవేశానికి పెద్దలకు, పిల్లలకు వేర్వేరు ధరలతో ప్రవేశ రుసుము ఉంది. ఇక్కడ గిరిజనుల సంప్రదాయాలు, ఆచారాలను ప్రతిబింబించే సహజ సిద్ధంగా ఉండే ప్రతిమలు ప్రత్యేకం. బోటు షికారు, ల్యాండ్‌ స్కేపింగ్‌లు ఆకర్షణగా ఉన్నాయి. ఇక్కడే [[కాఫీ]] రుచులు పంచే కాఫీ మ్యూజియం ఉంది. వివిధ రకాల కాఫీలతోపాటు కాఫీ పౌడర్‌ లభిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/అరకులోయ" నుండి వెలికితీశారు