చర్చ:వాసి (ప్రసిద్ధి): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 73:
పై చర్చలను కొంతవరకు అర్ధం చేసుకోగలిగాను. కొన్న శీర్షికలను సరిదిద్దాను. చర్చలలో కొంత భాగాలు అసంబద్ధమైనవిగా వున్నాయి (తొలి విభాగంలో యర్రా రామారావు గారు వాడుకరి చర్చ:K.Venkataramana ను ఉటంకించటం). సభ్యులు చర్చలను మరింత అర్ధవంతంగా జరపటానికి సహకరించండి. తొలగింపుపై నిర్ణయం తీసుకునేందులకు పైన చర్చలను, విక్షనరీలో వ్యాసాన్ని, ఆంగ్ల వికీపీడియాలో దగ్గరి పోలికవున్న వ్యాసాలను ([[en:Recognition]], [[en:quantity]] పరిశీలించినమీదట, విస్తారమైన విషయ విశ్లేషణకు అవకాశం కల పదాలు వికీపీడియా లో కూడా వుండవచ్చు అని అభిప్రాయపడుతున్నాను. ఆంగ్ల వికీపీడియా వ్యాసాల మాదిరిలో వ్యాసాన్ని విస్తరించవలసినదిగా సూచించడమైనది. నిషేధం గురించి రచ్చబండ లో చర్చించమని కోరుతున్నాను. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 06:15, 2 జూలై 2020 (UTC)
::: ఈ వ్యాసం నిఘంటువులోని ఒక పదం. శీర్షికలోనే దాని అర్థం కూడా వాడుకరి సూచించాడు. ఇక వ్యాసంలోని అంశాలన్నీ వాసి, ప్రసిద్ధి అనే అర్థాల చుట్టూ త్రిప్పి త్రిప్పి స్వంత ఉదాహరణలనుపయోగించి విస్తరించే ప్రయత్నించారు. ఆంగ్ల వికీలో మాదిరిగా ఒక నిఘంటువులో ఉన్న పదాన్ని వికీ నియమాల ప్రకారం విస్తరిస్తే మంచిదే. కానీ ఈ పదాన్ని విస్తరించడానికి సమాచారం లేదు. మూలాలు, లింకులు లేవు. నలుగురు వాడుకరులు కూడా తొలగించమని తెలిపారు. కనుక దీనిని తొలగించాలి. అనేక రోజులు కష్టపడి ఏకవాక్యవ్యాసాలు, మొలక వ్యాసాలు, నాణ్యత లేని వ్యాసాలను విస్తరిస్తున్న సమయంలో ఇలాంటి వ్యాసాలు ఉండటం సరికాదు. ఈ వ్యాసం ఎందుకు ఉండాలో రెడ్డిగారు తెలియజేయలేదు సరికదా నిత్యం వికీపీడియాలో వ్యాసాల అభివృద్దికి పాటుపడుతున్న వాడుకరులపై "వ్యాస భక్షకులు" అనే ఆరోపణలు కూడా చేసాడు. ఈ వ్యాసాన్ని ఎక్కువ మంది సభ్యులు తొలగించమని కోరినందున తొలగించండి.[[User:K.Venkataramana|''' <span style="font-family:Jokerman; color: #0047AB">K.Venkataramana</span>''']][[User talk:K.Venkataramana|(talk)]] 12:39, 2 జూలై 2020 (UTC)
::::{{Ping|Arjunaraoc}} గారూ, వికీపీడియాలో నిర్ణయాలు అన్నవి విధానాలు, ఆ విధానాలన్నవి వికీపీడియా మూల స్తంభాల చుట్టూ కదా ఉండాలి. వ్యక్తిగత అభిప్రాయాల ప్రాతిపదికన నిర్ణయాలు ఎలా చేస్తాం? చర్చల్లో అభిప్రాయాలు వెలువరించేవారు కూడా సంబంధిత విధానానికి వ్యాఖ్యానం చేయడంలోనూ, వ్యాసంలోని విషయాన్ని ఆ వ్యాఖ్యానంతో సరితూచడంలోనూ భేదం ఉంటుంది తప్పించి విధానానికి వ్యతిరేకమైన భాష్యాలు చేసేట్టయితే అవి పరగణనలోకి తీసుకోకూడదు. ఇక్కడ పైన చెప్పిన అభిప్రాయాల్లో అత్యధిక శాతం ఇది వికీపీడియాలో ఉండదగిన వ్యాసం కాదని ఉంది. [[వికీపీడియా:ఏది_వికీపీడియా_కాదు#వికీపీడీయా_నిఘంటువు_కాదు|ఏది వికీపీడియా కాదు]] అన్న విధానంలో సూటిగా వికీపీడియా నిఘంటువు కాదు అని '''వికీపీడియా నిఘంటువు కాదు కాబట్టి, కేవలం పదానికి నిర్వచనం రాసేందుకు గాను పేజీ సృష్టించకండి.''' అని సూటిగా చెప్పారు. అలాంటప్పుడు విధానాన్ని వదిలివేసి స్వంత అభిప్రాయాల ప్రాతిపదికన జరగడం ఎంతవరకూ సబబు? ఉదాహరణకు: ''వ్యాసం తొలగింపుకు కూడా సరైన కారణాలు లేవు'' అన్న అభిప్రాయం చూడండి, అలానే మీరే వెలిబుచ్చిన ''విస్తారమైన విషయ విశ్లేషణకు అవకాశం కల పదాలు వికీపీడియా లో కూడా వుండవచ్చు అని అభిప్రాయపడుతున్నాను.'' చూడండి. విస్తారమైన విషయ విశ్లేషణకు అవకాశం లేని పదాలు అంటూ ప్రపంచంలో ఉండవు. ప్రతీ పదానికి కొన్ని కనీసం కొన్ని దశాబ్దాలు మొదలుకొని, కొన్ని వందలు, వేల యేళ్ళ చరిత్ర ఉంటుంది. ఆ లెక్కన ప్రతీ పదానికి వ్యాసం ఉండవచ్చుననే అర్థం వస్తుంది. ఆ విధంగా నిర్ణయించాలి అంటే అందుకు "ఏది వికీపీడియా కాదు" అన్న పేజీలో పాలసీ చర్చ చేసి చేయాలి. రేపొద్దున్న ప్రతీవారూ ప్రతీ పదానికి ఒక పేజీ పెట్టి నిర్వచనం రాసి భవిష్యత్తులో విస్తారమైన విషయ విశ్లేషణకు అవకాశం ఉందన్న ముక్క చెప్పి చేతులు దులుపుకుంటారు. ఏతావతా, ఈ నిర్ణయంలో పైన చెప్పిన పాలసీకి వ్యతిరేకంగా కేవలం అభిప్రాయం ప్రాతిపదకతో ఉంది. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 03:14, 3 జూలై 2020 (UTC)
Return to "వాసి (ప్రసిద్ధి)" page.