"వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/తెలుగేతర పేర్లను రాయడం ఎలా?" కూర్పుల మధ్య తేడాలు

*దేశాలకు, ప్రదేశాలకు తదితరాలకు నార్త్, సౌత్ ... ఇలా ఉన్నచోట్ల తెవికీలో వ్రాయడానికి ఒక నిర్ణయం అవసరం. వాడుకలో నార్త్ కొరియాను ఉత్తర కొరియా అంటాం, నార్త్‌సీ కి మాత్రం నార్త్ సముద్రమనీ, ఉత్తర సముద్రమనీ, నార్త్ సీ అనీ ఒక్కోచోట ఒక్కో విధంగా ఉంది (ఇది ఒక ఉదా: మాత్రమే). తెవికీలో దిక్కుల పేర్లతో ఉన్న కొన్ని వ్యాసాలకు ఉదా:లు [[నిజామాబాద్ సౌత్ మండలం]], [[సౌత్ జోన్ క్రికెట్ జట్టు]], [[సౌత్ బట్టన్ జాతీయ ఉద్యానవనం]], [[నార్త్ వల్లూరు]], [[ఇంఫాల్ ఈస్ట్ జిల్లా]], [[ఈస్ట్ కోస్ట్ రైల్వే రైళ్లు (భారతదేశం)]], [[ఈస్ట్ కాశీ హిల్స్]], [[వెస్ట్ ఇంఫాల్]], [[వెస్ట్ కాశీ హిల్స్]] ... ఇలాంటి వాటిపై ఒక నిర్ణయం తీసుకోవాలి.
*వ్యక్తుల పేర్లు ఇంటిపేర్లు ఉన్నదున్నట్లుగా రాయాలి, కాని చరిత్రకు సంబంధించి ఈ పేర్లు అజంతంలోకి మారిపోయాయి. ఇదే విషయంపై సుమారు పదేళ్ళ క్రితమే పెద్ద చర్చ జరిగింది ([[చర్చ:చంద్రగుప్త మౌర్యుడు#పేరు|'''చూడండి''']]) (మొత్తం చర్చ ఇక్కడ లేదు కాని ఆ సభ్యుడు ప్రవర్తన తెవికీలోనే పెద్ద దుమారం లేపి చివరికి ఒక యాక్టివ్ నిర్వాహకుడిని కోల్పోయాము) ఈ విషయంపై కొత్తగా చర్చ జరగాలి. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 19:52, 30 డిసెంబరు 2019 (UTC)
:: వ్యక్తుల పేర్ల గురించి మనం పూర్తి స్థాయిలో ఒక విధానం రూపొందించుకోవాలి [[వాడుకరి:C.Chandra Kanth Rao|చంద్రకాంతరావు]] గారూ. ఆంగ్ల వికీపీడియాలో కామన్ నేమ్ (సాధారణ నామం) అన్నది ప్రాతిపదిక. ఆ ప్రకారం ఒక వ్యక్తి గురించి బాగా ప్రాచుర్యంలో ఉన్న పేరు ఏదైతే అదే వ్యాసం పేరుగా వాడాలి. అలా కాకుండా మనకి తెలుసు కదాని వారి పూర్తిపేర్లతో వ్యాసాలు సృష్టించిన సందర్భాలు చూశాను. అలాగే, [[చర్చ:త్రిపురనేని రామస్వామి#పేరులోని చౌదరి|త్రిపురనేని రామస్వామి చర్చా పేజీలోని ఈ చర్చ]] చూడండి. రామస్వామి జీవితంలోని మలిదశలో చౌదరి అన్న కులసూచకాన్ని విడిచిపెట్టారు. ఇప్పటికీ చాలామంది చౌదరి కలిపి వాడతారు. ఈ విషయంలో వ్యక్తి స్వంత అభిప్రాయం ప్రాతిపదికా, సాధారణ నామమే ప్రాతిపదికా అన్నదీ చూడాలి. ఇక, మీరు చెప్పిన విషయానికి వస్తే, మౌర్య అన్న వంశనామాన్ని మౌర్యుడు చేయడం వ్యాకరణ ఉల్లంఘన కావచ్చు, కాకనూ పోవచ్చు. కానీ, చరిత్రకారులు, పాఠ్యపుస్తకాలు, సాధారణ రచనలు మౌర్యుడు అన్న రూపాన్ని స్వీకరించారు కాబట్టి కామన్ నేమ్ పాలసీని బట్టి అదే మనం స్వీకరిస్తాం. జన వ్యవహారంలో వ్యాకరణం నుంచి బయటకు జరిగిన వాడుకలు అనేకం ఉంటాయి. వాటన్నిటినీ వ్యాకర్తలే దిద్దరు, శుభ్రంగా అదొక నియమంగా స్వీకరించేస్తారు. (డిస్క్రిప్టివ్ లింగ్విస్టిక్స్ అంటారు దీన్ని) ఇక ఇలాంటి విషయాలపై స్వంత పరిశోధనలు చేయడం తగని మనకు ఆ పని అస్సలు కూడదు. (ఏ సభ్యుడు వెళ్ళిపోయారో తెలియదు, కానీ ఒక చర్చలో తన వాదన నెగ్గకపోవడం వల్ల వెళ్ళిపోయారు అంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. వికీపీడియా అన్నదే ఒక చర్చా యంత్రం అన్నారొక పరిశోధకులు.) --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 03:38, 3 జూలై 2020 (UTC)
 
=== పవన్ సంతోష్‌ అభిప్రాయాలు ===
* గూగుల్ చెయ్యడం అన్నది ప్రయోజనకరమైన విషయం. ఇందుకు గతంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి, చర్చలు కూడా దీని అనుగుణంగా ముగించాం. మరీ ముఖ్యంగా రెండు సరైన పదాల్లో ఏ పదం ఎక్కువ జనంలో ఉంది అని తెలుసుకోవాలంటే ఇది ఉపయోపగుతుంది. అయితే, కనీసం ఇన్ని సెర్చ్ రిజల్ట్‌ల కన్నా ఎక్కువ ఉంటేనే పరిగణించాలని అనుకుంటే మేలు. ఎందుకంటే- ఎక్కువ రిజల్ట్స్ ఉన్నప్పుడు అది ఖచ్చితం కావడానికి, కనీసం జనంలో ఉన్న పదం అని నిర్ధారణ కావడానికి, ఎక్కువ అవకాశం ఉంది. ఏ ఆఫ్రికా రాజకీయ నాయకుడి విషయమో ఐతే ఇలా నిర్ధారణ కాదు. దానికి పైన చెప్పినవాటిలో వేరే పద్ధతులు వాడవలసిందే.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2975162" నుండి వెలికితీశారు