రాజమండ్రి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగు: 2017 source edit
పంక్తి 29:
రాజమహేంద్రిని [[రాజరాజ నరేంద్రుడు]] రాజధానిగా చేసుకొని పరిపాలించాడని చరిత్రకారులు చెబుతారు. రాజరాజ నరేంద్రుని పూర్వపు రాజుల చరిత్రాధారాలు లేకపోవడం వలన వీరి గురించి చరిత్రకారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఒక కథనం ప్రకారం 919-934 సంవత్సరాల మధ్య అమ్మరాజు విష్ణువర్ధన రాజు, ఆయన తరువాత అమ్మరాజు విజయాదిత్యుడు (945-970) రాజమహేంద్రిని పరిపాలించారని చెబుతారు. రాజమహేంద్రి వేంగి చాళుక్య పరిపాలనలో చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత సంపాదించుకొంది. నరేంద్రుని పరిపాలనలో [[కవిత్రయం]]లో మెదటివారైన [[నన్నయ్య]] శ్రీ మహాభారతాన్ని తెనుగించడం ప్రారంభించారు. ఈ మహారాజు తరువాత [[విజయాదిత్యుడు]] (1062-1072), కుళోత్తుంగ చోళుడు, రాజరాజవేంగి-2 రాజమహేంద్రిని పరిపాలించారు. [[కాకతీయులు|కాకతీయ]] సామ్రాజ్యంలో రాజమహేంద్రికి ప్రముఖస్థానం ఉంది. 1323లో [[ముహమ్మద్ బిన్ తుగ్లక్]] ఓరుగల్లును ఆక్రమించడంతో కాకతీయ సామ్రాజ్యం అస్తమించింది. ఇప్పటి రాజమహేంద్రవర నడిబోడ్డులో ఉన్న మసీదు తుగ్లక్ పరిపాలనాకాలంలో తూర్పుచాళుక్యులచే నిర్మించబడ్డ వేణుగోపాలస్వామివారి ఆలయ స్థానంలో నిర్మించబడింది. 1326లో ముసునూరి ప్రొలానీడు తీరాంధ్రమును తురుష్కులనుండి విముక్తము చేశాడు. దీనితో రాజమహేంద్రవరము తిరిగి  స్వతంత్రమైనది (A Forgotten Chapter of Andhra History: History of the Musunuri Nayaks) by Mallampalli Somasekhara Sarma పేజీ.14). ఆ తరువాత రెడ్డి రాజులు, కపిలేశ్వర గజపతి, [[బహమనీ సుల్తానులు]], పురుషోత్తమ గజపతి, [[శ్రీకృష్ణదేవరాయలు]], [[ప్రతాపరుద్ర గజపతి]] వంటివారు రాజమహేంద్రిని పరిపాలించారు.
[[File:Rajahmundry Railway station 01.JPG|thumb|left|రాజమండ్రి రైల్వే స్టేషను]]
 
రాజమహేంద్రపురమును వర్ణించు సందర్భాలలో శ్రీనాధుడు తరుచు "రద్రపాదములు" అన్నపదాన్ని ఉప్దయోగించాడు.గోదావరి పొంగినప్పుడు తీరమునగల మార్కండేశ్వర, మృకండేశ్వరుల, పాదమువరకు వచ్చుచుండును.అందుచేత దీనిని రుద్రపాద క్షేత్రముగా వర్ణించుయుండును.గోదావరికి ఆవలిఒడ్డున కొవ్వూరువద్ద గల క్షేత్రము గోపాద క్షేత్రమని, ధవళేశ్వరం వద్ద రామపాదక్షేత్రమని ప్రసిద్దిచెందినవి.ఈ మృకండేశ్వర ఆలయము తూర్పు చాళుక్య రాజైన మొదటి చాళుక్య భీముడూ క్రీ.శ.892-922 కాలమందు నిర్మించినాడు.క్రీ.శ. 1323 సం.లో మొహమ్మదిబి తుగ్లక్ ఓరుగల్లును జయించి రాజమహేంద్రవరముపై దాడి వెడలివచ్చెను.దుర్గమును స్వాధీనపరచుకొని హుమాయున్ గుజ్జార్
అను వానిని గవర్నరుగా నియమించెను.ఆ సమయమున రాజమహేంద్రనగరములోని పురతన దేవాలయములెన్నో ద్వంసమునకు గురి అయినవి. వేనుగోపాలస్వామి ఆలయమును పడగొట్టి హుమాయున్ గుజ్జార్ ప్రేరణచేత ప్రస్తుతం పెద్ద మార్కెట్ చెమవున్న పెద్ద మసీదును నిర్మించెను.ఇది క్రీ.శ.1325లో నిర్మింపబడినట్లు మసీదు ద్వారముపై పారసీభాషలో గల శాసనముద్వారా తెలియు చున్నది.ఆ సందర్భములోనే మృకండేశ్వరాలయమును కూడా ద్వంసము అయినట్లు, అటుపై ఇక్కడ లభించిన నందివిగ్రహము పరిశీలనవల్ల తెలియుచున్నది.అటుపై క్రీ.శ.1327లో రాజమహేంద్రనగరము రెడ్డిరాజుల స్వాధీనమయినా 15వ శతాబ్దము మధ్యకాలం వరకు ఆపురము పూర్వ వైభవాన్ని పొందలేదు.అటుపై 1561లో ప్రతాపరుద్ర గజపతిని నిర్మూలించి ఉత్కళ దేశాన్ని హరిచెందనదేవుడు రాజమహేంద్రనగరమును స్వాధీనపరుచుకొనెను.క్రీ.శ.1565లో విజయనగర సాంరాజ్య సేనలకు, ముస్లిం కూటమికి మధ్య రాకాసి తంగడి యుద్ధము జరిగినది.ఈ యుద్ధ సమయమునందు గోల్కొండ సుల్తాను, నిడదవోలు నందు గల తన సైన్యమును పిలిపించుకొనెను.రాకాసి తంగడి విజయానంతరం రఫత్ ఖాన్ లాహరీ అను గోల్కొండ సైన్యాధిపతి దండెత్తివచ్చి రాజమహేంద్రనగరము ను స్వాధీనపరచుకొనెను.
డాక్టర్ నేలటూరి వేంకటరమణయ్యగారి సిద్దాంతం ప్రకారం "రాజమహేంద్ర" అన్న బిరుదుగల రాజరాజనరేంద్రుడు తన మామగారైన చోళరాజేంద్రుని గౌరవార్ధం రాజమహేంద్రపురాన్ని కట్టించి దానిని తన రాజధానిగా చేసుకొన్నాడు.విన్నకోట పెద్దనార్యునియొక్క కావ్యాలంకార చూడామణిలోని దీనిని ప్రస్తావించాడు.దీనిని బట్టి చూస్తే రాజమహేంద్రనగరము క్రీ.శ.10వ శతాబ్దములోనే నిర్మించబడినదని తెలియుచున్నది. అయితే రాజమండ్రికి దాదాపు అయిదు కిలోమీటర్ల దూరములో గల బొమ్మూరులో వో గుట్టపై బౌద్దయుగానికి చెందిన మూకుళ్ళు, పెంకులు ఇత్యాది వస్తువులు 1980సం.లో త్రవ్వకాల్లో లభించినవి.సరిగా కాల్చనటువంటి పెద్దపెద్ద ఇటుకలు కూడా లభించినవి.ఇప్పటికీ ఈగుట్టను సన్యాసిమెట్ట అనిపిలుచుచుందురు.ఈగుట్టక్రింద ఒక బౌద్దస్తూపము కూడా ఉన్నది.ఈ దృష్ట్యా పరిశీలిస్తే రాజమహేంద్రనగరము భారతదేశంలోనే అతి ప్రాచీన పట్టణాల్లో ఒకటయ్యే అవకాశాలుకనిపిస్తున్నాయి.మొదస్తనీస్, హ్యుమాయున్ లు పేర్కొన్న ప్రాచీన పట్టణాల్లో ఉన్న '''మహేంద్రగిరి''' కన్నింగహాం చెప్పినట్లు రాజమహేంద్రనగరము అయిఉండవచ్చును.
 
== స్థల పురాణం ==
"https://te.wikipedia.org/wiki/రాజమండ్రి" నుండి వెలికితీశారు