తిలోత్తమ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
 
== జననం ==
మహాభారతం యొక్క ఆది పర్వంలో దైవర్షి [[నారదుడు]], [[పాండవులు|పాండవుల]]కు అప్సరస తిలోత్తమ కారణంగా సుంద ఉపసుంద అనే రాక్షస సోదరులు మరణించిన కథను చెబుతాడు. పాండవుల మధ్య గొడవలకు [[ద్రౌపది]] కూడా ఒక కారణం కావచ్చని హెచ్చరించాడు. సుంద, ఉపసుంద ఇద్దరూ రాక్షసుడు నికుంభ కుమారులు. సుందరాజ్యం, ఉపసుందమంచం, ఆహారం, ఇల్లు, సింహాసనం మొదలైనవి అన్ని వారు ప్రతిదీ పంచుకుంటూ విడదీయరాని బంధంగా కలిసివున్నారు.
 
బ్రహ్మవరాలు పొందిన సుందోపసుందుల ఆగడాలు మితిమీరడంతో – విశ్వకర్మను పిలిచి అందాల సుందరిని తయారుచెయ్యమన్నాడు. అందుకోసం ముల్లోకాలలోనూ ఉన్న అందమైన రూపాల నుంచి నువ్వు గింజలంతటి పరిమాణాలతో తిలోత్తమ అనే అప్సరసను సృష్టించాడు. సందోపసుందులు తనకోసం పోటీపడితే ఎవరిని పొడిచి ఎవరుగెలిస్తే తాను వారి సొంతమంది. సందోపసుందులు పొడుచుకు చచ్చారు. బ్రహ్మ వైవర్త పురాణంలో తిలోత్తమ చంద్రుని దగ్గరకు వెళ్తుంటే సాహసికుడు ఆపాడట. వారి చెట్టా పట్టాల వల్ల ఆనందపు అరుపుల వల్ల దుర్వాసుని తపోభంగం జరిగి తిలోత్తమ శాపానికి లోనయిందట. బాణాసురుడి కూతురుగా రాక్షసిగా పుట్టిందట. కృష్ణుని మనవణ్ణి పెళ్ళాడి శాప విముక్తమైందట!
"https://te.wikipedia.org/wiki/తిలోత్తమ" నుండి వెలికితీశారు