సి.హెచ్.విద్యాసాగర్ రావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
 
==బాల్యం, విద్యాభ్యాసం==
చెన్నమనేని విద్యాసాగర్ రావు 1942, ఫిబ్రవరి 12న కరీంనగర్ జిల్లాలో జన్మించి ప్రాథమిక విద్యాభ్యాసం స్థానికంగా అక్కడే పూర్తిచేశారు. వేములవాడ, కరీంనగర్‌లలో కూడా కొంత కాలంఅభ్యసించారు. ఉన్నత విద్యను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తిచేశారు. బి.యస్సీ, ఎల్.ఎల్.బి పట్టాలు పొంది న్యాయవాద వృత్తిని స్వీకరించారు. ఎల్.ఎల్.బి.చేసేటప్పుడే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఆ ఉద్యమంలో చురుకుగా పల్గొన్నారు. అదే సమయంలో [[రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్]] (ఆర్.ఎస్.ఎస్.) లో కూడా ఆయన చురుకైన కార్యకర్త. కళాశాల ఎన్నికలలో పోటీచేసి ప్రెసిడెంటుగా కూడా ఎన్నికైనారు. ఇదే సమయంలో పెద్ద సోదరుడు రాజేశ్వరరావు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవారు. ఆ తరువాత విద్యాసాగర్ రావు రాజకీయాలలో ప్రవేశించి [[జనసంఘ్]] పార్టీలో చేరారు. 1977లో జనసంఘ్ పార్టీ జనతా పార్టిలో విలీనమైనప్పుడు ఈయన జనతాపార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 1980లో పాత జనసంఘ్ నేతలు జనతాపార్టీని వీడి భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన పిదప ఈయన భారతీయ జనతా పార్టీ తరఫున ప్రముఖముఖ్య నాయకుడిగా ఎదిగారు.
 
==రాజకీయ ప్రస్థానం==