వికీపీడియా చర్చ:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 45:
:దానికే కాదు, అసలు ఈ పద్ధతి దేనికీ సరైనది కాదు. ప్రాథమికంగానే ఈ పద్ధతిలో లోపం ఉంది. వికీపీడియాలో "ఎన్ని" వోట్లు వేసారనేది కాదు, వోటు "ఎందుకు" వేసారనేది ముఖ్యం. "ఎందుకు" అనేది అంకెలకు అందేది కాదు, అది వివరణాత్మకం. (ఈ కారణం వల్లనే.., చర్చను ముగిస్తూ నిర్ణయం తీసుకోవడమనేది చాలా ముఖ్యమైన, విలువైన అంశం. వచ్చిన అభిప్రాయాల్లో ఏవి వికీపీడియా విధానాలకు అనుగుణంగా ఉన్నాయో నిర్ధారించుకుని, తదనుగుణంగా నిర్ణయం కూడా వికీ విధానాలకు అనుగుణంగా ఉండేలా.. తీసుకోవాలి. ఇది చిన్న విషయమేమీ కాదు.) అంచేత ఈ విధానాన్ని పునస్సమీక్షించాలని <s>భావిస్తున్నాను.</s> అభిప్రాయపడుతున్నాను. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 08:37, 3 జూలై 2020 (UTC)
::[[User:Chaduvari|చదువరి]] గారు, మీ అవగాహన లో లోపాలున్నాయి. ఈ పద్ధతిలో ఎందుకు అనే వివరణాత్మకాలను విధానం ముసాయిదా రూపు దిశలోనే పరిగణించబడుతుంది. పద్ధతిని సమీక్షించటం మంచిదే, కాకపోతే ఒకసారైనా వాడి సమీక్షించితే ఫలితాలు మెరుగుగా వుంటాయి. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 04:18, 4 జూలై 2020 (UTC)
:::[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారూ, అభిప్రాయాలను పరిగణన లోకి తీసుకునే పనైతే ఇక వోటింగు ఎందుకు? అయా అభిప్రాయాలను పరిగణన లోకి తీసుకుని నిర్ణయం చేసెయ్యొచ్చు గదా! వివిధ అభిప్రాయాలు మన ఎదురుగా ఉన్నపుడు, వికీ విధానాల పట్లా మౌలిక సూత్రాల పట్లా అవగాహన ఉన్నవారికి ఇక నిర్ణయం చెప్పడంలో కష్టమేముంది? నిర్ణయం ప్రకటించేవారికి అంతటి వికీ విజ్ఞత లేని పక్షంలో మాత్రమే ఈ వోటింగు పనికొస్తుంది. అదొక్కటే వోటింగు ఉపయోగం. ఆ సందర్భంలో కూడా, వోటింగుతో "ఎందుకు" అనేది తేలదు కాబట్టి సరైన నిర్ణయం రాకపోయే అవకాశం ఉంది. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 06:26, 4 జూలై 2020 (UTC)
Return to the project page "విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి".