వాడుకరి:Chaduvari/అనువాదం చేద్దాం పదండి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
అనువాద పరికరాన్ని సరిగ్గా వినియోగించుకుంటే పెద్ద యెత్తున వ్యాసాలను రాయవచ్చు. పెద్ద వ్యాసాలనూ రాయవచ్చు. అంగుష్టం పరిమాణంలో ఉండే మొలకలను మాత్రమే ప్రచురించి సమాజం మీద వదిలేసే అంగుష్టమాత్రులకు, తమపై ఉన్న ఆ ముద్రను వదిలించుకునేందుకూ తామూ పెద్ద వ్యాసాలను రాయగలమని నిరూపించుకునేందుకూ ఈ అనువాద పరికరం ఒక వరం లాంటిది.
అనువాద పరికరం మెరుగైంది, అవుతూ ఉంది. ఉండేకొద్దీ ప్రొడక్టివ్‌గా మారుతోంది.
 
అనువాదం అంటే మక్కికి మక్కి అనువదించడం కాదు, వీలైనంత సహజమైన తెలుగులో ఉండాలి. "'''అంబేద్కర్ చేత రాజ్యాంగం రచించబడింది'''" అనేది తప్పెలా అవుతుంది అని వాదించొద్దు మహాప్రభో! "'''అంబేద్కర్ రాజ్యాంగం రచించాడు'''" అనేది సహజమైన తెలుగు అని గ్రహించు.
 
అనువాద పరికరం మెరుగైంది, అవుతూ ఉంది. ఉండేకొద్దీ దాని ఉత్పాదకత పెరుగుతోంది. ఈ పరికరాన్ని నిక్షేపంగా వాడవచ్చు, వాడాలి. కానీ అది చేసే తప్పులను సరిదిద్దుకున్నాకే ప్రచురించాలి. ఆ తప్పుల్లో కొన్ని:
 
# మూలంలో And ఉన్న ప్రతీచోటా "మరియు" అని రాస్తుంది. వాటిని సవరించుకోవాలి
# కర్మణి వాక్యాలు రాస్తుంది. అలాంటి వాక్యాల్లో కనీసం 99% శాతం వాటిని కర్తరి వాక్యాలుగా మార్చాల్సి ఉంటుంది.
# "యొక్క" రాస్తూంటుంది. "వికీపీడియా యొక్క వాడుకరులు" అంటుంది. "వికీపీడియా వాడుకరులు" అని గదా అనాల్సింది. అంచేత వాటిని (కనీసం 90% కేసుల్లో) సవరించాల్సి ఉంటుంది
# అనువాదం చేసినపుడు అర్థాన్ని మార్చేస్తూ ఉంటుంది. సరిగ్గా వ్యతిరేక అర్థం వచ్చేలా అనువదిస్తూంటుంది. మరీ తరచుగా ఏమీ జరగదుకానీ జరుగుతుంది. చాలా జాగర్తగా ఉండాలి.
# ఢిల్లీ, ఔ లాంటి కొన్నిటిని అనువదించాల్సిన చోట అది చిత్రమైన తప్పులు చేస్తుంది. వాటిని సవరించాల్సి ఉంటుంది.
 
ఎన్ని లోపాలున్నా దానితో అనేక ఉపయోగాలూ ఉన్నాయి
 
# దాన్ని వాడి చాలా వేగంగా పనులు చెయ్యవచ్చు. పైన చూపిన తప్పులను సవరించుకుంటూ కూడా రెండు మూడు గంటల్లో 20, 30 వేల బైట్లను సునాయాసంగా అనువదించి (సైన్సు వ్యాసాలకు కొంత ఎక్కువ టైం పడుతుంది) సలక్షణమైన వ్యాసాన్ని ప్రచురించవచ్చు.
# వ్యాసంలో రావాల్సిన మూలాలన్నీ వచ్చేస్తాయి. మనమేమీ శ్రమ పడనక్కర్లేదు.
# వ్యాసంలో ఉండే హంగులు - సమాచారపెట్టెలు, మూసలు, వికీలింకులు, బొమ్మలు, వ్యాసరూపాన్ని నిర్ధారించే పేరాగ్రాఫులు వగైరాలు - అన్నీ ఆటోమాటిగ్గా వచ్చేస్తాయి
 
ఇతర భారతీయ భాషలతో పోలిస్తే తెలుగులో అనువాదాలు తక్కువగా ఉంటున్నై. మనం మరింత ఎక్కువగా దీన్ని వినియోగించాలి. అనువాద గణాంకాలు చూడండి
 
{|
|