"నలుడు" కూర్పుల మధ్య తేడాలు

అడవిలో కర్కోటకుడు అనే నాగుని నలుడు అగ్ని నుండి రక్షించాడు. కర్కోటకుడు నాగ తన విషాన్ని చిమ్మగా నలుడు బహుకా అనే వికారమైన మరగుజ్జుగా మారాడు. అయోధ్య రాజు రితుపర్ణుడు దగ్గరికి వెళ్ళి అతనికి సేవ చేయమని కర్కోటకుడు, నలుడికి సలహా ఇచ్చాడు. నలుడు తన అసలు రూపాన్ని పొందడం కోసం ఒక మాయ వస్త్రాన్ని కూడా ఇచ్చాడు. నలుడు, రితుపర్ణుడు వద్దకు వెళ్లి అతనికి రథసారధిగా, వంటవాడిగా పనిచేశాడు. దమయంతి నిద్రనుండి లేచి చూడగా తన భర్త పక్కన లేకపోవడంతో, కన్నీళ్లు పెట్టుకుంటూ అతనిని వెతుక్కుంటూ వెళ్ళింది. ఆ దారిలో ఆమెకు పాము ఎదురయింది. మునులను, వ్యాపారులను, ప్రయాణికులను కలుసుకుంది. రాజ్యానికి రాణి అయిన తన అత్తను కలుసుకుంది. చివరికి, తన తండ్రి రాజ్యాన్ని చేరుకుంది. ఎవరైనా తన భర్త జాడను చెప్తే వారికి బహుమతిని ఇస్తానని ప్రకటించింది. ఆమె సేవకులలో ఒకరు వచ్చి సుదూర రాజ్యంలో బహుకా అనే రథసారధి ఉన్న సమాచారం అందించాడు.
 
నలుడి జాడ తెలుసుకోవడానికి దమయంతి రితుపర్ణకు ఒక వర్తమానాన్ని పంపింది. దమయంతి మరో వివాహం చేసుకోబోతున్నదని విన్న బహుకా, రితుపర్ణను తీసుకొని రథాన్ని వేగంగా నడుపుతూ అయోధ్య నుండి విదర్భకు బయలుదేరాడు. ఆ ప్రయాణంలో, కలి తన శరీరం నుండి బయటకు వచ్చి భయంతో క్షమించమని కోరాడు. నలుడు అతనిని క్షమించి, కొద్దిగంటల్లో భీముని రాజ్యానికి చేరుకున్నాడు. దమయంతి తన సేవకుడి ద్వారా రథసారధి బహుకాను తన భవనానికి పిలిపించింది. ఇద్దరూ ఒకరినొకరు గుర్తుపట్టగా నలుడు తన అసలు రూపంలోకి వచ్చాడు. రితుపర్ణ సహాయంతో జూదంలో సోదరుడు పుష్కరుడిని ఓడించి, అతను చేసిన తప్పును క్షమించి, అతనిని తన బానిసగా చేసుకున్నాడు. నలుడు కలి ప్రభావాన్ని అధిగమించి, తన రాజ్యాన్ని పొంది, దమయంతిని కలుసుకున్నాడు. నలదమయంతుల కథను ఎవరు చదివినా కలి దుష్ప్రభావాల ప్రభావితం ఉండదని కలి, నలుడిని వరం ఇచ్చాడు.
 
== ఇతర వివరాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2978712" నుండి వెలికితీశారు