"నలుడు" కూర్పుల మధ్య తేడాలు

== కథ ==
[[File:Nal-damyanti.JPG|thumb|right|నల్సరోవర్ మధ్యలో ఉన్న నల-దమయంతి సమాధి]]
12వ శతాబ్దపు వ్యాఖ్యల ప్రకారం, సంస్కృత సాహిత్యం ఐదు మహాకావ్యాలలో [[శ్రీహర్షుడు]] రాసిన [[నైషాధ చరిత]] ఒకటి.<ref>{{cite book | title=The Indian Encyclopaedia | publisher=Genesis Publishing | page=5079 | url= https://books.google.com/books?id=ncL8Ve9FqNwC&pg=PA5079&dq=Naishadha&q=Naishadha}}</ref><ref name=Kunhan>{{cite book |title = Survey of Sanskrit Literature | author = C.Kunhan Raja | publisher = Bharatiya Vidya Bhavan | pages = 136, 146–148 | url = https://www.scribd.com/doc/223739875/Survey-of-Sanskrit-Literature-C-Kunhan-Raja}}</ref>{{rp|136}} నలుడు నిషాధ రాజ్యానికి రాజు. స్వయంవరంలో దమయంతి నలుడుని వరించింది.
 
దేవతలందరూ నలుడి లక్షణాలను ప్రశంసిస్తూ, దంపతులను ఆశీర్వదించి స్వయంవరం నుండి బయలుదేరారు. స్వయంవరం నుండి తిరిగివచ్చిన దేవతల ద్వారా స్వయంవరం విశేషాలు విన్న కలి పురుషుడు, దమయంతి ఒక మర్త్యుడిని వివాహం చేసుకుందన్న కోపంతో ఆమె జీవితాన్ని నాశనం చేస్తానని, వాలిద్దరిని వేరు చేస్తానని శపథం చేసాడు. నలుడిలో ఒక చిన్న తప్పును కనిపెట్టి అతని మనసు మళ్ళించడానికి కలికి పన్నెండు సంవత్సరాలు పట్టింది. చెడు ప్రభావానికి గురైన తరువాత, నలుడు తన సోదరుడు [[పుష్కరుడు|పుష్కరుడి]]తో పాచికల ఆట ఆడి తన సంపదను, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. రాజ్యం నుండి వెళ్ళిపోయేముందు దమయంతి తన పిల్లలను రథసారధితో తన తండ్రి రాజ్యానికి పంపించింది. నలదమయంతులకు ఎవరు సహాయం చేసినా వారికి రాజ్య బహిష్కరణ శిక్ష పడుతుందని పుష్కరుడు హెచ్చరించాడు. దమయంతి నిద్రపోతున్నప్పుడు కలి ప్రభావంతో నలుడు ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2978713" నుండి వెలికితీశారు