మారేమండ రామారావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎రచనలు: AWB తో "మరియు" ల తొలగింపు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
'''మారేమండ రామారావు''' గారు ప్రముఖ చరిత్ర పరిశోధకులు.
==జీవిత విశేషాలు==
ఆయన [[1906]] [[నవంబరు 26]] న జన్మించారు (పరాభవ మార్గశిర శుద్ధ తయోదశినాడు).పశ్చిమ గోదావరిజిల్లా పట్టిసీమ సమీపంలోనున్న పోలవరం సమీపంలో జన్మించారు.తల్లి లక్ష్మీభాయమ్మ; తండ్రి వేంకటకృష్ణారావు గారు.రామారావుగారు 1925లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులయ్యేవరకు రాజమహేంద్రవరంలో విద్యాసముపార్జన గావించారు.వారు బి.ఏ.ఆనర్సు మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో చదివి 1928లో డిగ్రీ సంపాదించారు.1928-31 మధ్య ఆచార్య శ్రీ.కె.ఏ.నీలకంఠశాస్త్రి గారి పర్యవేక్షణ క్రింద మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధన గావించారు.ఓరుగల్లు ను పాలించిన కాకతీయులు (Kakatiyas of Warangal) అను వారి పరిశోధనా గ్రంధానికి పి.హెచ్.డి పట్టం వచ్చింది.మద్రాసు విశ్వవిద్యాలయంలో చారిత్రక విషయంపై పరిశోధన గావించి పి.హెచ్.డి పట్టాన్ని గైకొన్న ప్రధమాంధ్రులు శ్రీ [[నేలటూరి వేంకటరమణయ్య]] గారు ద్వితీయులు శ్రీ రామారావుగారు. [[మద్రాసు]] విశ్వవిద్యాలయంలో విద్యార్థి దశలోనే చరిత్ర పరిశోధనా రంగంలో ప్రవేశించి గాఢాధ్యయనం చేసారు. ప్రముఖ పరిశోధకుల వద్ద శిక్షణ పొందారు. [[గుంటూరు]] హిందూ కాలేజీలో హిస్టరీ అధ్యాపకునిగా కొద్దికాలం పనిచేశారు. "శాతవాహన చరిత్ర" అంశాంతో ప్రారంభమైన కాలక్రమంలో "ఆంధ్ర చరిత్ర"<ref>[https://books.google.co.in/books/about/Inscriptions_of_A%C5%86dhrad%C4%93%C5%9Ba_Compiled_a.html?id=nrMHMwEACAAJ&redir_esc=y Inscriptions of Aņdhradēśa ... Compiled and edited by Dr. M. Rama Rao]</ref>కు సంబంధించి అన్ని కోణాలలోనూ పరిశోధనా పటిమను వృద్ధి చేసుకున్నారు. వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ([[తిరుపతి]]), నిజాం కళాశాల ([[హైదరాబాదు]]) లలో చరిత్ర అధ్యాపకునిగా ఉంటూ అనేక మంది పరిశోధక విద్యార్థులకు మార్గదశకత్వం యిచ్చారు. స్వయంగా పరిశోధనలు చేసి, తమ కృషికి మెరుగులు పెట్టి వెలువరించిన "[[కాకతీయ సంచిక]]" ప్రసిద్ధి పొందింది<ref>[{{Cite web |url=http://www.southasiaarchive.com/Content/sarf.120036/205980/011 |title=Journal of the Andhra Historical Research Society > Volume IX, Issue 3, 1935 > Publications of the Andhra Historical Research Society. Kakatiya Sanchika in (Telugu)] |website= |access-date=2015-08-08 |archive-url=https://web.archive.org/web/20151011104708/http://www.southasiaarchive.com/Content/sarf.120036/205980/011 |archive-date=2015-10-11 |url-status=dead }}</ref>. సమకాలికంగా లభ్యమైన శాసనాలూ, ఇతర సాధన సంపత్తి ఆధారంతో సుదీర్ఘమైన ఉపోధ్ఘాతంతో రాసిన ఈ గ్రంథం ఎంతోమందిని ఆకర్షించింది. కొంతమందిని వికర్షించింది. చర్చోపచర్చలకు ఆలవాలమైంది.
 
రామారావుగారు 1932 నుండి 1935 వరకు గద్వాల సంస్థానంలో ఉండి ఆ సంస్థాన చరిత్రపై పరిశోధన గావించి ఒక గ్రంధాన్ని వ్రాశారు.అది గ్రంధరూపంలో వెలువడకపోయినా దానిలోని ప్రధానాంశాలు ఆంధ్రేతిహాస పరిశొధకమండలి పత్రికలో ప్రకటింప బడ్డాయి. రామారావుగారు 1935 జూన్ నుండి 1949 జనవరి వరకు గుంటూరు హిందూ కళాశాలలో చరిత్రోపన్యాసకులుగా పనిచేశారు.1949 జనవరిలో వారు హైదరాబాదులోని నిజాం కళాశాలలో ఉపన్యాసకులుగా ప్రవేశించి తరువాత రీడరు, ప్రొఫసెరు పదవులనుకూడా నిర్వహించారు.1959 ఆగష్టులో వారు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయములో చరిత్ర శాఖాధ్యక్షులుగా నియమించబడ్డారు.వారా పదవిని మంచి సామర్ధ్యంతో 7సం.నిర్వహించి 1966 నవంబరులో ఉద్యోగ విరమణం గావించారు.కాని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారు వారిని 1967 జనవరిలో గుంటూరు హిందూ కళాశాలలో ప్రొఫెసర్ గా నియమించారు.1973 అక్టోబర్ 26వ తేదీన వారు దివంగతలయ్యేవరకు ఆపదవిని నిర్వహిస్తూనే ఉన్నారు.
"https://te.wikipedia.org/wiki/మారేమండ_రామారావు" నుండి వెలికితీశారు