"వెల్లాల సదాశివశాస్త్రి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
 
'''వెల్లాల సదాశివశాస్త్రి '''(1861-1925) [[మహబూబ్ నగర్ జిల్లా]]కు చెందిన [[కవి]]. జిల్లాలోని [[పెబ్బేరు]] మండలంలోని [[అయ్యవారిపల్లె]] ఇతని స్వగ్రామం<ref>తెలుగు సాహితీ వేత్తల చరిత్ర, రచన: మువ్వల సుబ్బరామయ్య, కృష్ణవేణి పబ్లికేషన్స్, విజయవాడ,2014, పుట-28.</ref>. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి శంకరజ్యోసులు. ఇతడు [[జటప్రోలు సంస్థానం]]లో నివసించాడు. ఇతడు ప్రధానంగా [[చరిత్ర]] సంబంధిత రచనలు చేశాడు. [[సురభి మాధవ రాయలు]] వ్రాసిన [[చంద్రికా పరిణయం]] కావ్యానికి అవధానం శేషశాస్త్రితో కలిసి వ్యాఖ్య వ్రాశాడు. ఇతడు మొత్తం 27 గ్రంథాలు రచించాడు. వాటిలో 15 గ్రంథాలు మాత్రం ముద్రించబడ్డాయి<ref name="జిల్లా సాహిత్య చరిత్ర">{{cite book |last1=గుడిపల్లి నిరంజన్ |title=నాగర్‌కర్నూల్ జిల్లా సాహిత్యచరిత్ర |date=మే 2019 |publisher=తెలంగాణ సాహిత్య అకాడమీ |location=హైదరాబాద్ |page=25 |edition=1 |url=http://tsa.telangana.gov.in/nagarkurnool-jilla-sahitya-charithra/ |accessdate=31 March 2020}}</ref>. [[తెల్కపల్లి రామచంద్రశాస్త్రి]]తో ఇతనికి సాహిత్యపరమైన వాదవివాదాలు చెలరేగినాయి. రామచంద్రశాస్త్రి ''భారతీ తారామాల'' రచన చేస్తే దానిని ఇతడు ''భారతీతారామాల ఖండనము'' అనే పేరుతో విమర్శించాడు. ఇతడు "రామచంద్ర పంచకము" పేరుతో రామచంద్రశాస్త్రిని విమర్శిస్తే, తెల్కపల్లి రామచంద్రశాస్త్రి "సదాశివాష్టకము" పేరుతో బదులు ఇచ్చాడు. ఇలా ఇరువురూ నిందాపూర్వక పద్యాలు వ్రాసుకున్నారు<ref>{{cite book |last1=గుడిపల్లి నిరంజన్ |title=నాగర్‌కర్నూల్ జిల్లా సాహిత్యచరిత్ర |date=మే 2019 |publisher=తెలంగాణ సాహిత్య అకాడమీ |location=హైదరాబాద్ |page=42 |edition=1 |url=http://tsa.telangana.gov.in/nagarkurnool-jilla-sahitya-charithra/ |accessdate=31 March 2020}}</ref>.
 
== రచనలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2979594" నుండి వెలికితీశారు