"కేశవపంతుల నరసింహశాస్త్రి" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
కేశవపంతుల నరసింహశాస్త్రికి చిన్నతనంలోనే ఆశు కవితాధార అబ్బింది. పదహారు సంవత్సరాల వయసులోనే [[వనపర్తి]] రాజుల పూర్వపు రాజధాని అయిన [[శ్రీరంగాపురం]]లోని శ్రీరంగనాథస్వామి ఉత్సవాల సందర్భంగా విర్వహించే కవిగాయక సభలలో పాల్గొని, నాటి రాజు తృతీయ రామేశ్వరరావుపై పద్యాలు వినిపించి, మెప్పు పొందాడు. నాటి నుండి మొదలుకొని సుమారు దశాబ్దం పాటు ప్రతియేడు ఆ సభలలో పాల్గొని వార్షిక సన్మానాలు పొందిన కవివరేణ్యులు.
[[మహబూబ్ నగర్ జిల్లా]]లో సాహితీ పోషణలో పేరెన్నికగన్న [[గద్వాల]], [[ఆత్మకూరు]], [[జటప్రోలు]] తదితర సంస్థానాలలో కూడా తమ పాండిత్యాన్ని ప్రదర్శించి గౌరవ సత్కారాలు పొందాడు. శాస్త్రి ప్రౌడకవిగానే కాకా సద్విమర్శకులు కూడా. [[రఘువంశము|రఘువంశం]]<nowiki/>పై వీరి వ్యాఖ్యానం వీరి విమర్శనా ప్రతిభకు గీటురాయి. ప్రబంధ పాత్రలు అను వీరి రచన సాహిత్య శాస్త్రంలో వీరెంత ప్రవీణులో, వీరికెంత సూక్ష్మపరిశీలనా శక్తి ఉందో తెలియజేస్తుంది. ' సంస్థానాలు- సాహిత్య పోషణ ' అను వీరి గ్రంథం సంస్థానాలతో వారికిగల పరిచయాన్ని, అనుబంధాన్ని తెలియజేస్తుంది<ref>పాలమూరు ఆధునిక యుగకవుల చరిత్ర,, రచన: ఆచార్య ఎస్వీ రామారావు, పసిడి ప్రచురణలు, [[హైదరాబాద్]],2012, పుట-61</ref>.
శాస్త్రిగారు కవి, విమర్శకులే కాదు గొప్ప వక్త కూడా. గంభీరస్వరంతో పద్యాలను ధారాళంగా పాడుతూ గంటలకొద్ది ఉపన్యసించేవారట. సురభి మాధవరాయ ప్రభు [[సంస్కృతం]]లో రాసిన [[చంద్రికా పరణయముపరిణయము]] కావ్యాన్ని శాస్త్రి [[తెలుగు]]<nowiki/>లోనికి అందరికీ అర్ధమయ్యే విధంగా అనువదించారు.
 
== రచనలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2979633" నుండి వెలికితీశారు