చర్చ:వాసి (ప్రసిద్ధి): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 94:
:::::# ఈ పేజీకి అంతర్వికీ లింకు ఇవ్వదగిన ఎన్వికీ పేజీని చూడండి, అందులో ఏ సమాచారం ఉందో పరిశీలించండి అని నేను చెప్పాను. కానీ మీరు ఆ పని చెయ్యలేదు. వాసి (ప్రసిద్ధి) కి అతి దగ్గరి ఇంగ్లీషు అర్థం "fame". మీరు దాన్ని పరిశీలించారో లేదో చెప్పలేదు. పరిశీలించలేదనే అనుకుంటున్నాను. కనీసం ఇప్పుడైనా [[:en:Fame|దాని ఎన్వికీ పేజీ]]] చూడండి. అదొక "అయోమయ నివృత్తి పేజీ". ఈ పేజీ తొలగింపుకు దీన్ని కారణంగా నేను చూపడం లేదు. ఎన్వికీ వ్యాసాల ప్రసక్తి మీరే తెచ్చారు, అందుకే నేనూ ఆ ప్రసక్తి తెచ్చాను. "వాసి (ప్రసిద్ధి)" పేజీకి మీరు చూపిన వ్యాసాల కంటే బాగా దగ్గరిగా ఉన్న పేజీ ఇది. ఈ కొలబద్ద ప్రకారం చూసినా ఈ నిర్ణయం తప్పే అని తేలుతోంది.
::::: పై విషయాలన్నిటినీ చూస్తే ఈ చర్చలో మీరు చేసిన నిర్ణయం సరైనది కాదని తేలుతోంది. అది సరైనదే అని చెప్పే ఆధారం ఒక్కటి కూడా మీరు చూపించలేదు. __[[User:Chaduvari|చదువరి]] ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]]) 05:41, 9 జూలై 2020 (UTC)
ఇక్కడ చర్చ జరిగింది, సభ్యుల అభిప్రాయాలు వెల్లడయ్యాయి, చివరికి నిర్ణయం కూడా వెలువడింది. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]]గారు చెప్పినట్లు చర్చ ప్రధానంగా '''నిఘంటువులో ఉండవలసిన పదం ఇక్కడ ఉండకూడదు''' అనే విషయంపైనే సాగింది. ప్రస్తుతం పేజీలో కేవలం డిక్షనరీ మాదిరిగా అర్థం ఇచ్చే సమాచారం మాత్రమే కాకుండా మరికొంత సమాచారం/విభాగాలు కూడా ఉంది/ఉన్నాయి. అంతేకాకుండా ఈ పేజీని ఒక మంచి అయోమయనివృత్తి పేజీగా చేయడానికి మేలైన అవకాశం ఉంది. కాని చర్చ ఆ దిశలో సాగలేదు. కాబట్టే అన్ని అంశాలు పరిశీలించి తొలగింపునకు నేను సరైన కారణాలు లేవన్నాను. సభ్యులు అర్థం చేసుకుంటారనుకున్నాను. కాని నిర్ణయం జరిగిననూ దానిపైనా చర్చ కొనసాగుతోంది. అర్జునగారి నిర్ణయం స్పష్టంగానే ఉన్ననూ [[User:Chaduvari|చదువరి]] గారు మొదట లేవనెత్తిన 4 సందేహాలు కూడా సరైనవిగా లేవు.

1) '''ప్రస్తుతం ఈ పేజీలో ఉన్న సమాచారాన్ని బట్టి, పేజీని తొలగించాలా లేదా అనేది నిర్ణయించాలి. దాని గురించి అసలు మాట్లాడారా మీరు? లేదు. అస్సలు మాట్టాడలేదు'''. → ఆంగ్ల వికీపీడియా వ్యాసాల మాదిరిలో వ్యాసాన్ని విస్తరించవలసినదిగా సూచించడమైనది అని నిర్ణయంలో చెప్పారు కాబట్టి సరిపోయింది (అంటే తొలగింపు అవసరం లేదని స్పష్టమౌతోంది)

2) '''ఇది ఎంత అసంబద్ధంగా ఉందో చూడండి.. ''' → ఇందులో అసంబద్ధత ఏముంది? వ్యాసం లేదా అయోమయ నివృత్తి పేజీలలో ఏదో ఒక విధంగా చేయడానికి అవకాశముంది అనేది అర్థమౌతోంది.

3) '''పోనీ ఆ ఉదాహరణలను ఇస్తూ ఆ పేజీల పద్ధతిలోనే ఈ పేజీని కూడా వికీపీడియా యోగ్యంగా ఎలా విస్తరించవచ్చో చెప్పారా? లేదు! ఎలాంటి సమాచారం రాయొచ్చో చెప్పారా? లేదు!''' → పరిష్కారం చెబితే మంచితే మంచిదే కాని నిర్ణయం చెప్పేవారే ఖచ్చితంగా పరిష్కారం కూడా చూపాలనే నియమం ఉందా?

4) '''పోనీ అదే ఇంగ్లీషు వికీపీడియాలో ఈ పేజీకి (వాసి (ప్రసిద్ధి)) సంబంధించిన పేజీ ఏమైనా ఉందా అని చూసారా? ఉంటే ఏంటా పేజీ? ఆ పేజీలో ఎలాంటి సమాచారం చేర్చారు?''' → ఆంగ్లవికీలో పేజీ ఉంటేనే తెవికీలో పేజీ ఉండాలనే నియమం ఉందా?

దీనికి అర్జునగారు సమాధానం ఇస్తూ '''ఇంతకు ముందు చెప్పినదానికి అదనంగా నేను చెప్పవలసినదేమీలేదు''' అన్నారు. అయిననూ మళ్ళీ ఐదు సందేహాలు సంధించారు. ఈ ఐదు సందేహాలు కూడా పై లాంటివే!

తెవికీని ముందుండి నడిపించేవారు ఉన్న పేజీలను ఏ విధంగా అభివృద్ధి చేసి తెవికీ పాఠకులకు ఉపయోగకరంగా మరల్చాలో హుందాగా ఆలోచించాలి కాని సరైన కారణం లేకున్ననూ తొలగించాలని పట్టుపట్టడం మంచి పద్దతి కాదు. తెలియని వారు తొలగించడానికి ప్రయత్నించిననూ సాధ్యమైనంత వరకు ఉన్న పేజీలను కాపాడుకోవాలి. ఇక్కడ ఎవరేమి చేసిననూ పాఠకుల కోసమే, కాబట్టి పాఠకుల ప్రయోజనం గురించే ఆలోచించాలి. ప్రతిదానికీ బాగా ఆలోచిస్తే పరిష్కారాలు తప్పకుండా లభ్యమౌతాయి. చర్చ జరిగిన పిదప నిర్ణయంపై అభ్యంతరం లేవనెత్తరాదని నేను చెప్పడం లేదు. అవసరమైతే నిర్ణయాన్ని కూడా మార్చవచ్చు కాని ఇక్కడ చర్చను మరియు ప్రతిపాదనకు స్పందనలను పరిశీలిస్తే నిర్ణయం సరైనదేనని తెలుస్తోంది. ఇక నా అభిప్రాయం చెప్పాలంటే ఈ పేజీని వ్యాసం పేజీగా కంటే ఒక అయోమయనివృత్తి పేజీగా చేయడమే బాగుంటుంది (బ్రాకెట్‌లో ఉన్న అర్థాన్ని మాత్రం తీసివేయాలి). అసలు ఇప్పుడున్న పేజీ కూడా వ్యాసం పేజీ కంటే అయోమయనివృత్తి పేజీ లక్షణమే ఎక్కువ కల్గియుంది. వాసి అంటే ఒక అర్థమే కాదు చాలా అర్థాలున్నాయి. అవన్నీ ప్రారంభంలోనే వ్రాయాలి. ఆ తర్వాత ఒక్కో విభాగంలో వాసి పేరుతో ఉన్న ప్రాంతాలు, వాసి పేరుతో ఉన్న వ్యక్తులు, వాసి పదాలున్న సామెతలు, వాసి పదాలున్న జాతీయాలు, వాసి పేరుతో ఉన్న ఇతరాలు ... తదితర విభాగాలతో ఒక మంచి అయోమయనివృత్తి పేజీ తయారై పాఠకులకు చాలా ఉపయోగపడవచ్చు. ఇతర సభ్యులు కూడా ఇంకనూ ఆలోచిస్తే మరింత మెరుగైన పేజీ తయారౌతుంది. అంతేకాని ఏ విధంగా చూసిననూ ఈ పేజీ తొలగింపునకు అవకాశం మాత్రం లేదు. [[సభ్యుడు:C.Chandra Kanth Rao| సి. చంద్ర కాంత రావు]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|- చర్చ ]] 20:00, 9 జూలై 2020 (UTC)
Return to "వాసి (ప్రసిద్ధి)" page.