వర్గం చర్చ:పార్టీలు ఫిరాయించిన రాజకీయ నాయకులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 6:
:: ప్రతిపాదన సరైనది. అసమంజసం అని కాదు. తటస్థ దృక్కోణానికి దెబ్బ అని. ఎవరిది ఫిరాయింపో, ఎవరిది మార్పో ప్రజలే నిర్ణయించే పని పెట్టుకోలేదు, మనమెందుకు నిర్ణయించాలి అని. కాబట్టి, ప్రతిపాదనను బలపరుస్తున్నాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 09:50, 7 జూలై 2020 (UTC)
:::నాకు అభ్యంతరమేమీ లేదు.[[User:K.Venkataramana|''' <span style="font-family:Jokerman; color: #0047AB">K.Venkataramana</span>''']][[User talk:K.Venkataramana|(talk)]] 10:06, 7 జూలై 2020 (UTC)
:::: పార్టీ '''మారిన''' మరియు పార్టీ '''ఫిరాయించిన''' దానికి చాలా తేడా ఉంది. అధికారంలో లేని నాయకుడు ఒక పార్టీ నుంచి మరోపార్టీలోకి వెళితే దాన్ని పార్టీ మారడం అంటారు. అధికారికంగా ఎన్నికలలో ఒక పార్టీ టికెట్టుపై గెలుపొంది నియమావళికి విరుద్ధంగా మరోపార్టీలోకి వెళితే లేదా పార్టీ అధికారికంగా జారీచేసిన విప్‌ను ఉల్లంఘించినా దాన్ని పార్టీ ఫిరాయింపుగా పరిగణిస్తారు. ఇలాంటి ఆయారాం గయారాంలను అరికట్టడానికి 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకురాబడింది. ఈ చట్టానికి 91వ సవరణ ద్వారా మరింత కట్టుదిట్టం చేశారు. కాని ఈ వర్గంలోని వ్యాసాలు చూస్తే చట్టాన్ని అతిక్రమించి చేసిన ఫిరాయింపులేమీ ఒకటి అరా తప్ప కనిపించడం లేదు. అదే సమయంలో పార్టీలు మారిన వారిని ఈ వర్గంలో పెట్టాలంటే దాదాపు అందరూ వస్తారు. పార్టీలు మారిన వారికి నిర్ణయించడంపై పూర్తి సమాచారం కూడా లభ్యంకాకపోవచ్చు. ఇక్కడ మరో సమస్య ఏమిటంటే పార్టీలకు పార్టీలే మారినప్పుడు సభ్యులకు ఎలా పరిగణించాలనేది? ఉదా:కు జనసంఘ్ → జనతాపార్టీ → భాజపా, కాంగ్రెస్ → కాంగ్రెస్ ఐ → కాంగ్రెస్ (ఇందిరాగాంధీ, వాజపేయి లాంటి వారు కూడా ఇందులో చేరుతారు). ఇక మరో సమస్య చూద్దాం: పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వారిని ఎలా పరిగణించాలి అనేది. సాక్షాత్తు పార్టీ స్థాపకుడైన ఎన్టీఆర్‌ కూడా దీనికి అతీతుడు కాదు. పార్టీ విలీనాలను ఎలా పరిగణించాలనేది మరో సమస్య (ఉదా: ప్రజారాజ్యం → కాంగ్రెస్, చిరంజీవి లాంటి వారు ఈ కోవలోకి వస్తారు). కాబట్టి ఈ విషయాలన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తర్వాత ఇబ్బందులు తలెత్తకుండా వర్గాన్ని ఎలా మార్పు చేసినా నాకు అభ్యంతరం లేదు [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 20:37, 9 జూలై 2020 (UTC)
Return to "పార్టీలు ఫిరాయించిన రాజకీయ నాయకులు" page.