అత్తా ఒకింటి కోడలే: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సూర్యకాంతం నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 30:
 
==కథ==
తాయారమ్మ భర్త సుబ్బారాయుడు. తాయారమ్మ ప్రతాపానికి జడిసి అత్త పార్వతమ్మ తన దూరపు చుట్టం ఇంట్లో కాలక్షేపం చేస్తూ ఉంటుంది. తాయారమ్మ కొడుకు రఘు బస్తీలో చదువుతూ శోభ అనే చిన్నదాన్ని ప్రేమిస్తాడు. శోభ తల్లి సుందరమ్మ గయ్యాళి. సుందరమ్మ కొడుకు చంద్రం మెత్తనివాడు. వియ్యంకుడు కట్నం ఇవ్వలేదని సుందరమ్మ కోడలు లక్ష్మిని కాపరానికి తీసుకురాలేదు. ఈ స్థితిలో రఘు శోభను పెళ్లి చేసుకోవాలంటే ముందుగా సుందరమ్మ తన కోడలిని ఇంటికి తెచ్చుకోవాలని షరతు పెడతాడు. లక్ష్మిని సుందరమ్మ హింస పెడుతూవుంటుంది. తాయారమ్మ శోభను మితిమీరిన ప్రేమతో అవస్థలు పెడుతూవుంటుంది. శోభ కొన్నాళ్లు క్షోభను సహించినా ఒక సారి అత్తను ఎదిరిస్తుంది. ఇంట్లో కలతలు రేగుతాయి. తాయారమ్మ కొడుకు విసుగెత్తి ఉద్యోగం చూసుకోవడానికి పట్నం పోతాడు. అక్కడ సుందరం కూడా అదే పని చేస్తాడు. చెదిరిపోయిన కుటుంబాలను కలపడానికి తండ్రి సుబ్బారాయుడు, కొడుకు రఘు ఒక పథకం వేస్తారు. రఘు తాగుబోతుగా నటించి తన అత్తగారు సుందరమ్మను హడలెత్తిస్తాడు. ఇటు సుబ్బారాయుడు తన తల్లికి దయ్యంపట్టినట్లు నటింపజేసి తాయారమ్మను హడలగొడతాడు. అత్తలిద్దరూ వీధిన పడి చివరకు రెండు కుటుంబాలూ చక్కబడడంతో కథ సుఖాంతమౌతుంది<ref>{{cite news |last1=సంపాదకుడు |title='అత్తా ఒకింటి కోడలే' |url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=27741 |accessdate=30 January 2020 |work=ఆంధ్రపత్రిక దినపత్రిక |date=5 October 1958 }}{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/అత్తా_ఒకింటి_కోడలే" నుండి వెలికితీశారు