సుద్దాల హనుమంతు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 5:
[[నల్లగొండ]] జిల్లా [[మోత్కూరు]] మండలంలోని [[పాలడుగు (మోతుకూరు)|పాలడుగు]] గ్రామంలో [[1910]], [[జూన్]] నెలలో పేద [[పద్మశాలి]] [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లోని బుచ్చిరాములు, లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించిన హనుమంతు ఇంటి అసలు పేరు గుర్రం. కానీ, తర్వాత ఆయన [[గుండాల (నల్గొండ)|గుండాల]] మండలం, [[సుద్దాల (గుండాల మండలం)|సుద్దాల]] గ్రామంలో నివసించడంతో ఆ ఊరు పేరే ఇంటి పేరుగా మారింది. సుద్దాల హనుమంతు పేరు ఒక్క [[తెలంగాణ]] కే పరిమితం కాలేదు, యావదాంధ్ర దేశం మారుమోగిందంటే అతిశయోక్తి కాదు. పాట ద్వారా ప్రజల్లో ప్రచారమై ప్రజాకవిగా నిలబడ్డారు. నాటి [[నిజాం]] వ్యతిరేకోద్యమంలో బతికున్నంతకాలం ప్రజల బాణీలోనే పాటలందించి పోరాటాలకే తన జీవితాన్ని అంకితం చేసిన అచ్చమైన ప్రజాకవి సుద్దాల హనుమంతు. హన్మంతు తండ్రి [[ఆయుర్వేద]] వైద్యవృత్తితో కుటుంబం గడుస్తోంది. చిన్ననాటి నుంచే హరికథలు, పాటలు, నాటకాలంటే హనుమంతుకు చాలా ఇష్టం. హరికథలు చెప్పే అంజనదాసు శిష్యుడై, ఆయన బృందంలో చేరాడు. హన్మంతు బతుకుతెరువు కోసం ఉద్యోగానికి [[హైదరాబాదు]] చేరాడు. ప్రభుత్వ [[కార్యాలయం]]<nowiki/>లో అటెండరుగా పనిచేశాడు. [[ఆర్యసమాజం]] వైపు ఆకర్షితుడై కార్యకర్తగా పనిచేశాడు.
 
== తెలంగాణ ఉద్యమంలో ==ok
==
విద్య పెద్దగా లేదు- ఆనాడు చదువుకు అవకాశాల్లేవు. వీధిబడిలో [[ఉర్దూ]], [[తెలుగు]] భాషలు నేర్చుకున్నాడు. [[శతకాలు]], [[కీర్తనలు]], సీస, కంద పద్యాలు కంఠస్థం చేశాడు. బాల్యంలో [[యక్షగానాలు]], [[కీర్తనలు]], భజనల్లాంటి కళారూపాలంటే ఆసక్తి వుండేది. అందుకే యక్షగానాల్లో పాత్రలు ధరించారు. గొంతెత్తి పాడటం నేర్చుకున్నాడు. చిన్నతనం నుండే నాటకాల పై ఆసక్తిని పెంచుకున్న హనుమంతుకు ప్రజా కళారూపాలైన [[హరికథ]], బురక్రథ, యక్షగానాలే తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రచారాసాధనాలుగా ఉపయోగపడ్డాయి. ఆయన బురక్రథ చెబితే ఆనాడు గడ్డిపోచ కూడా యుద్ధానికి సిద్ధమయ్యేదని జనంలో ప్రచారం బలంగా ఉండేది. [[హైదరాబాద్‌]] సంస్థానంలో జరిగిన అనేక అక్రమాలను, భూస్వాముల దురాగతాలను, దొరల దౌర్జన్యాలను బురక్రథల రూపంలో చాటి చెప్పారు. విచిత్ర వేషాలు, ‘గొల్లసుద్దులు’, ‘లత్కోరుసాబ్‌’, ‘బుడబుక్కలు’, ‘ఫకీరు వేషం’, ‘సాధువు’ మొదలైన కళా రూపాల ద్వారా పీడిత వర్గాల బాధల్ని, భావాల్ని వ్యక్తీకరించాడు.
 
"https://te.wikipedia.org/wiki/సుద్దాల_హనుమంతు" నుండి వెలికితీశారు