ఆంధ్ర మహాసభ (తెలంగాణ): కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో వర్గం మార్పు
#WPWP
పంక్తి 16:
==మహాసభలు==
;మొదటి ఆంధ్రమహాసభ:
[[File:First Andra Mahasabha .jpg|thumb|right|200px|ఎం.జయంత్ చిత్రించిన ప్రథమ ఆంధ్ర మహాసభ దృశ్యం]]
ఆంధ్రజన కేంద్ర సంఘం ఆధ్వర్యాన తెలుగు భాష, సంస్కృతుల పునరుజ్జీవనం కోసం, ఫ్యూడల్ దురంతాలకు వ్యతిరేకంగానూ చెదురుమదురుగా సాగుతున్న ఉద్యమాలు వాగులన్నీ చేరిన మహానది అయినట్లుగా మహోద్యమ స్థాయికి చేరాయి. [[1930]]లో [[జోగిపేట]]లోప్రథమాంధ్ర మహాసభ జరిగింది. ఆ మహాసభకు రాష్ట్రంలోని తెలుగు ఉద్యమాలన్నీ వచ్చి కలిశాయి. [[రూపాయి]] రుసుము చెల్లించిన ప్రతివారు ఆ మహాసభకు ప్రతినిధే. అప్పటికి ఒక నిర్ధిష్టమైన నిబంధనావళి ఈ మహాసభకు లేదు. దానికి [[సురవరం ప్రతాపరెడ్డి]] అధ్యక్షత వహించాడు. ఈ మహాసభలో ఇతర సమస్యలెన్ని వున్నా, సాంఘిక సమస్యలే తీవ్రమైన చర్చకు వచ్చాయి. బాల్యవివాహాలు, [[వితంతు వివాహం|వితంతు]] వివాహాల మీద మహాసభ తీర్మానాలు చేసింది. ఈ సభలో మరాఠీ నాయకుడైన వామన్ నాయక్ ప్రధాన పాత్ర వహించాడు. ఆనాటికింకా ప్రజల్లో తగు చైతన్యం రాలేదనడానికి ఆ సభలో జరిగిన ఒక సంఘటన చెపితే చాలును. భాగ్యరెడ్డి అనే హరిజన నాయకుడు మహాసభకు ప్రతినిధిగా వచ్చాడు. అతను ఒక సమస్యపైన మాట్లాడబోయే సరికి సవర్ణులైన వర్తకులు కొందరు ఆసమ్మతిగా సభ నుంచి వెళ్ళిపోయారు. ఏది ఏమైనా ఈప్రథమాంద్ర మహాసభలో ఛాందసులదే పైచేయి ఆయింది.