చండ్ర రాజేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి fix dead dli link
ట్యాగు: 2017 source edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 40:
[[మానవతా వాది]] అయిన రాజేశ్వరరావు పార్టీ కార్యాలయాలలో పనిచేసే చిన్న కార్యకర్తలను సైతం ఆప్యాయంగా పలకరించేవాడు. [[కారు]]గానీ, కార్యదర్శిగాని లేకుండానే పని నిర్వహించారు [[ఢిల్లీ]] లో వేసవిలో ఉష్ణోగ్రత భరించరానంత ఉన్నప్పటికీ [[కూలర్‌]] కాని, ఎముకలు కొరికే చలి ఉన్నా హీటర్‌ కానీ వాడలేదు. పార్టీ క్యాంటీన్‌లో వాలంటీర్లతో కలిసే భోజనం చేసేవాడు. "నాకు ఆస్తిపాస్తులు లేవు. నేను ఎవరికీ ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు. ఎవరి నుంచీ ఏమీ తీసుకోలేదు" అనేవాడు. [[పంచె]] కాలిపైకి కట్టి, నెత్తికి తలగుడ్డ చుట్టి గ్రామీణ ప్రజలతో కలిసిపోవడం ఆయన నైజం. గ్రాంథిక భాష వాడడు. ఎదుటివారు తన వైఖరిని, విధానాలను విమర్శించినా చాలా ఓపికతో వినేవాడు. [[మహిళలు]] సభలకు హాజరయ్యేందుకు వీలుగా రాత్రి వేళల్లో సమావేశాలు పెట్టవద్దని సూచించేవాడు. హరిజన, గిరిజన, మైనారిటీ వర్గాలపై దాడులు జరిగితే వెంటనే స్పందించి స్వయంగా వెళ్ళేవాడు. ఉభయ [[కమ్యూనిస్టు]] పార్టీల ఐక్య కార్యాచరణ ముందుకు సాగాలని కోరుకునేవాడు. రాజేశ్వరరావు అనారోగ్యంతో బాధపడుతూ 1994 ఏప్రిల్ 9న మరణించాడు. ఆయన స్మారకార్ధం [[హైదరాబాదు]] శివార్లలోని [[కొండాపూర్‌]]లో ఉన్న [[చండ్ర రాజేశ్వరరావు‌ ఫౌండేషన్‌]]లో కాంశ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. [[శ్రీశ్రీ]] 1947లో భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్న చండ్రరాజేశ్వరరావును అనుసరించి ఎన్నికల సభల్లో పాల్గొనేవారు. ఈ సమయంలో చండ్ర రాజేశ్వరరావు [[నంద్యాల]] రాజకీయ సభలో శ్రీశ్రీని మొట్టమొదటి సారి [[మహాకవి]] అన్నారు, ఆ తర్వాత సాహిత్యలోకంలోనూ, సాధారణ ప్రజల్లోనూ కూడా శ్రీశ్రీకి మహాకవి అన్న బిరుదు స్థిరపడిపోయింది.<ref name="బూదరాజు రాసిన శ్రీశ్రీ జీవితచరిత్ర">{{cite book|last1=రాధాకృష్ణ|first1=[[బూదరాజు]]|title=మహాకవి శ్రీశ్రీ|date=1999|publisher=కేంద్ర సాహిత్య అకాడమీ|location=న్యూఢిల్లీ|isbn=81-260-0719-2|edition=ప్రథమ ముద్రణ}}</ref>
 
1969-73లలో జరిగిన వేర్పాటువాద ఉద్యమాల గురించి ఆయన రాసిన వ్యాసలను [[చండ్ర రాజేశ్వరరావు వ్యాసావళి-1969-73 వేర్పాటువాద ఉద్యమాలు]] పుస్తకం రూపంలో తెచ్చారు.<ref>{{cite book|last1=రాజేశ్వరరావు|first1=చండ్ర|title=చండ్ర రాజేశ్వరరావు వ్యాసావళి-1969-73 వేర్పాటువాద ఉద్యమాలు|url=https://archive.org/details/in.ernet.dli.2015.497282|publisher=Vishalandra%20Publishing%20Houseవిశాలాంధ్ర}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/చండ్ర_రాజేశ్వరరావు" నుండి వెలికితీశారు