పి.హేమలత: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
ఆ తర్వాత [[దుక్కిపాటి మధుసూదనరావు|దుక్కిపాటి మధుసూధనరావు]], [[అక్కినేని నాగేశ్వరరావు]] లు [[అన్నపూర్ణ పిక్చర్స్|అన్నపూర్ణా]] వారి [[దొంగ రాముడు (1955 సినిమా)|దొంగరాముడు]] లో దొంగరాముడి తల్లి పాత్ర ధరించడానికి అవకాశమిచ్చారు.
 
ఆ చిత్రం తరువాత ఆమెకు మరికొన్ని సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. [[గురజాడ అప్పారావు]] రాసిన నాటకం [[కన్యాశుల్కం (నాటకం)|కన్యాశుల్కం]] ను డి.ఎల్.నారాయణ తీస్తే అందులో విన్నకోట రామన్న పంతులు సరసన "వెంకమ్మ" పాత్రలో నటించింది. తరువాత [[సి.యస్.ఆర్. ఆంజనేయులు|సి.ఎస్.ఆర్]] గారితో [[నిత్య కళ్యాణం పచ్చ తోరణం|నిత్య కళ్యాణం-పచ్చతోరణం]] (1960), [[విఠల్ ప్రొడక్షన్స్]] వారి [[కన్యాదానం (1955)|కన్యాదానం]] (1955)లో [[షావుకారు జానకి]]<nowiki/>కే తల్లి సీతమ్మ పాత్ర, [[ఘంటసాల వెంకటేశ్వరరావు|ఘంటశాల]] గారి సొంత చిత్రం [[సొంతవూరు (1956 సినిమా)|సొంతవూరు]] (1956) లో [[నందమూరి తారక రామారావు|ఎన్.టి.రామారావు]] గారి తల్లి సుభధ్రమ్మ పాత్రను ధరించింది. తరువాత ఎన్నీ చారిత్రకాలు, పౌరాణికాలు, సాంఘికాలలో సుమారు 200 చిత్రాలలో నటించింది.
 
చాలా సినిమాలలో తల్లి పాత్రలే వేసినా అప్పుడప్పుడూ కొన్ని స్వభావానికి విరుద్ధమైన పాత్రలు కూడా వేసింది. [[ఇల్లరికం (సినిమా)|ఇల్లరికం]], [[శ్రీ తిరుపతమ్మ కథ|తిరుపతమ్మ కథ]], [[మల్లమ్మ కథ]] చిత్రాలలో గయ్యాళి పాత్రలను వేసింది. [[రాముడు భీముడు (1964 సినిమా)|రాముడు భీముడు]] చిత్రంలో [[నందమూరి తారక రామారావు|ఎన్.టి.రామారావు]]<nowiki/>కు అమ్మమ్మ గా కూడా నటించింది. [[సంపూర్ణ రామాయణం (1971 సినిమా)|సంపూర్ణ రామాయణం]] సినిమాలో [[కౌసల్య]] పాత్ర వేసింది.
 
తన కుమారుడు ఉద్యోగంలో స్థిరపడిన తరువాత సినిమాలలో నుండి విరమించుకున్నది. కానీ [[దేవీవర ప్రసాద్|దేవీ వరప్రసాద్]] అడిగితే కాదనలేక [[కథానాయకుని కథ (1975 సినిమా)|కథానాయకుని కథ]] (1975) లో నటించింది. ఆమె చివరి చిత్రం [[సీతమ్మ సంతానం]] (1976)
పంక్తి 28:
 
ఆమె సినిమాలు మానేసిన తర్వాత, దాదాపుగా 20 ఏళ్లు పాటు ఒక వృద్ధాశ్రమంలో (హైదరాబాదు) ఉండేది. ఆవిడ క్షేమంగానే ఉన్నా, చూడ్డానికి ఎవర్ని రానిచ్చేది కాదు. తన 93వ ఏట ఆమె మరణించింది. ఈ మరణవార్త ఎవరికీ తెలియలేదు. దత్తత తీసుకున్న కొడుకు పత్రికలకి చెప్పలేదు.<ref>{{Cite web|url=https://www.sitara.net/meeku-telusa/hemalatha%2c-d.hemalatha%2c-bhaktapatana%2c/15601|title=ఎవరికీ తెలియని... హేమలత|website=సితార|language=te|access-date=2020-07-12}}</ref>
 
== తరువాత జీవితం ==
ఆమె సినీ రంగానికి దూరంగా మద్రాసులో నాగార్జుననగర్ లో ఉన్న పెద్ద భవంతిని అమ్మివేసి హైదరాబాదు చేరుకుంది. ప్రజాపిత బ్రహ్మకుమారి శాంతి మార్గంలో ప్రశాంతజీవితం గడిపింది.<ref>{{Cite web|url=http://telugucinemacharitra.com/%e0%b0%a8%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%aa%e0%b0%bf-%e0%b0%b9%e0%b1%87%e0%b0%ae%e0%b0%b2%e0%b0%a4/|title=నటి పి. హేమలత|website=TELUGUCINEMA CHARITRA|language=en-US|access-date=2020-07-12}}</ref>
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
"https://te.wikipedia.org/wiki/పి.హేమలత" నుండి వెలికితీశారు