మత్స్య పురాణం: కూర్పుల మధ్య తేడాలు

చి వ్యాసం విస్తరణ,మూలాలతో
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{హిందూ మతము}}
'''మత్స్య పురాణం,''' అష్టాదశ పురాణాలలో పదహారో పురాణం.ఈ పురాణాన్ని "మత్స్యంమేధఃప్రకీర్యతే" అని వర్ణించబడింది.అంటే ఇది [[విష్ణువు|శ్రీ మహా విష్ణువు]] మెదడుతో పోల్చబడిన అర్థాన్ని సూచిస్తుంది. ఈ పురాణంలో 289 అధ్యాయాలు, పద్నాలుగు వేల శ్లోకాలున్నాయి.శ్రీ మహావిష్ణువు మత్స్యరూపంలో వైవస్వత మనువునకు ఈ పురాణాన్ని ఉపదేశించాడు. పురాణాలలో ఇది ప్రాచీనమైన పురాణంగా పండితులు భావిస్తారు.<ref>{{Cite book|url=https://kinige.com/book/Sri+Matsya+Puranam|title=శ్రీ మత్స్య పురాణం(Sri Matsya Puranam) By Dr. Jayanti Chakravarthi - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige}}</ref>వేద వాఙ్మయంలో దాగిన సృష్టితత్త్వాన్ని కథారూపంగా వివరించడానికి అష్టాదశ పురణాలను [[వ్యాసుడు|వ్యాసమహర్షి]] రచించాడు.ఇందులోని 289 అధ్యాయాలలో మొదటిది సృష్టిక్రమం.
 
== సృష్టిక్రమం ==
సృష్టికి పూర్వం విశ్వంలో ఏమి లేదు.మహా ప్రళయం జరిగాక చీకటి ఆవరించి సర్వప్రపంచం నిదురపోతునట్లుగా ఉంది.అప్పటి స్థితి ఇలాఉంది అని ఉహించటానికి,తెలుసుకోవటానికి కూడా వీలులేదు.దీనిని వర్ణించటానికి ఒక లక్షణం కూడాలేదు. విశ్వం అంతా నీటిమయమై అగోచరంగా ఉన్న పరిస్తితులలో అన్ని పుణ్యకర్మలకు మూలమైన అవ్యక్తుడు (వ్యక్తి కానివాడు) స్వయంభు అవతరించి,జగత్తును ఆవరించియున్న చీకటిని పారద్రోలి వెలుగును ప్రకాశింపచేస్తుంది.ఆ అవ్యక్తుడు గా అవతరించిన నారాయణుడే (మహా విష్ణువు) ధ్యానించి జగత్తును సృష్టించినట్లు మత్యపురాణంమత్య్యపురాణం ద్వారా తెలుస్తుంది.<ref name=":0">https://ia800407.us.archive.org/7/items/FacebookMohanPublications_20160528_1424/m.pdf</ref>
 
==== మొదటి సృష్టి ====
అవ్యక్తుని మొదటి సృష్టి అపస (పవిత్ర కర్మ).అందు బీజాన్ని సృష్టించాడు.అది సువర్ణభరితమై పదివేల [[సూర్యుడు|సూర్యుల]] వెలుగు చెంది,అది పుట్టుటకు వేయి సంవత్సరాల కాలం పట్టింది.మహా తేజస్వి అయిన స్వయంభువు విచిత్ర మహిమగలవాడైనందున తాను సృష్టించినదాని యందు తానే ప్రవేశించాడు.అట్లు సర్వవ్యాప్తి అగుటచే విష్ణువు అనే నామం సార్థకం అయింది.అందు ప్రవేశించిన స్వయంభువు సూర్యుని రూపంచెందాడు. మొట్టమొదటి రూపం సూర్యుడు అగుటచే ఆదిత్యుడనే పేరువచ్చింది.<ref name=":0" />
 
== బ్రహ్మాదుల సృష్టి ==
జలమయంలో పరుండిన ఆది పరబ్రహ్మం తనచుట్టూ ఉన్న నీటిని అతని పొడవైన చేతులు ద్వారా కలియబెట్టగా దానిలోనుండి రెండు బుడగలు ఏర్పడి వాటిద్వారా [[భూమి]],[[ఆకాశం]] ఏర్పడతాయి.ఆ సమయంలో మహాపురుషుని నాభి నుండి కమలం పుట్టింది.నారాయణడు తుమ్మెద ఆకారంగా కమలం చుట్టూ తిరుగుతూ చివరకు కమలంలో ప్రేవేశిస్తాడు.తన తేజస్సు కమలం ప్రవేశపెట్టి బయటకు వస్తాడు. కొంతకాలానికి కమలం నుండి ఎనిమిది భుజాలతో,నాలుగు ముఖాలతో బ్రహ్మ పుడతాడు.బ్రహ్మ తన చుట్టూ ఉన్న నీటిని చూసి భయపడి, ఏమి చేయలో తెలియని పరిస్థితులలో ఓంకారనాదంతో తిరిగి తామరతాడు ద్వారా మరలా లోపలికి ప్రవేశిస్తాడు.ఏమిచేయాలో తోచక విచారంతో కూర్చొని ఉండగా,తపస్సు చేయి,తపస్సు చేయి అనే మాటలు వినపడతాయి.బ్రహ్మ అలా కొన్ని సంవత్సరాల తపస్సు చేసిన తరువాత,నారాయణుడు ప్రత్యక్షమై సృష్టిని ఏర్పాటు చేయాలనే ప్రయత్నంలో నేనే నిన్ను సృష్టించాను.నీ తపస్సు ఫలితంగాసృష్టి చేసే మానసిక శక్తిని నీవు పొందావు.స్రీ రూపమైన ప్రకృతి నీకు సహకరిస్తుంది.సృష్టిని ప్రారంభించు అని నారాయణుడు అదృశ్యమవుతాడు. ప్రకృతి సరస్వతి రూపంలో కనిపంచింది.[[బ్రహ్మ]], [[సరస్వతి]] సాంగత్యం వలన సృష్టి ప్రారంభం అయిందని మత్స్యపురాణం చెపుతుంది.<ref>{{Cite web|url=https://www.teluguwishesh.com/spirituality/676-mythology/51783-matsya-puranam-in-telugu.html|title=Matsya Puranam In Telugu {{!}} Mythology|website=www.teluguwishesh.com|language=te|access-date=2020-07-12}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మత్స్య_పురాణం" నుండి వెలికితీశారు