ముఖ్య కార్యనిర్వాహక అధికారి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి మీడియా ఫైల్ ఎక్కించాను
పంక్తి 1:
[[దస్త్రం:Dinesh Kanabar.jpg|thumb|375x375px|దినేష్ కనబార్,దృవ ఎడ్వవైజర్స్ కంపెనీ స్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆపీసర్]]
'''ముఖ్య కార్యనిర్వాహక అధికారి''' అనగా ఏదేని [[పబ్లిక్ సంస్థ]] లేదా [[ప్రవేట్ సంస్థ]] అనగా లాభాపేక్ష సంస్థ కోసం [[నిర్వహణ]] బాధ్యతలు నిర్వర్తించే వ్యక్తి లేదా అత్యంత సీనియర్ కార్పొరేట్ అధికారి (ఎగ్జిక్యూటివ్) స్థానంలో ఉన్నవాడు అని అర్థం. ముఖ్య కార్యనిర్వాహక అధికారిని [[ఆంగ్లం]]లో '''చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్''' (Chief Executive Officer లేదా '''CEO''') అని అంటారు.తరచుగా ఈ స్థానానికి పనిచేసే ముఖ్య కార్యనిర్వాహక అధికారిని [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికన్]] ఇంగ్లీష్ లో CEO, నిర్వహణ డైరక్టర్, బ్రిటిష్ ఇంగ్లీష్ లో మేనేజింగ్ డైరెక్టర్ (MD) అని, ఇంకా ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ (CE) వంటి ఇతర పేర్లు ఉన్నాయి. ఇతను సంస్థ మొత్తం విజయానికి, ఉన్నత స్థాయి నిర్వాహక నిర్ణయాలు తీసుకోవటానికి,సంస్థకు సంబందించిన అన్ని బాధ్యతలకు పూర్తి బాధ్యత వహిస్తాడు.<ref>{{Cite web|url=https://corporatefinanceinstitute.com/resources/careers/jobs/what-is-a-ceo-chief-executive-officer/|title=CEO - Understanding the Roles and Responsibilities of a CEO|website=Corporate Finance Institute|language=en-US|access-date=2020-07-13}}</ref>
 
కార్పొరేషన్ లేదా కంపెనీ '''సీఈఓ''' సాధారణంగా బోర్డు డైరెక్టర్లకు నివేదికలు సమర్పిస్తాడు.దీని ప్రాథమిక బాధ్యతలు, ప్రధాన కార్పొరేట్ నిర్ణయాలు తీసుకోవడం, ఒక సంస్థ మొత్తం కార్యకలాపాలు,వనరులను నిర్వహించడం, డైరెక్టర్ల బోర్డు మధ్య [[కమ్యూనికేషన్]] ప్రధాన బిందువుగా వ్యవహరించడంలాంటి విధులు నిర్వహిస్తాడు. కార్పొరేట్ సంస్థల కార్యకలాపాలు సి.ఇ.ఓ.లను డైరెక్టర్ల బోర్డుద్వారా ఎన్నుకుంటారు.<ref>{{Cite web|url=https://www.investopedia.com/terms/c/ceo.asp|title=How Chief Executive Officers (CEOs) Work|last=Kenton|first=Will|website=Investopedia|language=en|access-date=2020-07-13}}</ref>
 
== సిఇఒ విధులు, బాధ్యతలు ==
సి.ఇ.ఓ. విధులు, బాధ్యతలు ఒక సంస్థ నుండి మరొక సంస్థకు మారుతూ ఉంటాయి. ఇది సంస్థాగత నిర్మాణం లేదా సంస్థ పరిమాణాన్ని బట్టి ఉంటుంది. చిన్న కంపెనీలలో దిగువ స్థాయి వ్యాపార నిర్ణయాలు తీసుకోవడం, సిబ్బందిని నియమించడం వంటి చర్యలు సి.ఇ.ఓ చేతుల మీదుగా జరుగుతుంది. పెద్ద కంపెనీలలో సిఇఓ సాధారణంగా ఉన్నత స్థాయి కార్పొరేట్ వ్యూహం, ప్రధాన కంపెనీ నిర్ణయాలతో మాత్రమే వ్యవహరిస్తాడు. ఇతర పనులు నిర్వాహకులకు లేదా వివిధ విభాగాలకు అప్పగించబడతాయి.సిఇఓలకు దిగువ వివరింపబడిన విధులు భాధ్యతలు కలిగి ఉన్నాడు.<ref>{{Cite web|url=https://corporatefinanceinstitute.com/resources/careers/jobs/what-is-a-ceo-chief-executive-officer/|title=CEO - Understanding the Roles and Responsibilities of a CEO|website=Corporate Finance Institute|language=en-US|access-date=2020-07-13}}</ref>
 
* ఒక సంస్థ లేదా సంస్థల మొత్తం విజయానికి కారకుడిగా వ్యవహరిస్తాడు.కంపెనీ వాటాదారుల విలువను అదనంగా పెంచే [[ధ్యేయం|లక్ష్యంతో]] దీర్ఘకాలిక వ్యూహాల అభివృద్ధి,అమలుకు నాయకత్వం వహించే బాధ్యత సి.ఇ.ఓ.పైన ఉంది.