అగ్రహారం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
{{అయోమయం|అగ్రహారం}}
'''అగ్రహారము''' [[బ్రాహ్మణులు]] నివసించే వీధి లేదా [[గ్రామం]]. అగ్రహారం అన్న పేరున్న గ్రామంలో పూర్వం వంశపారంపర్యంగా బ్రాహ్మణులే [[వ్యవసాయం|వ్యవసాయ]]<nowiki/>భూములకు అధిపతులుగా ఉండడం గమనించవచ్చు. అగ్రహారాన్ని సంపన్నులు లేదా పరిపాలకులు బ్రాహ్మణులకు దానమిచ్చేవారు. అగ్రహారాన్ని రాజులు దానం చేసేప్పుడు ఆయా భూములపై పూర్తిగా పన్ను లేకుండా కానీ, కొంత పన్ను మినహాయింపుతో కానీ ఇవ్వడం కద్దు.
* '''సర్వాగ్రహారము''' అంటే పూర్తిగా పన్ను లేకుండా ఇచ్చిన గ్రామం.
* '''శ్రోత్రియాగ్రహారము''' అనేది విద్యల కోసం ఇచ్చిన గ్రామం.
పంక్తి 8:
 
==చరిత్ర==
మధ్యయుగమునందు విద్యావైదుష్యములను వ్యాపింపజేసిన [[సంస్థ]]<nowiki/>లలో రాజాస్థానములకు బిమ్మట పేర్కొనవలసినవి అగ్రహారములు. పర్వకాలములందును, దిగ్విజయ పట్టబంధాది మహాసమయములందును రాజులనేకులు వేదవేదాంగపారగులను, పురాణేతిహాసాజ్ఞులను, కర్మనిరతులను అగు విప్రులకీ అగ్రహారములను దానమొసంగుచుండిరి. వీని ఆదాయముతో జీవయాత్రను చేయుచు ఈ బ్రాహ్మణులు నిశ్చింతులై స్వాధ్యాయప్రవచనములతో కాలక్షేపము జరిపెడివారు. ఈ అగ్రహారము లేక భోగములు, బహుభోగములని రెండువిధములు. అందు మొదటి తరగతి వొక్కని హక్కు భుక్తములోనే యుండునవి.రెండవతరగతి అగ్రహారములలో అనేకపండితకుటుంబీకులకు వృత్తులేర్పరుపబడియుండెడివి.
 
అగ్రహారములకు మంగలమనియు, చతుర్వేది మంగలమినియు పేరుండెడిది. వీరచోడుడు చతుర్వేది మంగలమున ఒకచోట గల శాసనమునుండి, ఇచ్చట వ్యాకరణ, [[మీమాంస]], [[వేదాంత]], ఋగ్యజుస్సామ,[[రూపావతార]], [[పురాణ]], [[జ్యోతిష్య]], [[వైద్య]] విద్యలను బోధించు ఆచార్యులొక్కక్కరికి ఒక్కొక్క వృత్తి కల్పింపబడెడిదని తెలియజేయడమైనది. ఈ అగ్రహారములకు ఎ విధమైన బాధ కలుగకుండగ చేసి రాజులు వానికి సర్వస్వతంత్రములను కల్పించెడివారు. వీనిపై ఏవిధమైన పన్నులను విధింపబడకుండినవి. ఇందలి [[భూమి]]<nowiki/>పై వచ్చు ధాన్యమంతయూ అగ్రహారీకులదే. రాజకీయోద్యోగులకు ఇందు ప్రవేశము లేకుండెడిది. అందలి పండితులను అన్యాపేక్షలేక సర్వకార్యములను నిర్వహించుకొనుచుండిరి. ఇటులన్నివిధములను నేటి విశ్వవిద్యాలయములను మించిన స్వాతంత్ర్యము కలిగి ఈ అగ్రహారములు అనన్య దృష్టితో వైదిక విద్యను వ్యాపింపజేయుచుండిరి.
== గ్రామనామంగా ==
తెలుగు వారి గ్రామనామాల్లో చాలానే అగ్రహారాలు కనిపిస్తాయి. అందులో అధికభాగం గ్రామనామంలో ఉత్తరపదం(చివరి పదం)గా ఉండగా, కొన్ని పూర్వపదం(మొదటి పదం)గానూ ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/అగ్రహారం" నుండి వెలికితీశారు