అమరసింహుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 4:
ఇతడు బౌద్ధుడయినను, భారతీయ సంప్రదాయములకు, ఆచారవ్యవహారములకూ విరుద్ధుడు కాడు. భాషాసేవయే ముఖ్యమని భావించి స్వాభిప్రాయముల జొప్పించక [[సంస్కృతము]]నకు మేలు చేకూర్చాడు. [[నిఘంటువు]] శబ్దములప్రోగు. ఈ శబ్దములు మానవ మనోభావసూచితములు. దేశముయొక్క నాగరితాభివృద్ధిని గమనింపదలచువారు కీశబ్దశాస్త్ర పరిగ్ఞానము సహకారియగును. కొన్ని కొన్ని [[శబ్దము]]లు మొదటి అర్ధమును విడనాడి నూత్నాశయములకొరకు సృజింపబడును. అమరకోశమును పరిశోధించిన కొన్ని సంగతులు బయల్వెడలును.
 
[[పరిష్యా]] దేశమున పూర్వకాలమున నివసించువారు మన యార్యసంతతివారై మతాభిప్రాయములచే భిన్నులయిరని మనకు చరిత్ర తెల్యిపరచుచున్నది. దాని కొంకింత బలము ఈ అమరకోశము కనబడుచున్నది. ఆహిర్, బుద్న్యుడు పారశీక దేవ బృందమునందువాడు. ఆతనినే భారతీయులు లోకాదశరుద్రులలో చేర్చిరి. సురను నిషేధించినవారు పారశీకువారసులయిరి. దానిని గ్రహించిన మన పూర్వేకులు సురలయిరి. అసురులకును, సురలకును మొదటి నివాస స్థలము ఒక్కటియే. కనుకనే వారలకు పూర్వ దేవతలని నానుది. [[అమరకోశము]]<nowiki/>లో కొన్ని పదాలకు అర్ధము ఈ వరవడిని తెలియపరచుచున్నది.దేవతలందరూ సదా 25 ఏండ్లవారు. ఈ బృందారకులయందు 49 విధములుగా గణదేవతలు ముఖ్యులు. ఇక్కాలమున గనదేవతల నామరూపములు గానరావు. [[రాక్షసులు]] గూడా దేవయోనిజ్లులలో జేరినవారే. వీరలనుండి ఆర్యులు తమ పశువులను రక్షించు కొనుచుండిరిట. వీరిలో దైత్యులు దానవులని ఇరుతెరగులు.మాంసాహారమునందసూయ భావము గనపడుచున్నది. పిశాచులు మాంసాభుక్కులు [[రాక్షసులు]] రాత్రియందు భోజనము జేయువారట.
 
అమరుడు [[బ్రహ్మ]], [[విష్ణువు|విష్ణు]], [[మహేశ్వరు]]లను వర్ఞించుటకు పుర్వమే బుద్ధునిదహరించెను. పరాప్తరునికి సాధ్యమగు స్థానము బుద్ధభగవానునికి అబ్బినది అని గ్రంథకర్త మతాభిమానమునచే ఈ ఆధిక్యత సమర్ధనీయమయమే. అంతియేగాక బుద్ధుడు భగవానుడు, సుగుణరాశి, ప్రేమాస్పదుడు, సర్వజ్ఞుడు, అద్వయవాది, అర్కబంధువు ఈనామములను బట్టియే ఆకాలపు సాదరాతిశయములు, భక్తివిశేషములు తెలియపడును. శ్రీరాముడిని వైష్ణవతారములలో చేర్చలేదు.ఈ అవతారములు పదీని అమరమునందు గనపడవు. అమరుడు విష్ణువునకు 39 పేర్లు సూచించియు దశావతారములలో పేరుగాంచిన వారిలో వామనుని తప్ప తక్కినవారిని పలుకరించలేదు. మత్స్య, కూర్మ, వరాహ, నారసిమ్హ, [[పరశురామ]], [[రామ]], [[బలరామ]], [[బౌద్ధ]], [[కల్కి]], ఈ తొమ్మిదిమంది ప్రమేయమేలేదు. ఈదశావతార సిద్ధాంతములు అమరుడి తరువాత ప్రచారమునకు వచ్చినట్టు మనకు దీనివలన తెలియును. ఇప్పుడు దశావతారములలో చేరిన శ్రీకృష్ణుని విష్ణవతారములలో అమరుడు చేర్చి అత్యంత ప్రాముఖ్యము ఇచ్చెను. మరల కృష్ణునాయున్నత పదవినుండి యెప్పుడూ తొలగించిరి. భాగవతములో కృష్ణుడును బలరాముడును విష్ణువుయొక్క నల్లతెల్ల వెండ్రుకులని నిరూపింపబడిరి. రామాయణములో వైదికాచార సంపత్తిని ప్రోత్సాహ పరచుచు బుద్ధుని దొంగ యని వర్ణించిరి. వాల్మీకి [[రామాయణము]] బుద్ద నిర్వాణము తరువాత వ్రాయబడినా అది ప్రశ్నగా మిగిలినది. లేక బుద్ద దూషణా ప్రక్షిప్తమా? ఏది ఎటులున్ననూ అమరుని కాలము నాటికి గాని శంకరుని కాలమునాటికి గాని దశావతారగాధ వాడుకలోలేదు. బుద్ధుని విష్ణువాతారములలో స్థానము దొరకలేదు.
"https://te.wikipedia.org/wiki/అమరసింహుడు" నుండి వెలికితీశారు