అరుణా అసఫ్ అలీ: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 21:
}}
 
'''అరుణా అసఫ్ అలీ''' ([[ఆంగ్లం]] Aruna Asaf Ali) ([[బెంగాళీ]]: অরুণা আসফ আলী) ([[జూలై 16]], [[1909]] - [[జూలై 29]], [[1996]]) ప్రసిద్ధ భారత స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు. [[1942]]లో [[గాంధీజీ]] జైలుకెళ్ళినపుడు క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళ. క్విట్ ఇండియా ఉద్యమకాలంలో [[బొంబాయి]]లోని గవాలియా టాంకు [[మైదానం]]<nowiki/>లో భారత జాతీయపతాకాన్ని ఎగురవేసిన [[మహిళ]]<nowiki/>గా చిరస్మరణీయురాలు. [[ఢిల్లీ]] నగరానికి మెట్టమొదటి [[మేయర్]]. ఈమెకు మరణానంతరం [[భారతరత్న]] అవార్డు లభించింది.
 
==తొలి జీవితం==
అరుణా గంగూలీ, [[హర్యానా]]లోని కాల్కాలో ఒక [[బెంగాళీ]] [[బ్రహ్మ సమాజం|బ్రహ్మసమాజ]] కుటుంబంలో జన్మించింది. ఈమె విద్యాభ్యాసం [[లాహోరు]], [[నైనీతాల్]] లలో జరిగింది. చదువు పూర్తయిన తర్వాత ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. దేశములోని అప్పటి పరిస్థితుల్లో అది ఒక మహిళకు గొప్ప ఘనతే. ఈమె [[కలకత్తా]]లోని [[గోపాలకృష్ణ గోఖలే|గోఖలే]] స్మారక పాఠశాలలో బోధించింది. అరుణకు [[భారత జాతీయ కాంగ్రేసు]] నాయకుడైన అసఫ్ అలీతో [[అలహాబాదు]]లో పరిచయమేర్పడింది. ఈ పరిచయం [[పెళ్ళి]]<nowiki/>కి దారితీసింది. అరుణ తల్లితండ్రులు మతాలు వేరు (ఈమె హిందూ, అతను ముస్లిం), వయోభేదము (ఇద్దరికీ వయసులో 20 ఏళ్ళకి పైగా తేడా) ఎక్కువన్న భావనతో ఆ పెళ్ళిని వ్యతిరేకించినా 1928లో అసఫ్ అలీని వివాహమాడింది.
 
==కుటుంబము==
పంక్తి 31:
==స్వాతంత్ర్యోద్యమం: తొలి రోజులు==
[[File:Aruna Asaf Ali 1998 stamp of India.jpg|right|thumb|150px|అరుణా అసఫ్ అలీ స్మారక తపాలాబిళ్ళ]]
వివాహము తర్వాత అరుణ [[భారత జాతీయ కాంగ్రేసు]]లో క్రియాశీలక సభ్యురాలై [[ఉప్పు సత్యాగ్రహము]]లో నిర్వహించిన బహిరంగ ప్రదర్శనలలో పాల్గొన్నది. ఈమెను [[దిమ్మరితనము|దేశదిమ్మరి]] అనే అభియోగము మోపి అరెస్టు చేశారు. అందువల్ల [[రాజకీయాలు|రాజకీయ]] ఖైదీలందరి విడుదలకు తోడ్పడిన గాంధీ-ఇర్వింగ్ ఒప్పందముతో 1931లో ఈమెను విడుదల చేయలేదు. అరుణతో పాటు ఖైదులో ఉన్న ఇతర మహిళా ఖైదీలు అరుణను విడుదల చేసేవరకు [[కారాగారము|జైలు]]<nowiki/>ను వదిలి వెళ్ళేది లేదని పట్టుబట్టారు. మహాత్మా గాంధీ కలుగజేసుకోవటంతో కానీ వీరు తమ పట్టును సడలించలేదు. ఆ తరువాత ప్రజాఆందోళన వలన ఈమెను విడుదల చేశారు.
 
1932లో తీహార్ జైళ్ళో రాజకీయ ఖైదీగా ఉండగా అరుణ జైల్లో రాజకీయ ఖైదీల పట్ల చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా నిరాహారదీక్ష నిర్వహించింది. ఈమె ప్రయత్నం ఫలితంగా తీహర్ జైళ్లో రాజకీయ ఖైదీల పరిస్థితి మెరుగైంది కానీ ఈమెను అంబాలా జైలుకు తరలించి ఒంటరి ఖైదులో ఉంచారు. జైలునుండి విడుదలైన తర్వాత ఈమె రాజకీయాలలో పాల్గొనలేదు.
"https://te.wikipedia.org/wiki/అరుణా_అసఫ్_అలీ" నుండి వెలికితీశారు