అలెగ్జాండర్ ఫ్లెమింగ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 23:
 
==బాల్య జీవితం==
ఈయన స్కాట్లండు కు చెందినవాడు. [[లండన్|లండను]] లోని మేరీ మెడికల్ కాలేజీ నుంచి 1906 లో ఈయన డిగ్రీ తీసుకున్నారు. అక్కడే కొంతకాలం పాటు [[బాక్టీరియా]] లను నిరోధించే పదార్థాలపై పరిశోధనలు చేశాడు. అక్కడ నుంచే ఆర్మీ మెడికల్ కార్ఫ్ కి వెళ్లి, మొదటి ప్రపంచ యుద్ధం ఫలితంగా 1918 లో మళ్ళీ సెయింట్ మేరీ మెడికల్ కాలేజీకి వచ్చి వేశాడు. ఆంటీ బయాటిక్స్ మీద [[పరిశోధన]]<nowiki/>లు మాత్రం విడువకుండా చేసేవాడు. ఫలితంగా 1928 లో పెన్సిలిన్ ను రూపొందించగలిగాడు.
 
చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు... ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసి పనిలో చేరాడు... ఇరవై ఏళ్ల వయసులో తిరిగి చదువు మొదలెట్టి శాస్త్రవేత్త అయ్యాడు... గడ్డురోగాల నుంచి ప్రాణాలు కాపాడే మందు కనిపెట్టి మహోపకారం చేశాడు... ఆయన [[పుట్టిన రోజు]] 1881 ఆగస్టు 6న .
 
వెయ్యేళ్ల కాలంలోనే అతి గొప్ప ఆవిష్కరణగా, కోట్లాది మంది ప్రాణాలకు [[రక్షణ]]<nowiki/>గా గుర్తింపు పొందింది 'పెన్సిలిన్‌'. తొలి యాంటీ బయోటిక్‌గా పేరొందిన ఆ మందును కనిపెట్టిన శాస్త్రవేత్తే అలగ్జాండర్‌ ఫ్లెమింగ్‌. వేరే ప్రయోగం చేస్తుండగా జరిగిన చిన్న పొరపాటు వల్ల ఇది బయటపడడం విశేషం. పెన్సిలిన్‌ వల్ల [[క్షయ]], న్యూమోనియా, [[టైఫాయిడ్|టైఫాయిడ్‌]] లాంటి ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి మానవాళికి రక్షణ కలుగుతోంది. దీన్ని కనిపెట్టినందుకు ఫ్లెమింగ్‌ 1945లో నోబెల్‌ బహుమతిని పొందారు.
 
స్కాట్లాండ్‌లో 1881 ఆగస్టు 6న ఓ [[వ్యవసాయదారుడు|రైతు]] [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో ఎనిమిది సంతానంలో చివరివాడిగా పుట్టిన ఫ్లెమింగ్‌, ఏడేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. అమ్మ పొలం పనులు చేస్తుంటే అక్కడి బడిలోచదివిన అతడు, ఆపై లండన్‌లో ఉండే పెద్దన్నయ్య దగ్గరకు వెళ్లి హైస్కూల్లో చేరాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మధ్యలోనే ఆపేసి షిప్పింగ్‌ కంపెనీలో గుమాస్తాగా చేరాల్సి వచ్చింది. అనుకోకుండా ఆస్తి కలిసి రావడంతో తిరిగి ఇరవయ్యేళ్ల వయసులో చదువును కొనసాగించడం ప్రపంచానికెంతో మేలు చేకూర్చింది. సెయింట్‌ మేరీస్‌ కాలేజీలో వైద్యవిద్యలో చేరి చురుగ్గా చదువుతూనే రైఫిల్‌ షూటింగ్‌, ఈత, వాటర్‌పోలో క్రీడల్లో బహుమతులు పొందుతూ ఉండేవాడు. డిగ్రీ పొందాక పరిశోధనల్లో నిమగ్నమయ్యాడు.
 
==[[బ్యాక్టీరియా]] పై పరిశోధన==
మొదటి ప్రపంచ యుద్ధం మొదలవడంతో సైనికులకు చికిత్సలు చేసే బృందానికి నాయకత్వం వహించాడు. గాయాలకు సూక్ష్మజీవుల వల్ల ఇన్ఫెక్షన్‌ సోకి చాలా మంది సైనికులు చనిపోవడాన్ని గమనించిన ఫ్లెమింగ్‌, యుద్ధానంతరం బ్యాక్టీరియాపై [[పరిశోధన]]<nowiki/>లు చేయసాగాడు. వాటిలో భాగంగా 'స్టెఫైలో కోకి' (Staphylo cocci) సూక్ష్మజీవులపై పరిశోధన చేస్తుండగా ఓ రోజున చిన్న పొరపాటు జరిగింది. ఆ బ్యాక్టీరియా ఉన్న పాత్రలను బల్లపై పెట్టి మర్చిపోయి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ మర్నాడు వచ్చి చూస్తే బయటి వాతావరణం ప్రభావం వల్ల ఓ పాత్రలో నీలిరంగులో బూజులాంటి తెట్టు (ఫంగస్‌) కట్టి ఉండడం గమనించాడు. చిత్రంగా ఆ బూజు ఆశించినంత మేరా పాత్రలో సూక్ష్మజీవులు నాశనమై కనిపించాయి. అంటే ఆ [[బూజు]]<nowiki/>లో సూక్ష్మజీవులను చంపే పదార్థమేదో ఉందన్నమాట! దాంతో ఫ్లెమింగ్‌ దానిపై పరిశోధనలు చేసి చిన్న కుంచెలాగా ఉండే పదార్థాన్ని వేరుచేయగలిగాడు. లాటిన్‌లో పెన్సిలియమ్‌ అంటే చిన్న కుంచె అనే అర్థం ఉండడంతో దానికి 'పెన్సిలిన్‌' అని పేరు పెట్టాడు. దాన్ని 1928లో కనిపెట్టగా, మరిన్ని పరిశోధనలు చేసి ఓ మందుగా మార్చి వాడుకలోకి తీసుకు రావడానికి 17 సంవత్సరాలు పట్టింది. దీంతో యాంటీబయాటిక్‌ యుగానికి నాంది పలికినట్టయింది.
 
==నోబుల్ ప్రైజ్==