అశోక్ కుమార్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 12:
టీవీలో ఆయన [[తెనాలి రామకృష్ణుడు|తెనాలి రామకృష్ణుడి]] మీద చేసిన కార్యక్రమాలతో ఆయనకు టీవీ నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. అందులో తెనాలి రామకృష్ణుడిగా నటించాడు. ఇంకా భోజరాజు కథలు, భట్టి విక్రమార్క లాంటి ధారావాహికల్లో నటించాడు. బాపు దర్శకత్వం వహించిన శ్రీ భాగవతం ధారావాహికలో నారదుడిగా నటించాడు. కెరీర్ మొదట్లో కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు కానీ అవి పెద్దగా [[విజయవంతం]] కాలేదు. తరువాత టీవీ మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించి సినిమాల్లో కేవలం సహాయ పాత్రలకు పరిమితం అయ్యాడు.
 
[[సూత్రధారులు]] సినిమాలో సీనియర్ నటి [[కె.ఆర్.విజయ|కె. ఆర్. విజయ]] భర్తగా సహాయ పాత్రలో నటించాడు. అలాగే వెంగమాంబ జీవిత చరిత్రలో వెంగమాంబను వ్యతిరేకించే దీక్షితులు అనే ఒక నెగటివ్ పాత్రలో నటించాడు. ప్రముఖ దర్శకుడు [[జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు)|జంధ్యాల]]<nowiki/>తో ఆయనకు మంచి పరిచయం ఉండటం వల్ల ఆయన దర్శకత్వం వహించిన అనేక దూరదర్శన్ లఘుచిత్రాల్లో నటించాడు. అంతే కాక చూపులు కలిసిన శుభవేళ, జయమ్ము నిశ్చయమ్మురా, వివాహ భోజనంబు, అహ నా పెళ్ళంట, పెళ్ళి పుస్తకం లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో కనిపిస్తాడు.<ref name=nettv4u>{{cite web|title=తెలుగు టివీ నటుడు అశోక్ కుమార్|url=http://www.nettv4u.com/celebrity/telugu/tv-actor/ashok-kumar|website=nettv4u.com|accessdate=14 November 2016}}</ref>
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/అశోక్_కుమార్_(నటుడు)" నుండి వెలికితీశారు