ఆచమనము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
'''ఆచమనము''' అనే పదానికి '''ఉపస్పర్శం''' అంటే అరచేతిలో [[నీరు]] పోసుకొని నోటితో గ్రహించడమని అర్ధం. ఏదైనా ఒక పవిత్రమైన పనిచేస్తున్నప్పుడు ఆచమనం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. మనస్సు, వాక్కు, శరీరం - అనే త్రికరణాల పవిత్రతకు ఆచమనం విధించబడింది. [[సంధ్యావందనం]] మొదలైన సమయాలలో ఆచమనానికి చాలా ప్రాముఖ్యమున్నది.
ఆచమనం అంటే కేవలం ఒక ఉద్ధరణి [[నీళ్లు]] చేతిలో పోసుకొని లోపలికి పుచ్చుకోవడం మాత్రమే కాదు, మంత్ర పూత [[జలము|జలం]]<nowiki/>తో శరీరాన్ని స్పర్శించడం, [[స్నానం]] చేయడం కూడా ఆచమనమే. ఆచమనం నాలుగు విధాలు. అవి : 1. శ్రుత్యాచమనం : స్వాధ్యాయ బ్రాహ్మణంలోని శ్రుతి ‘‘హస్తా వవవిజ్య రతిరాచమేత్‌...’’ అంటూ చేతులు కడుగుకొని, ‘‘ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా’’ ఆని [[ఆచమనం]] చేయాలి. తరువాత రెండు చేతులను శుద్ధి చేసుకొని, ఉదకాన్ని స్పృశించి, కుడి చేతితో ఎడమ చేతిమీద, పాదాల మీద నీళ్లు చల్లుకోవాలి. శిరస్సు, నేత్రాలు, ముక్కు, చెవులు, హృదయ స్థానాలను తాకాలి. 2. శ్రౌతాచమనం : గాయత్రీ మంత్రంలోని మూడు [[పాదము|పాదాల]]<nowiki/>ను విడివిడిగా స్వాహాకారంతో పఠిస్తూ, అంటే ఓమ్‌ తత్సవితుర్వరేణ్యగ్‌ స్వాహా, భర్గోదేవస్య ధీమహి స్వాహా, ధియో యోనః ప్రచోదయాత్‌ స్వాహా అని పలుకుతూ ఆచమించడం మొదలైన క్రియలు ఇందులో ఉన్నాయి. 3. [[స్మృత్యాచమనం]]/ [[స్మార్తాచమనం]] : పీట/ [[కృష్ణాజినం]] మీద కూర్చుని, పాదాలను నేలపై ఉంచి, ఆపస్తంబ సూత్ర సంప్రదాయంలో ఆచమించే పద్ధతి. బొటన వ్రేలితో పెదవులను తుడుచుకోవడం లాంటి క్రియలు ఇంకా ఉన్నాయి. 4. పురాణాచమనం : ముమ్మారు కేశవ నామాలతో ఆచమించడం, గోవిందాది నామాలతో అవయవ శుద్ధి మొదలైన క్రియలు ఇందులో ఉన్నాయి. శ్రుత్యాచమనం, శ్రౌతాచమనం ఒక్కటేనని కొందరి భావనగా దువ్వూరి రామకృష్ణారావుగారి సంపాద కత్వంలో వెలువడిన [[సంధ్యావందనం]] [[గ్రంథం]]<nowiki/>లో వ్రాశారు. కావచ్చు. శ్రుతి, శ్రౌతం వేరు కావు.
==రకాలు==
శ్రుతి, స్మృతి, పురాణాలలో 3 రకాల ఆచమనాలు చెప్పబడ్డాయి.
"https://te.wikipedia.org/wiki/ఆచమనము" నుండి వెలికితీశారు