ఆతుకూరి మొల్ల: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 3:
 
==జీవిత కాలము==
మొల్ల జీవించినకాలం గురించి పరిశోధకులలో భిన్నాభిప్రాయాలున్నాయి. 'సన్నుత సుజ్ఞాన సవివేకి వాల్మీకి' దగ్గరనుండి 'తిక్కకవిరాజు భోజు' వరకూ మొల్ల నుతించింది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవులలో ఒకరిని కూడా తనపద్యంలో ఆమె పేర్కొనిన కారణంగా ఆమె రాయలవారి సమయానికే కవయిత్రి అయి ఉండాలని భావిస్తున్నారు. జనసామాన్యంలో ప్రచారంలో ఉన్న కథలు మొల్ల, తెనాలిరామలింగడు సమకాలీకులని వెల్లడిస్తున్నాయి. 16వ శతాబ్దికి చెందిన ఏకామ్రనాధుడనే చరిత్రకారుడు తన ప్రతాపచరిత్రలో మొల్లను పేర్కొన్నాడు. అందులో పేర్కొన్న సాంఘిక పరిస్థితులను బట్టి మొల్ల సుమారుగా క్రీ.శ. 1581 కి ముందుగా జీవించి ఉండేదనిపిస్తున్నది. ఆమె [[తిక్కన సోమయాజి]]<nowiki/>కీ, భాస్కరునికీ, [[ప్రతాపరుద్రుడు|ప్రతాపరుద్రు]]<nowiki/>నికీ సమకాలీనురాలు కావచ్చును కూడాను. ఈమె కులావంశ సంజాత. ఇంటి పేరు ఆతుకూరివారు.వంగడమునుబట్టి '''కుమ్మరి మొల్ల''' అని విశ్వమున వ్యవహరించబడుచున్నది. ఈమె జనకుడు '''కేతనపెట్టి'''. గ్రంథావతారికలో ఆదికవి స్థుతియందు [[శ్రీనాధుడు]]ని స్మరించియుండుటచే ఈమె [[శ్రీనాధుడు]] తరువాత కాలమున ఉండెడిదని తెలియుచున్నది.చరిత్ర పరిశోధకులు 1525సం. ప్రాంతమని నిర్ణయించారు. ఈమె ఆజన్మబ్రహ్మచారిణి అని చెప్పెదరు.
 
స్వస్థలం : కడప జిల్లా గోపవరం మండలం గోపవరం గ్రామం .ఈ గ్రామం కడప పట్టణమునకు 56 కి.మీ దూరములో ఉంది. బద్వేలుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతమునకు చెందినదని మొల్ల రామాయణములోని ఈ క్రింది పద్యము ద్వారా తెలియుచున్నది.
పంక్తి 36:
తనకు శాస్త్రీయమైన కవిత్వజ్ఞానం లేదనీ, భగవద్దత్తమైన వరప్రసాదంవల్లనే [[కవిత్వం]] చెబుతున్నాననీ ఆమె అన్నది. కాని ఆమె అనేక సంస్కృత, తెలుగు పూర్వకవులను స్తుతించిన విధం చూస్తే ఆమెకు వారి రచనలతో గణనీయమైన పరిచయం ఉండిఉండాలనిపిస్తున్నది. తనకు పాండిత్యం లేదని మొల్ల వ్రాసినది సంస్కృతిలో భాగమైన అణకువ, విధేయత వంటి లక్షణాల కారణంగానే తప్ప వేరే కాదని స్త్రీ రచయిత్రుల చరిత్ర వ్రాసిన [[నిడదవోలు మాలతి]] భావించారు.<ref name="నిడదవోలు మాలతి">{{cite book|last1=నిడదవోలు|first1=మాలతి|title=Telugu Women Writers, 1950-1975|date=2013|url=https://tethulika.files.wordpress.com/2010/03/telugu-women-writers-1950-19752.pdf|accessdate=24 May 2015}}</ref>
 
[[గ్రంధావతారిక]]ను బట్టి ఈమె తక్కిన కవయిత్రులవలె గురువునొద్ద విద్యనభ్యసించలేదని, గోపరపు శ్రీకంఠ మల్లేశుకృపను [[కవిత్వము]]ను చెప్పనేర్చినదనియు తెలియుచున్నది. ఈమె కావ్యలక్షణాదికముల నేమియు నెరుంగక పోయినను నన్నయ తిక్కనాది కవుల గ్రంథములను మాత్రము క్షుణ్ణముగా చదివినదని ఈమె [[పద్యము]]<nowiki/>ల తీరు నడకలను బట్టి చెప్పవచ్చును.ఈమెపై పోతన కవితా ప్రభావము ఎక్కువగాగలదు. '''పలికెడది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుడట...''' అని పోతన చెప్పిన మాదిరిగనే ఈమె రామాయణమందు '''చెప్పమని [[రామావతారము|రామచంద్రుడు]], చెప్పించిన పలుకుమీద జెప్పెదనే నెల్లప్పుడు నిహపరసాధన, మిప్పుణ్యచరిత్ర, తప్పులెంచకుడు కవుల్''' అని పల్కినది. సర్వగుణాకరుడు శ్రీరాముని చరితమును నెందరెన్ని విధముల రచన గావించినను నవ్యతకలిగి వీనులవిందై, యమృతపు సోనలపొందై యలరారు చుండుటతానీ గ్రంథమును చేపట్టుటకు కారణమని చెప్పినిది., అట్టి మహాత్ముని చరితమును కందువ మాటల్ నందముగా కూర్చి పఠితలకు శ్రోతలకు విందును గూర్తునని ముందంజ వేసింది.
గ్రంథావతారిక యందు చెప్పబడిన విషయముల వల ఈమె పూర్వకవుల సంప్రదాయమునే అనుసరించి కావ్యారంభమున అయోధ్యాపుర వర్ణనతో ప్రారంభమై, దశరుధుని [[పుత్రకామేష్ఠి]], శ్రీరామచంద్రుని జననమాదిగా రావణవధానంతరము ముగియుచున్నది.ఉత్తరరామాయణముని స్పృశించలేదు.
 
"https://te.wikipedia.org/wiki/ఆతుకూరి_మొల్ల" నుండి వెలికితీశారు