ఆత్రేయ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 34:
| weight =
}}
'''ఆచార్య ఆత్రేయ'''గా సినీరంగ ప్రవేశం చేసిన '''కిళాంబి వెంకట నరసింహాచార్యులు''' ([[మే 7]], [[1921]] - [[సెప్టెంబర్ 13]], [[1989]]) తెలుగులో నాటక, సినిమా పాటల, మాటల రచయిత, నిర్మాత, దర్శకులు. దాదాపు 400 సినిమాలకు మాటలు, పాటలు రాసిన కవి.<ref>[http://www.sakshi.com/news/opinion/heartstrings-poet-atreya-64765 మనసులు దోచిన కవి ఆత్రేయ Written by Nagesh | Updated: September 13, 2013]</ref> అత్రేయకి నటుడు [[కొంగర జగ్గయ్య]] ఆప్తమిత్రుడు. ఆత్రేయ వ్రాసిన పాటలు, నాటకాలు, నాటికలు, కథలు మొదలగు రచనలన్నీ ఏడు సంపుటాలలో సమగ్రంగా ప్రచురించి [[జగ్గయ్య]] తన మిత్రుడికి గొప్ప నివాళి అర్పించాడు అని చెప్పవచ్చు. ఆచార్య ఆత్రేయ [[తెలుగు సినిమా]] గేయరచయితగా, సంభాషణకర్తగా పేరుపొందినా నిజానికి అతను మాతృరంగం నాటకాలే. నాటక [[రచయిత]]<nowiki/>గా అతను స్థానం సుస్థిరం. మనసుకవిగా సినిమా వారు పిలుచుకునే '''ఆత్రేయ''' నాటకాల్లో చక్కని ప్రయోగాలు చేసి నాటక రంగాన్ని మలుపుతిప్పారు.
==జీవిత సంగ్రహం==
[[1921]] [[మే 7]] న [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]లోని [[సూళ్ళూరుపేట]] మండలంలో గల [[మంగళంపాడు]] గ్రామంలో జన్మించాడు. తండ్రి [[కృష్ణమాచార్యులు]]. తల్లి సీతమ్మ. చిన్నప్పటినుండి నాటకంలోని పద్యాలను రాగయుక్తంగా చదివేవారు. సమాజంలో మధ్య తరగతి కుటుంబ సమస్యలను తీసుకుని మనోహరమైన నాటకాలుగా మలిచారు. వీరి 'ప్రవర్తన', '[[ఎన్.జి.వో]]' నాటకాలు [[ఆంధ్ర నాటక కళా పరిషత్తు|ఆంధ్ర నాటక కళా పరిషత్]] అవార్డులను గెలుచుకున్నారు. విశేషంగా రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రదర్శనలు జరిగాయి. అలాగే '[[కప్పలు]]' బాగా ప్రాచుర్యం పొందిన నాటకం. [[రాయలసీమ]] క్షామ పరిస్థితులను వివరించే 'మాయ' నాటకం, స్వాతంత్ర్యానంతరం దేశంలో చెలరేగిన హిందూ ముస్లిం హింసాకండను 'ఈనాడు' అనే మూడంకాల నాటకం, విశ్వశాంతిని కాంక్షించే 'విశ్వశాంతి' నాటకాన్ని రచించారు. విశ్వశాంతి నాటకానికి కూడా రాష్ట్ర స్థాయి బహుమతి లభించింది. 'సామ్రాట్ అశోక','గౌతమ బుద్ధ', 'భయం' నాటకాలు కూడా వ్రాసారు.<ref name="అటకెక్కుతున్న నాటక రచన">{{cite news |last1=ఆంధ్రభూమి |first1=సాహితి |title=అటకెక్కుతున్న నాటక రచన |url=http://andhrabhoomi.net/content/sahiti-232 |accessdate=27 March 2020 |work=andhrabhoomi.net |publisher=బి.నర్సన్ |date=3 October 2016 |archiveurl=https://web.archive.org/web/20200327170044/http://andhrabhoomi.net/content/sahiti-232 |archivedate=27 మార్చి 2020 |url-status=live }}</ref>
పంక్తి 43:
ఆత్రేయ తాత్విక ధోరణితో రాసిన సంభాషణలు జీవిత తత్వాన్ని గుట్టువిప్పుతాయి. జీవితాన్ని కాచి వడబోసిన నగ్నసత్యాలు. ప్రతి వ్యక్తి జీవితానికి మార్గ దర్శకాలు. "వెలుగు నీడలు" చిత్రంలో ఇటువంటి ఓ అద్భుత సంభాషణ తనదైన శైలిలో రాసి ఓ సన్నివేశానికి ఆత్రేయ జీవం పోసారు. సెంటిమెంటల్ అనే పదానికి భావగర్భితమైన, కరుణ రసముగల, [[శృంగారం|శృంగార]] భావములుగల అర్థాలున్నాయి. [[సినిమా]] పరిభాషలో సెంటిమెంటల్ డైలాగ్స్ అంటే పరస్పర ప్రేమానురాగాలను, ఆత్మీయానుబంధాలతో, కరుణరస భరితంగా ఒకరికొకరు సంభాషించు కోవడం. సెంటిమెంటల్ డైలాగ్స్ రాయడంలో ఆత్రేయది అందెవేసిన చెయ్యి. ఆత్రేయకు లేడీస్ సెంటిమెంట్లు లేకపోయినా లేడీస్ సెంటిమెంట్ డైలాగ్స్ బాగా రాస్తారని చెప్పుకుంటారు.<ref>{{Cite web |url=http://10tv.in/content/Acharya-Atreya-Death-Anniversary-Today-11389 |title=ఆత్రేయ మనసు కవి |website= |access-date=2017-04-02 |archive-url=https://web.archive.org/web/20170929085711/http://10tv.in/content/Acharya-Atreya-Death-Anniversary-Today-11389 |archive-date=2017-09-29 |url-status=dead }}</ref>
== గొప్ప వేదాంతి ==
ఆత్రేయ గొప్ప [[వేదాంతశాస్త్రం|వేదాంతి]]. ప్రతివిషయాన్ని వాస్తవిక [[దృష్టి కోణం|దృష్టి]]<nowiki/>తో ఆలోచించి సంభాషణలను సమకూరుస్తారు. "వేదాంతం, వైరాగ్యం ఒంటపడితే చాలా ప్రమాదం. వాటి జోలికిపోకుండా ఉంటే చాలా మంచిది. అవి మనిషిలోని కార్య దీక్షను, గట్టి విశ్వాసాలను దెబ్బతీస్తాయి" అని ఆత్రేయ అంటారు. శృంగార రసం శృతి మించితే అశ్లీలం అవుతుంది. ఇటువంటి కొన్ని సన్నివేశాలకు రచయిత పచ్చిగా రాయక తప్పదు. నేను రాయను అని మడికట్టుకు కూర్చుంటే సినీ రచయితగా చిత్ర పరిశ్రమలో ఏ రచయితా నిలబడ లేడు. ఈ కారణమే ఆత్రేయను బూత్రేయ అని కూడా పేరు మూట గట్టుకునేలా చేసింది.
 
==ఆత్రేయ పాటలు గురించి==
పంక్తి 67:
 
ఆత్రేయగారి 'రచనాచమత్కృతి' ఎలాంటిదంటే- రాయరు. చెప్పి రాయిస్తారు. అదీ రాత్రివేళ. రాత్రి తొందరగా [[భోజనం]] చేసి, తొమ్మిదిన్నర, పదిగంటలకి పడుకోవాలి. రెండుగంటలకి లేవాలి. ఆ రెండు నుంచి, [[కోడి]] కూసే వరకూ (కోళ్లు లేవు- కాకులే అరిచేవి) సాగుతుంది ఆ రచన. అందుకే అతను్ని 'అర్ధరాత్రేయ' అని చమత్కరించేవాళ్లం. అక్కడక్కడ కొన్ని చిన్నచిన్న బూతులు రాయడంవల్ల 'బూత్రేయ' అని కూడా అన్నారు. దేనికీ అతను నొచ్చుకోరు. ఐతే, ఆ అర్ధరాత్రి భోగాలు నాకు అనుభవం లేదుగాని, కె.వి.రావుగారు, సుదర్శన్ భట్టాచారి గారూ (నేటి 'భారవి') అనుభవించారు.
తాను ఒక మంచి నీతిగల సాంఘిక చిత్రం నిర్మిస్తూ దర్శకత్వం కూడా చేస్థానని- ఒకరోజు ప్రకటించారు. నన్ను, కె.వి.రావుగారినీ పిలిచి, ''మీరిద్దరూ నాకు సహాయకులు. కథ సూక్ష్మంగా చెబుతాను. ఇద్దరూ కలిసి స్క్రీన్‌ప్లే వండండి. వంట అయ్యాక చెప్పండి. తింటాను అదే, వింటాను'' అన్నారు. ''మరి...'' అని గొణిగాం. తన ఇంట్లోని లైబ్రరీ గది చూపిస్తూ ''ఇదే మన ఆఫీసు. ఇద్దరూ ఒకవేళ అనుకుని - వచ్చి కూచోండి. మీకు [[తేనీరు|టీ]]<nowiki/>లు, [[కాఫీ]]<nowiki/>లూ కావలసివస్తే ఇంట్లో చెప్పండి పంపిస్తారు'' అన్నారు. ఇంటినిండా జనమే- వాళ్లెవరోగాని. ''మరి....'' అని మళ్లీ గొణిగాం. ''పదిరోజుల తర్వాత మీ ఇద్దరి జేబులూ నింపుతాను'' అని అతను అనుకున్న కథ చెప్పారు. ''దీనికి ఏం పాత్రలు కలుపుతారో, ఎలా మంచి కథగా రూపొందిస్తారో ఆలోచించండి'' అని లేచారు. మేము కొన్నాళ్లపాటు కుస్తీలు పట్టి - ఒక విధంగా దృశ్యాలు పేర్చాం. వినమని చెప్పాం. ''రేపు'' అన్నారు. అలాంటి రేపులు చాలా అయినాయి. అతను వినడం మాత్రం కాలేదు. మా జేబులూ నిండలేదు. నిండడం కాదుగదా- ఉన్న జేబు ఖాళీ అయింది. ఓ రోజు ఇద్దరం వుండగా- అడావుడిగా వచ్చారు ఆత్రేయ. ''రేపు [[దీపావళి]]. మంచిరోజు. ఇద్దరూ తలంటు పోసుకుని రండి. మీ ట్రీట్‌మెంట్ వింటాను. గట్టిగా అడ్వాన్సులు ఇస్తాను'' అన్నారు. మర్నాడు తెల్లవారేసరికి లేచి, అతను చెప్పినట్టు తలలు అంటుకోకపోయినా, అతను ఇంటిని అంటుకున్నాం. తీరా వెళితే- తెల్లవారుజామునే [[బెంగళూరు]] వెళ్లిపోయారుట! అదే [[కబురు]]! అంతే కథ! ఆ కథని కంచికి పంపించేశాం. అతను ఎంత గొప్ప రచయితో అంత నిబద్ధత లేని మనిషి. సినిమా రచయితలకి ఒక సంఘం వుండాలని, అందరికీ చెప్పి, మొదటి సమావేశం ఎక్కడో ఎప్పుడో చెప్పి అందర్నీ ఆహ్వానించి, అతను వెళ్లలేదు!
అతను '[[వాగ్దానం]]' సినిమా డైరక్టు చేశారు. అతనుే రచయిత కూడా. అక్కినేని హీరో. ఒక సందర్భంలో అక్కినేని చెప్పారు. ''మేము నటీనటులందరం సిద్ధమై సెట్లో కూచునేవాళ్లం. టెక్నీషియన్లు రెడీ. ఉదయం 9 గంటల కాల్‌షీటు. దర్శకుడే 10-30, 11 గంటలకు వచ్చేవాడు. ''ఏమిటి మహానుభావా!'' అని అడిగితే- ''బద్దకిష్టి రచయితని పెట్టుకున్నానయ్యా. సీన్లు రాయడు. (తానే, తనమీదే జోకు లాంటిది) దగ్గర కూచుని రాయించుకుని వచ్చేటప్పటికి ఇంత ఆలస్యమైంది!'' ఇదీ ఆత్రేయ సమాధానం!''
ఆత్రేయగారు ఒక టి.వి సీరియల్ డైరెక్టు చేశారు. అందులో రాధాకుమారి వేసింది. ఎన్ని రోజులు వేషం వేసి పనిచేసినా [[డబ్బు]] ఇవ్వలేదుట- అడిగితే- ''అమ్మా! నాచేత ఎవరూ పాటలు రాయించుకోవడం లేదు. నువ్వు ఎవరికైనా చెప్పి- పాట రాయించమను. అతను డబ్బు ఇస్తాడు కదా, అప్పుడు మీ అందరికీ ఇస్థాను'' అన్నారు. నిజమా! చమత్కారమా! ఏమైతేనేం ఒక గొప్ప రచయిత. ఎన్ని గొప్ప నాటకాలు, ఎన్ని సినిమాలు! ఎన్ని గొప్ప [[పాటలు]]! అతను చేత [[పాట]] రాయించుకోవాలని తిరగని వాళ్లు లేరు. ఐతే, ఆ పాట, ఆ మనసులో ఎప్పుడు పుడుతుందో! అతనుకే తెలీదు. ఆత్రేయ సంభాషణలూ అంతే, వింటూ థియేటర్లో ప్రేక్షకులు చప్పట్లు కొట్టేవారు.
"https://te.wikipedia.org/wiki/ఆత్రేయ" నుండి వెలికితీశారు