ఆర్.నారాయణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3) |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 18:
==విద్యాభ్యాసం==
నారాయణమూర్తి, [[తూర్పుగోదావరి]] జిల్లా [[రౌతులపూడి]] మండలంలోని [[మల్లంపేట]] గ్రామంలో ఒక పేదరైతు [[కుటుంబము|కుటుంబం]]
[[పెద్దాపురం]]శ్రీ రాజ వత్సవాయి బుచ్చి సీతయ్యమ్మ జగపతి బహద్దర్ మహారాణి కళాశాలలో బి.ఏ చదవడానికి చేరాడు. అక్కడ రాజకీయాలతో ప్రభావితుడై, సినిమాలు, రాజకీయాలు, సామాజిక బాధ్యత అనే మూడు వ్యాసంగాలపై ఇష్టాన్ని ఏర్పరచుకున్నాడు. కళాశాల ఈయన విద్యార్థిసంఘానికి అధ్యక్షుడిగానే కాకుండా కళాశాల లలిత కళల విభాగానికి కార్యదర్శిగా కూడా ఉన్నాడు. అంతేకాక తను ఉంటున్న ప్రభుత్వ హాస్టలు యొక్క విద్యార్థి అధ్యక్షునిగానూ, పేద విద్యార్థుల నిధి సంఘానికి కార్యదర్శి గానూ పనిచేశాడు. స్థానిక రిక్షా కార్మికులు ఈయనను మద్దతుకోసం సంప్రతించేవారు. నారాయణమూర్తి పట్టణ రిక్షాసంఘం అధ్యక్షుడుగా కూడా ఉన్నాడు. [[భారత అత్యవసర స్థితి|ఎమర్జెన్సీ]] కాలంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నందువలన [[పోలీసులు]] ఈయన్ను తీసుకునివెళ్ళి ఇంటరాగేట్ కూడా చేశారు. అంతేకాక నారాయణమూర్తి సినిమా నటి [[మంజుల]]తో ఒక ప్రదర్శన ఏర్పాటు చేయించి నూతన కళాశాల నిర్మాణానికి నిధుల సేకరణ ప్రారంభించాడు. అప్పట్లో [[బీహార్]]లో వరదసహాయానికి తగిన విధంగా తోడ్పాడ్డాడు. సహవిద్యార్థులు నారాయణమూర్తిని ''కాలేజీ అన్న''గా వ్యవహరించేవారు.
|