ఆర్యభట్టు: కూర్పుల మధ్య తేడాలు

చి 2409:4042:228A:E604:7859:6FA3:1830:7605 (చర్చ) చేసిన మార్పులను 49.206.137.56 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 17:
| influenced = [[లల్లా]], [[బాస్కరుడు]], [[బ్రహ్మగుప్తుడు]], [[వరాహమిహిర]]
}}
'''ఆర్యభట''' భారతదేశ అత్యున్నత గణిత, ఖగోళ శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు. ఇతను క్రీ.శ. 426-550 ప్రాంతంలో నివసించినట్లు అంచనా. ఆర్యభట్టు కుసుమపురము (ఈనాటి [[పాట్నా]]) లో నివసించాడు. ఇతను [[ఆర్యభట్టీయం]], ఆర్య సిధ్ధాంతం, [[సూర్య సిద్ధాంతం]], గోళాధ్యాయం, సంస్కృత గణిత సంఖ్యా శాస్త్రాన్ని రచించాడు. ఇవే కాక ఆర్యభట్టు ''[[పై]]'' విలువను సుమారుగా కనుక్కున్నట్లు చెప్తారు. ఆధునిక [[గణితము|గణితం]]<nowiki/>లోని సైన్, కొసైన్ లను ఇతను "జ్యా" ,"కొ జ్యా"గా నిర్వచించాడు. భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహానికి ఇతని పేరు ([[ఆర్యభట్ట (కృత్రిమ ఉపగ్రహం)|ఆర్యభట్ట]]) పెట్టారు.
 
 
పంక్తి 26:
==పుట్టు పూర్వోత్తరాలు==
 
ఆయన జన్మస్థలం పూర్వం పాటలీపుత్రంగా పిలవబడిన [[పాట్నా]]<nowiki/>కు సమీపంలో ఉన్న కుసుమపురం. కొద్ది మంది ఆయన్ను విక్రమాదిత్యుని ఆస్థానంలో పనిచేసిన ప్రముఖ ఖగోళ శాస్త్రజ్ఞుడు, గణిత శాస్త్రవేత్త అయిన [[వరాహమిహిరుడు|వరాహ మిహురుడికి]] సమకాలికుడిలా భావిస్తున్నారు. విక్రమాదిత్యుడు పండితులను బాగా ఆదరించేవాడు. ఆయన ఆస్థానంలో నవరత్నాలు అనబడే తొమ్మిది మంది కవులుండే వాళ్ళు. వాళ్ళలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన [[కాళిదాసు]] కూడా ఒకడు. ఆర్యభట్టు ఈ తొమ్మిది మందిలో లేకుండా ఉన్నాడంటే ఆయన ఆలోచనలను ఆయన సమకాలికులు అంతగా పట్టించుకునే వారు కాదని తెలుస్తోంది. వరాహమిహిరుడి ఆలోచనలు కూడా కొన్ని ఆర్యభట్టు ఆలోచనలతో విరుద్ధంగా ఉన్నాయి. కానీ ఆయన ఈ నవరత్నాలు ప్రాచుర్యంలోకి రాకమునుపే జీవించి ఉంటాడనీ, లేకపోతే అతడు తక్కువ సమయంలో అంత ప్రాముఖ్యత సంపాదించుకొనే వాడు కాదనీ కొంత మంది భావన. అతని పుస్తకం ఆర్యభట్టీయం కూడా 23 ఏళ్ళ వయసులో వ్రాసి ఉన్నట్లుగా భావిస్తున్నారు. కలియుగం 3600 వ సంవత్సరం నాటికి (అంటే సా.శ. 499) తన వయసు 23 సంవత్సరాలను అతడు ఆర్యభట్టీయంలో రాసాడు.<ref name="Roupp1997">{{cite book|author=Heidi Roupp|title=Teaching World History: A Resource Book|url=https://books.google.com/books?id=-UYag6dzk7YC&pg=PA112|accessdate=24 June 2012|date=1997|publisher=M.E. Sharpe|isbn=978-1-56324-420-9|pages=112–}}</ref>
 
ఆర్యభట్టుడు అతని గ్రంథాలలో శాలివాహన శకాన్నిగానీ, విక్రమాదిత్య శకాన్నిగాని ఉపయోగించలేదు. యుధిష్టర యుగాన్నే (కలియుగం) చెప్పేడు. అందువల్ల ఈయన యుధిష్టర యుగం వాడుకలో ఉండేటప్పుడే జన్మించి వుంటాడు. వరాహమిహిరుడు తనగ్రంధాల్లో శకభూపాలకాలమని, శకేంద్రకాలమని ఉపయోగించాడు. ఇదే విక్రమాదిత్యకాలమని [[భట్టోత్పలు]] డన్నాడు. భాస్కరుడు కూడా తన సిద్ధాంత గ్రంథాల్లో శాకనృప సమయమని ఉపయోగించాడు. ఇదే శాలివాహన శకమని కొందరు పెద్దలు చెబుతారు. ఈ రెండు శకాలు వాడుక లోనికి ఎప్పుడు వచ్చాయో అన్న విషయం చెప్పడం కష్టం. కాని ఇవి రెండూ వాడుక లోనికి రాక పూర్వమే ఆర్యభట్టుడు జన్మించాడు. ఆర్యభట్టుడు [[బ్రహ్మగుప్తుడు|'''బ్రహ్మగుప్తుడి'''కి]] పూర్వుడు. అనేక వందలసార్లు బ్రహ్మగుప్తుడు ఆర్యభట్టు నామాన్ని ఉదహరించాడు. వరాహమిహిరుని కన్నా పూర్వుడని అనేక ఆధారాలు ఉన్నాయి. ఎందుచేతనంటే, వరాహమిహిరుని గ్రంథాలు శ్రీసేనుడి [[రోమక సిద్ధాంతం]] మీదా, [[విష్ణుచంద్రుడు|విష్ణుచంద్రుడి]] [[వశిష్ట సిద్ధాంతం]] మీదా అధారపడి ఉన్నాయి. ఈ రెండు సిద్ధాంతాలు ఆర్యభట్టుని సిద్ధాంతాలను ఆధారంగా చేసుకొని వ్రాయబడినవని బ్రహ్మగుప్తుదు సూచించాడు. కాబట్టి ఆర్యభట్టుడు బ్రహ్మగుప్తుడికి, వరాహమిహిరునికి పూర్వుడన్నమాటను నమ్మవచ్చు. బ్రహ్మగుప్తుడు శాలివాహన శకంలో ఆరవ శతాబ్దానికి చెందినవాడు. వరాహమిహిరులు ఇద్దరున్నారు. రెండవ శతాబ్దంలో ఒకడు, ఐదవ శతాబ్దంలో ఒకడు. ఈ రెండవ వరాహమిహిరునికి పూర్వులైన విష్ణుచంద్ర శ్రీసేన దుర్గసింహులకు కూడా ఆర్యభట్టుడు పూర్వుడు. ఈ విషయాలన్నీ పరిశీలిస్తే, ఆర్యభట్టుడు నిస్సందేహంగా శాలివాహనశకం ఐదవ శతాబ్దానికి కొన్ని సంవత్సరాలు ముందుగానే ఉన్నాడని నిర్ధారణకు రావచ్చును. ఇంకా సూక్ష్మంగా చర్చిస్తే ఆర్యభట్టుడు క్రీ.శ.426లో జన్మించాడని, ఆర్యభట్టీయమనే గ్రంథాన్ని క్రీ.శ.499లో వ్రాసాడని చెప్పవచ్చును.
"https://te.wikipedia.org/wiki/ఆర్యభట్టు" నుండి వెలికితీశారు