ఇళయరాజా: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 21:
| website = {{URL|http://www.ilaiyaraajalive.com}}

{{Audio|Ilaiyaraaja.ogg|'''ఇళయరాజా'''}} ([[జూన్ 2]] [[1943]]లో '''జ్ఞానదేశికన్''' అనే పేరుతో జన్మించారు) భారతదేశపు సంగీత [[దర్శకుడు]], పాటల [[రచయిత]], [[గాయకుడు]]. తన 30 సంవత్సరాల వృత్తి జీవితములో వివిధ భాషలలో దాదాపు 5,000 పాటలకు, 1000 సినిమాలకు [[సంగీతము|సంగీత]] దర్శకత్వం వహించాడు.
ఇళయరాజా భారతదేశంలోని, [[చెన్నై]]లో నివసిస్తారు. 1970, 1980, 1990లలో ఇళయరాజా దక్షిణ భారత సినీ పరిశ్రమలోని గొప్ప సంగీత దర్శకులలో ఒకరు.<ref>http://www.filmscoremonthly.com/daily/article.cfm/articleID/6175/An-%22Unknown%22-Indian-Film-Music-master/</ref>
ఈయన [[తమిళ భాష|తమిళ]] జానపద పాటల రచనాశైలిని ఏకీకృతము చేశారు. దక్షిణ భారత సంగీతములో, పాశ్చాత్య [[సంగీతము]]లోని విశాలమైన, వినసొంపైన జిలుగులను ప్రవేశపెట్టాడు. ఉత్తమ సంగీత దర్శకునిగా నాలుగు సార్లు [[జాతీయ]] అవార్డు అందుకొన్నాడు.
ఇళయరాజా గారి నేపథ్య సంగీతంకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈయన పాశ్చాత్య ఆర్కెస్ట్రా లలో భారత సాంప్రదాయ సంగీత వాయిద్యాలతో చేసిన ప్రయోగాలు కూడా ప్రజలకు అప్పుడప్పుడు ఆయన ఇచ్చే సంగీత కచేరీల ద్వారా సుపరిచితమే. ఇలాంటి ప్రయోగాలకు ఈయన [[హంగేరి|హంగరీ]]<nowiki/>లో ప్రఖ్యాత "బుడాపెస్ట్ సింఫనీ ఆర్కెస్ట్రా"ని వాడేవారు.
1993 న లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఫిల్హర్మోనిక్ ఆర్కెస్ట్రాతో ఒక పూర్తి స్తాయి "సింఫనీ"ని కంపోస్ చేసి, ఆర్కెస్ట్రా చేయించి రికార్డు చేసారు. [[ఆసియా ఖండం]]లో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి ఈయనే. జనాలకు ఈయన "మేస్ట్రో " అని సుపరిచితం.
2003 లో న్యూస్ ఛానల్ "బీ.బీ.సి" నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో 155 దేశాల నుండి 1991 లో వచ్చిన మణిరత్నం "దళపతి" సినిమాలో "అరె చిలకమ్మా" పాటకు ప్రపంచ టాప్ 10 మోస్ట్ పాపులర్ సాంగ్స్ ఆఫ్ ఆల్ టైం 10 పాటలలో 4వ స్థానాన్ని ఇచ్చారు ప్రజలు. 2013 లో ప్రఖ్యాత న్యూస్ ఛానల్ సి.ఏన్.ఏన్-ఐ.బీ.ఏన్. వాళ్ళు 100 ఏళ్ళ భారత సినీ పరిశ్రమ పండగను పురస్కరించుకుని నిర్వహించిన సర్వేలో 49% మంది ఇళయరాజా గారిని భారతదేశ ఉత్తమ సంగీత దర్శకుడుగా ప్రజలు ఎన్నుకున్నారు.
భారత సినీ సంగీతానికి చేసిన కృషిగాను 2012 లో సంగీత నాటక అకాడెమీ [[పురస్కారం]], 2014 లో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఏమినేన్సు పురస్కారం అందుకున్నారు. 2015 లో [[గోవా]]లో జరిగిన 46వ "ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా"లో [[జీవితకాలం|జీవితకాల]] సాఫల్యత కొరకు సెంటినరీ అవార్డుతో గౌరవించారు 2018 లో [[భారత ప్రభుత్వం]] ఈయనను "[[పద్మవిభూషణ్]]" పురస్కారంతో సత్కరిచింది.

== బాల్యం, కుటుంబం ==
[[తమిళనాడు]] రాష్ట్రంలో, తేని జిల్లాలో పన్నైపురమ్ అనే గ్రామంలో ఒక పేద [[కుటుంబం]]లో రామస్వామి, చిన్నాతాయమ్మాళ్ దంపతులకు మూడవ కుమారునిగా ఇళయరాజా జన్మించారు. [[వ్యవసాయం|వ్యవసాయ]]<nowiki/>క ప్రాంతంలో పెరగటం వల్ల పొలాల్లో [[రైతులు]] పాడుకునే పాటలతో జానపద సంగీత పరిచయం కలిగింది. అతనిలోని సంగీత జ్ఞానం, అతని 14వ ఏట బయటపడింది. ఆ వయసులో ఇళయరాజా తన సవతి అన్న (పావలార్ వరదరాజన్, భారత కమ్యూనిస్టు పార్టీ ప్రచారక బృందంలో సంగీతకారుడు) నిర్వహించే సంగీత బృందంతో కలసి ఉరూరా తిరిగేవాడు. అతను తన సోదరులతో కలసి దక్షిణ భారతదేశంలోని చాలా గ్రామాలు, పట్టణాల్లో పావలార్ సంగీత సోదరులు అనే బృందంలో సభ్యునిగా పర్యటించాడు. ఈ కాలంలోనే ఇళయరాజా తన సంగీత జ్ఞానాన్ని పరీక్షించుకున్నాడు. మొదటగా కన్నదాసన్ అనే తమిళ కవి భారతదేశపు మొదటి ప్రధాని [[జవహర్లాల్ నెహ్రూ]]కు నివాళిగా వ్రాసిన దుఃఖముతో కూడిన పాటకు బాణీ కట్టాడు.<ref>Available from: http://www.hinduonnet.com/fr/2004/07/09/stories/2004070902310400.htm {{Webarchive|url=https://web.archive.org/web/20070216034838/http://www.hinduonnet.com/fr/2004/07/09/stories/2004070902310400.htm |date=2007-02-16 }}. Accessed 19 November 2006.</ref>

సంగీతాన్ని వృత్తిగా చేసుకొని అందులో స్థిరపడాలంటే క్రమబద్ధమైన సంగీత శిక్షణ ఎంతో అవసరం అని గ్రహించి 1968లో మద్రాసులో (ప్రస్తుతం చెన్నై) అడుగెడుతూనే, ఇళయరాజా ధనరాజ్ మాస్టర్ గారి వద్ద సంగీతం అభ్యసించాడు. ఆ సమయంలోనే ఆయనకు పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంతో కూడా పరిచయం ఏర్పడింది. బాఁక్, బీథోవెన్, మొజార్ట్, షూబర్ట్ మొదలైన పాశ్చాత్య సంగీతపు దిగజ్జాల యొక్క సంగీత శైలులు, ఆ తరువాత ఇళయరాజా బాణీ కట్టిన పాటలను ఎంతో ప్రభావితం చేసాయి (ఉదాహరణకు కౌంటర్ పాయింట్ యొక్క ఉపయోగం). ఇళయరాజ యొక్క శాస్త్రీయ సంగీత శిక్షణ ట్రినిటీ కళాశాల, [[లండన్]] నుంచి సాంప్రదాయక గిటార్లో ఆయనకు బంగారు పతకం తెచ్చిపెట్టింది.
"https://te.wikipedia.org/wiki/ఇళయరాజా" నుండి వెలికితీశారు