ఉత్తర సర్కారుల్లో ఐరోపా వారి యుద్ధాలు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
[[దస్త్రం:Musalipatam_Mschilipatnam_port_in_1759.jpg|thumb|1759లో మచిలీపట్నం ఓడరేవు పటం]]
[[ఉత్తర సర్కారులు|ఉత్తర సర్కారుల]]<nowiki/>పై ఆధిపత్యం కోసం ఐరోపా దేశాలైన [[బ్రిటీషు రాజ్|బ్రిటిషు]], [[ఫ్రాన్స్|ఫ్రెంచి]], [[నెదర్లాండ్స్|డచ్చి]], [[పోర్చుగల్|పోర్చుగీసు]] దేశీయులు తమలోతాము, స్థానిక నాయకులతోనూ అనేక యుద్ధాలు చేసారు. ఈ యుద్ధాల కారణంగా ఆ ప్రాంతాలపై ఆధిపత్యం మారుతూ వచ్చింది. పర్యవసానాల పరంగా గాని, యుద్ధ ఫలితాల కారణంగా గానీ వీటిలో ప్రధానమైనవి -[[బొబ్బిలి యుద్ధం]], [[చెందుర్తి యుద్ధం]], [[మచిలీపట్నం ముట్టడి]].
 
== పరిస్థితులు ==
1758 జూలై నాటికి ఉత్తర సర్కారుల్లో ఫ్రెంచి వారి ప్రాబల్యం బలంగా ఉంది. డి బుస్సీ తిరుగులేని నాయకుడిగా ఫ్రెంచి వారి ప్రాబల్యాన్ని ఆ ప్రాంతంలో నెలకొల్పాడు. హైదరాబాదు [[నిజాం|నిజాము]]<nowiki/>తో వారికి మైత్రి ఉంది.
 
బొబ్బిలి యుద్ధం పర్యవసానంగా [[బొబ్బిలి సంస్థానం]] నేలమట్టమైంది. [[విజయనగరం|విజయనగర]] రాజు, బుస్సీకి అనుంగు అనుచరుడూ అయిన విజయరామరాజు ఈ యుద్ధాంతాన హతుడయ్యాడు. అతడి స్థానంలో వరుసకు అతడి సోదరుడు ఆనందరాజు రాజయ్యాడు. విజయరామరాజు మరణించాక, వారసత్వం విషయంలో [[మార్కీస్ దే బుస్సీ|బుస్సీ]] చేసిన ఏర్పాటు పట్ల అతడు ఆగ్రహంగా ఉన్నాడు. ఈ లోగా బుస్సీ, నిజాము కోరిక మీద అతడికి సాయం చేసేందుకు [[ఔరంగాబాదు(మహారాష్ట్ర)|ఔరంగాబాదు]] వెళ్ళాడు. ఆ సమయంలో, ఆనందరాజు [[విశాఖపట్నం|విశాఖపట్నాన్ని]] (తెల్లవారు ''విజాగపటం'' అనేవారు) ఆక్రమించుకుని అక్కడ ఉన్న ఫ్రెంచి సేనానిని బందీగా పట్టుకున్నాడు. బ్రిటిషు వారితో మైత్రిని కోరుతూ [[బెంగాల్|బెంగాలు]]<nowiki/>కు ఒక వర్తమానం కూడా పంపించాడు. బ్రిటిషు వారు ఉత్తర సర్కారులపై దండెత్తి వస్తే తాను సాయం చేస్తానని అతడు వారికి తెలిపాడు<ref name=":0">{{Cite book|title=A Descriptive and Historical Account of The Godavery District in the Presidency of Madras|last=Morris|first=Henry|publisher=Trubner and Company|year=1878|isbn=|location=|pages=233}}</ref>
 
ఫ్రెంచి వారు లాలీ తోలెండాల్ నేతృత్వంలో [[చెన్నై|మద్రాసు]]<nowiki/>ను ముట్టడించి, బ్రిటిషు వారితో యుద్ధంలో ఉన్నారు. ఆ యుద్ధం కోసమని దక్కనులో ఫ్రెంచి దళాల కమాండరు డి బుస్సీని మద్రాసు పిలిపించారు. అతడు తన స్థానంలో ఉత్తర సర్కారులకు, ఫ్రెంచి సైన్యానికీ అధికారిగా కాన్‌ఫ్లాన్స్‌ను నియమించాడు. 1758 ఆగస్టు 3 న [[కృష్ణా నది]] ఒడ్డున ఉన్న [[రొయ్యూరు]] వద్ద రాజ్యం అప్పగింతలు చేసాడు. బుస్సీని మద్రాసు పిలిపించడం దక్కను, ఉత్తర సర్కారులలో ఫ్రెంచి ప్రాబల్యానికి గొడ్డలిపెట్టు అయింది<ref name=":0" />.
 
బుస్సీ మద్రాసు వెళ్ళిన సంగతి, ఉత్తర సర్కారుల రక్షణకు తగినంత సైన్యం లేదన్న సంగతీ తెలుసుకున్న [[రాబర్టు క్లైవు|క్లైవు]], అక్కడ ప్రాబల్యం పెంచుకునేందుకు అదే తగిన సమయమని భావించాడు. కలనల్ ఫ్రాన్సిస్ ఫోర్డ్ నేతృత్వంలో 2000 మంది సిపాయీలు, 500 మంది ఐరోపా సైనికులు, 100 మంది నావికులు, ఒక శతఘ్ని దళంతో కూడిన సైన్యాన్ని బెంగాల్ నుండి పంపించాడు. మరోవైపున మద్రాసు నుండి బ్రిటిషు అధికారి ఆండ్రూస్‌ను పంపించి ఆనందరాజుతో ఒప్పందం కుదురుచుకునేలా ఏర్పాట్లు కూడా చేసాడు. అక్టోబరు 15 న వారిద్దరి మధ్య కుదిరిన ఒప్పందం వివరాలివి<ref>{{Cite web|url=http://www.kronoskaf.com/syw/index.php?title=1758_-_British_operations_in_Deccan|title=1758 - బ్రిటిష్ ఆపరేషన్స్ ఇన్ దక్కన్|website=|access-date=2016-09-02|archive-url=https://web.archive.org/web/20160307082212/http://www.kronoskaf.com/syw/index.php?title=1758_-_British_operations_in_Deccan|archive-date=2016-03-07|url-status=dead}}</ref><ref name=":1">{{Cite book|url=https://archive.org/details/accountofwarinin00camb|title=An account of the War in India between the English and French|last=Cambridge|first=Richard Owen|publisher=George and Alexander Ewing|year=1761|isbn=|location=Dublin|pages=208}}</ref>