"ప్రభాస్" కూర్పుల మధ్య తేడాలు

9 bytes removed ,  1 సంవత్సరం క్రితం
చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
(2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
 
==సినీ జీవితం==
2002లో '''ఈశ్వర్''' సినిమాతో ప్రభాస్ తెరంగేట్రం చేసాడు. ఈ [[సినిమా]] నటుడు విజయ్ కుమార్ కుమార్తె శ్రీదేవికి కూడా [[తెలుగు]]<nowiki/>లో ఇది తొలి సినిమా. ఈ సినిమా విజయం సాధించినా ఆ తర్వాత 2003లో విడుదలైన '''రాఘవేంద్ర''' సినిమా పరాజయం పాలైంది. 2004లో [[త్రిష]] సరసన నటించిన ''[[వర్షం (సినిమా)|వర్షం]]'' సినిమా ప్రభాస్ కు మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించింది. ఆ తర్వాత ప్రభాస్ '''అడవి రాముడు''', '''[[చక్రం (సినిమా)|చక్రం]]''' సినిమాల్లో నటించాడు. ఈ సినిమాల ద్వారా ప్రభాస్ కు నటుడిగా మంచి గుర్తింపు లభించినా పరాజయం పాలయ్యాయి. 2005లో [[ఎస్. ఎస్. రాజమౌళి]] దర్శకత్వంలో ప్రభాస్ [[శ్రియా]] సరసన '''[[ఛత్రపతి (సినిమా)|ఛత్రపతి]]''' సినిమాలో నటించాడు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి ప్రభాస్ ను తెలుగులో ఒక నటుడిగా నిలబట్టింది. కానీ ఆ తర్వాత విడుదలైన '''[[పౌర్ణమి (సినిమా)|పౌర్ణమి]]''', '''[[యోగి (2007 సినిమా)|యోగి]]''' సినిమాలు పరాజయం చెందాయి. ఆ తర్వాత ప్రభాస్ [[ఇలియానా]] సరసన పైడిపల్లి వంశీ దర్శకత్వంలో '''[[మున్నా]]''' సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. 2008లో పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో త్రిష సరసన తన కెరియర్ లో రెండో సారి '''[[బుజ్జిగాడు]]''' సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా విజయం సాధించింది.
 
2009లో మెహెర్ రమేష్ దర్శకత్వంలో [[అనుష్క]], [[నమిత]]ల సరసన '''[[బిల్లా]]''' సినిమాలో నటించాడు. ఒక క్రూరమైన డాన్ మరియూ అతనిలాగే ఉండే ఒక చిల్లరదొంగ పాత్రల్లో ప్రభాస్ నటించాడు. ఈ సినిమా తనకు గుర్తింపునిచ్చినా సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ఆ తర్వాత [[పూరీ జగన్నాథ్|పూరి జగన్నాధ్]] దర్శకత్వంలో విడుదలైన '''[[ఏక్ నిరంజన్]]''' కూడా పరాజయం పాలైంది. 2010లో ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో [[కాజల్ అగర్వాల్]] సరసన '''[[డార్లింగ్ (2010 సినిమా)|డార్లింగ్]]''' సినిమాలో నటించాడు. తొలిసారిగా ఒక క్లాస్ రోల్లో నటించిన ప్రభాస్ ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. 2011లో మళ్ళీ కాజల్ అగర్వాల్ తో కలిసి [[కొండపల్లి దశరథ్|దశరథ్]] దర్శకత్వంలో '''[[మిస్టర్ పర్‌ఫెక్ట్]]''' సినిమాలో నటించాడు ప్రభాస్. [[కుటుంబము|కుటుంబ]] విలువల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో [[తాప్సీ]] మరో కథానాయిక. ఈ సినిమా డార్లింగ్ కంటే పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2983746" నుండి వెలికితీశారు