ఉమర్ ఆలీషా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఆధార గ్రంథాలు: AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 7:
</poem>
==జీవిత విశేషాలు==
ఉమర్‌ అలీషా పూర్వీకులంతా, వేదాంత పండితులుగా, తత్త్వవేత్తలుగా, [[కవులు]]<nowiki/>గా, గురువులుగా సుప్రసిద్ధులు. గురు-శిష్య సాంప్రదాయ అనురక్తులైన ఉమర్‌ అలీషా పూర్వీకులు, అధ్యాత్మిక జ్ఞాన ప్రచారం కోసం 1472లో "శ్రీ విజ్ఞాన విద్యాథ్యాత్మిక పీఠం" స్థాపించారు. ఈ పీఠం ద్వారా ధార్మిక విజ్ఞాన ప్రచారం గావిస్తూ, అధ్యాత్మిక సేవకు తమ జీవితాలను అంకితం చేసారు. మౌల్వీ మొహిద్దీన్‌ బాద్షాకు అగ్రనందనుడుగా ఉమర్‌ అలీషా [[1885]] [[ఫిబ్రవరి 28]]న, [[తూర్పుగోదావరి జిల్లా]] [[పిఠాపురం]]లో జన్మించారు. తల్లి పేరు చాంద్‌బీబి. [[సాహిత్య]], [[సారస్వత]], [[ధార్మిక]] సేవా కార్యక్రమాలలో [[తల్లితండ్రులు]] నిమగ్నమైయున్న ప్రత్యేక [[వాతావరణం]] నడుమ జన్మించిన ఉమర్‌ అలీషా, పూర్వీకుల శక్తి సామర్థ్యాలను, ప్రజ్ఞాపాటవాలను చిన్ననాటనే సంతరించుకున్నారు. ఎనిమిదవ ఏటనే అశువుగా [[కవిత్వం]] చెప్పి పండితులను, గురువులను ఆశ్చర్యచకితులను చేశారు. [[పిఠాపురం]]లోని ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన తరువాత ప్రముఖ సంస్కృతాంధ్ర భాషా పండితుల వద్ద ఆయన శిష్యరికం చేసారు. తండ్రి వెంట ఉంటూ అరబ్బీ, పర్షియన్‌, ఉర్దూ భాషలను నేర్చుకున్నారు. చిన్నతనంలో పలు భాషలతో పరిచయం సంపాదించిన ఉమర్‌ అలీషా 14 సంవత్సరాల వయస్సులో చంధోబద్ధంగా చక్కని తెలుగులో పద్యాలు రాయటం, ధారాళంగా కవిత్వం చెప్పటం ప్రారంభించి, తమ వంశ గురువైన శ్రీ అఖైలలీషాను స్తుతిస్తూ, '' బ్రహ్మవిద్యా విలాసం '' అను శతకాన్ని రచించారు. నూనూగు మీసాల ప్రాయంలోనే ఆయన ప్రజల చేత '' కవిగారు '' అని పిలిపించుకున్నారు.
చిన్నతనంలోనే మంచి విద్వత్తును సాధించిన ఆయన పద్యాలను ధారాళంగా అల్లగల నేర్పు సునాయాసంగా అబ్బటంతో 18వ ఏటనే నాటకాలు రాయటం ఆరంభించాడు. 1905 ప్రాంతంలో గద్య, పద్యాత్మకమైన '' మణిమాల '' నాటకాన్ని రాసారు. ఈ నాటకానికి ముందుగానే ఆయన మరో రెండు నాటకాలను రాసారు. ఈ నాటక రచనతో ఆయన పాండితీ ప్రతిభ నలుదిశలా వ్యాపించింది. ప్రముఖ ఆంగ్ల రచయిత [[షేక్స్‌స్పియర్‌]] నాటకాల స్థాయిలో [[మణిమాల]] నాటకం సాగిందని ఆనాడు పండిత ప్రముఖులు అభినందించగా, పత్రికలు బహుదా ప్రశంసించాయట.
 
ఉమర్‌ అలీషా విద్యాభ్యాసం ఉన్నత [[పాఠశాల]]<nowiki/>తో ముగిసింది. '' డిగ్రీల చదువు '' విూద ఆయన దృష్టి సారించలేదు. ఆనాటి పండితులు సృజియించిన అపార సాహిత్య సంపద ఆయనకు ఉపాధ్యాయ వర్గమైంది. తండ్రి ఆయన మార్గదర్శకులయ్యారు. తాతలు-తండ్రులు సృష్టించిన సాహిత్యం ఆయనకు పాఠ్యగ్రంథాలయ్యాయి. ఆ గ్రంథాలు మాత్రమేకాకుండా ప్రపంచ భాషలలోని పలు అధ్యాత్మిక, సాహిత్య గ్రంథాలను అథ్యయనం చేశారు. సాహిత్య ప్రక్రియాల విూద గట్టిపట్టు సంపాదించారు.
 
పండితుడిగా ప్రసిద్ధి చెందిన ఉమర్‌ అలీషా సరే అంటే చాలు తమ సంస్థానాలలో ఉన్నత ఉద్యోగాలను కల్పించగలమని పలుప్రాంతాల సంస్థానాల నుండి ఆహ్వానాలు వచ్చినా ఆయన కాదన్నారు. ధనార్జన విూద ఏమాత్రం ఆసక్తిలేని ఉమర్‌ అలీషా తన గడప తొక్కిన ఆహ్వానాలను తిరస్కరించారు. [[భాషా శాస్త్రం|భాషా]] సేవ, సారస్వత సేవ, [[వేదాంతము|వేదాంత]] సేవలో గడపాలని, సమాజ సేవ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ దిశగా ఉపక్రమించిన ఉమర్‌ అలీషా అతికొద్ది కాలంలోనే, అసమాన ప్రతిభను చూపుతూ పలు సాహితీ ప్రక్రియలలో అపూర్వమైన సారస్వత సంపదను సృష్టించారు.
"https://te.wikipedia.org/wiki/ఉమర్_ఆలీషా" నుండి వెలికితీశారు