"కుమారజీవుడు" కూర్పుల మధ్య తేడాలు

చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
క్రీ.శ 5 వ శతాబ్దికి చెందిన '''[[కుమారజీవుడు]]''' [[మధ్య ఆసియా]] నగర రాజ్యమైన కూచా (Kucha) లో జన్మించిన సుప్రసిద్ధ బౌద్ధ సన్యాసి. మహాయాన బౌద్ద పండితుడు. [[ప్రపంచము|ప్రపంచ]] అత్యుత్తమ అనువాదకులలో ఒకడు.
 
ఇతని తల్లి జీవిక కూచా రాకుమార్తె. తండ్రి కుమారయాన భారతీయ బ్రాహ్మణుడు. జన్మతా [[భారతీయుడు]] కానప్పటికి భారతీయ మూలాలను కలిగివున్న కుమారజీవుడు [[బాల్యం]] నుండే అత్యంత ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకొన్నాడు. తన తొమ్మిదవ సంవత్సరం నుండే తల్లితో కలసి దేశాలు పర్యటిస్తూ, [[కాశ్మీర్]], కాష్గర్, కూచా లలో బౌద్ధ సిద్ధాంతాలు అభ్యసించాడు. తొలుత సర్వాస్థివాద (హీనయానం) శాఖను అనుసరించినప్పటికి తరువాత మహాయాన బౌద్ధం లోకి మారాడు. ఇరవై సంవత్సరాల వయసు వచ్చేనాటికి [[మధ్య ఆసియా]]<nowiki/>లో అత్యంత ప్రముఖ బౌద్ధ సన్యాసిగా, అఖండ మేధో సంపన్నుడుగా పేరుగాంచాడు. [[మధ్య ఆసియా]] నుండే కాక, తూర్పు ఆసియా, [[చైనా]] దేశాలనుండి బొద్ద బిక్షువులు బోధనల కోసం, జ్ఞాన సముపార్జనకోసం ఇతని వద్దకు వచ్చేవారు. అయితే దురదృష్టవశాత్తూ చైనా దేశపు అంతర్గత రాజకీయ పోరులో నలిగిపోయి 17 సంవత్సరాలు పాటు యుద్ద ఖైదీగా బందీలో ఉన్నాడు. చివరకు విడుదలై క్రీ.శ 401 లో ఉత్తర చైనా రాజధాని ‘చాంగన్’ (changan) లో స్థిరపడ్డాడు.
 
చైనా చక్రవర్తి కోరిక మేరకు ప్రామాణిక బౌద్ధ గ్రంథాలను [[పాళీ]], [[సంస్కృత భాష]] ల నుండి చైనా భాషలోనికి అనువదించే బృహత్తర కార్యక్రమానికి నాయకత్వం వహించాడు. 12 సంవత్సరాల పాటు నిర్విరామ కృషి చేసి 384 వాల్యూంలతో కూడిన 74 బౌద్ధ గ్రంథాలను చైనా భాష లోనికి అనువదించి చైనీయులకు నిజమైన బౌద్ధతత్వాన్ని పరిచయం చేసాడు. తన ముందు కాలంలో చినా భాషలోనికి మొరటుగాను, అసంబద్డంగాను అనువదించబడిన ప్రామాణిక బౌద్ధ గ్రంథాలను చక్కని అనువాదంతో తిరిగి పరిష్కరించడమే కాక తన అనువాదాల ద్వారా చైనాలో మహాయాన బౌద్ధ వికాసానికి అవసరమైన తాత్విక ఆధార భూమికను కల్పించాడు. సర్వాస్థివాద, మహాయాన బౌద్దానికి చెందిన అనేక ప్రముఖ [[గ్రంథాలు]] మూల సంస్కృతంలో అలభ్యమైనప్పటికి కుమారజీవుని చైనీయ అనువాదాల నుండే అందులోని విషయాలు తిరిగి వెలుగులోకి వచ్చాయి. కుమారజీవుని చైనా అనువాదాలనుండే ఇంగ్లిష్ భాషలతోపాటు ఇతర ప్రపంచ భాషల్లో ప్రామాణిక బౌద్ధ గ్రంథాలు అనువదించబడ్డాయి. ప్రపంచ అత్యుత్తమ అనువాదకులలో ఒకనిగా కుమారజీవుడు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయాడు.
 
==బాల్యం-విద్యాభ్యాసం==
కుమారజీవుని 7సంవత్సరాల వయసులో ఇతని తల్లి జీవిక తన భర్త నుండి అనుమతి పొంది బౌద్ధ సన్యాసినిగా మారి కూచాలోని సియోలి (Tsio-li) సన్యాసినుల [[మఠం]]<nowiki/>లో చేరింది. ఏడు సంవత్సరాల చిరుప్రాయంలోనే కుమారజీవుడు బౌద్ధ సూత్రాలను వల్లెవేస్తూ అసాధారణ ప్రజ్ఞా పాటవాలను కనపరచడంతో, తల్లి జీవిక ఇతనిలోని ప్రతిభను గుర్తించి బౌద్ధ సిద్ధంతాలతోను, చింతనలోను చక్కని ప్రావీణ్యం నేర్పించాలనే నిశ్చయించింది.
===[[కాశ్మీర్]] లో విద్యాభ్యాసం===
కుమారజీవుని విద్యాభ్యాస నిమిత్తం 9 సంవత్సరాల వయసులో అతనిని తోడ్కొని తల్లి జీవిక [[మధ్య ఆసియా]] నుండి ప్రయాసభరితమైన ప్రయాణం సాగించి బుద్ధుడు జన్మించిన భారతదేశానికి చేరుకొంది. కుమారజీవుడు ముందుగా తండ్రి స్వస్థలం అయిన కాశ్మీర దేశంలో ప్రసిద్ధ బౌద్ధాచార్యుడు అయిన ‘బందుదత్తు’ని వద్ద సంస్కృతం అభ్యసించాడు. స్థవిరవాదుల సంప్రదాయానికి చెందిన నికాయాలను దీర్ఘ ఆగమ, మధ్యమ ఆగమ, ఖుద్దక ఆగమాలను నేర్వడమే కాకుండా భారతీయ వైద్యం, ఖగోళం, జ్యోతిషం, తర్కం, గ్రంథ వివరణ, వ్యాఖ్యాన రీతులలో ప్రావీణ్యం సంపాదించాడు. కాశ్మీర రాజు సమక్షంలో జరిగిన విద్వత్ గోష్ఠిలో పాల్గొన్న కుమారజీవుడు పిన్న వయసులోనే తన వాదనాపటిమతో అనేకమంది బౌద్దేతర గురువులను ఓడించడంతో అతని పేరు ప్రసిద్ధమైంది. 3 సంవత్సరాల తదనంతరం భారతదేశంలో విద్యను పూర్తి చేసుకొని తన తల్లితో కలసి కుమారజీవుడు తిరిగి కూచా రాజ్యానికి పయనమైనాడు.
 
===కాష్గర్ లో విద్యాభ్యాసం===
మార్గమద్యంలో తల్లితో కలసి కుమారజీవుడు కాష్గర్ నగరంలో ప్రవేశిస్తున్నప్పుడు ఒక బౌద్ద మోక్ష సన్యాసి (Arhat) కుమారజీవుని ఉద్దేశించి అతనికి ఉజ్వల భవిష్యత్తు వుందని, బౌద్ధ ధర్మప్రచారకుడిగా అసాంఖ్యకమైన ప్రజలను బౌద్ధంలోకి ఆకర్షించగలడని భవిష్యవాణి పలికాడు. అప్పటికే మద్య ఆసియా లోని కాష్గర్ నగరం బౌద్ధ ఆచార్యులతో, బౌద్ద గ్రంథాలయాలతో విలసిల్లుతున్నది. కాష్గర్ లో స్థిరపడిన ఒక కాశ్మీర బౌద్ధసన్యాసి 'బుద్ధయాసు'ని మార్గదర్శకత్వంలో అభిధర్మ సాహిత్యాన్ని అభ్యసించాడు. వైదిక సాహిత్యం, వేద మంత్ర ఉచ్చారణ రీతులను నేర్చి, పారమార్ధిక సత్త్యోద్ఘాటనలో కనిపించాల్సిన ఉచ్చారణా ధ్వనిరీతులపై పట్టు సాధించాడు. కాష్గర్ నగరంలో వుంటున్నప్పుడే [[పాళీ]], [[సంస్కృత భాష]] లతో పాటు మధ్య ఆసియా భాషలపై పట్టు సాధించాడు. ఇవి తరువాతి కాలంలో [[సంస్కృతము|సంస్కృతం]]<nowiki/>లో వున్న బౌద్ధ గ్రంథాలను [[చైనా]] భాషలోకి అనువాదం చేయడంలో కుమారజీవునికి ఎంతగానో ఉపకరించాయి. ఒకానొక సందర్భంలో కాష్గర్ రాజాస్థానంలో కుమారజీవుడు విశిదీకరించిన ఒక బౌద్ధ ధర్మసూత్రాన్ని ఆధారం చేసుకొని అక్కడి బౌద్ధ మఠాలలో కనిపించే నిర్లక్ష్యధోరణిలను సంస్కరించే ప్రయత్నం జరిగింది.తరువాత 12 వ ఏట కుమారజీవుడు తల్లితో కలసి కాష్గర్ ను విడిచి తుర్పాన్ (Turpan) చేరుకొన్నాడు.
 
==మహాయాన బౌద్దంలోనికి కుమారజీవుడు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2984323" నుండి వెలికితీశారు