కొక్కొండ వెంకటరత్నం పంతులు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 44:
 
==జీవిత విశేషాలు==
తల్లి రామాంబ, తండ్రి నరసింగరావు పంతులు గారు. జననం [[మార్చి 24]], [[1843]] [[వినుకొండ]]<nowiki/>లో. వీరు మాధ్వులు. తండ్రిగారు1845 లో మరణించారు. మేనమామ అప్పయ సోమయాజి. [[నందిరాజు లక్ష్మీనారాయణ దీక్షితులు]] గారు వెంకటరత్నంగారి తల్లికి పెదతండ్రి. వెంకటరత్నం గారు సంస్కృతాంధ్ర గ్రంథములు ఇంటివద్దనే చదువుతూ ఇంగ్లీషు పాఠశాలలో చదివారు. 1855 లో మేనరిక వివాహం. 15 వ ఏటనే [[గుంటూరు]] [[కలెక్టరు]] కచ్చేరీలో గుమాస్తాగా ఉద్యోగంలో చేరారు. చిన్నప్పుడే కవిత్వం అబ్బినది. వెంకటరత్నం పంతులు గారు స్మార్తులైనారు. 1856 లో మొట్టమొదటి పర్యాయము చన్నపట్టణం వెళ్ళారు. 1856 కాళయుక్తసంవత్సరంలో కంపెనీసర్కారు వారి సర్వే పార్టీలో ఉద్యోగమునకు దరకాస్తుచేశారు. సేలంలో సర్వే పార్టీలో ఉద్యోగం వచ్చింది. అటుతరువాత [[కోయంబత్తూరు]] దగ్గర పాల్ఘాట్ వెళ్లి అక్కడ [[తెలుగు]] పాఠశాల పెట్టారు. అందులో [[కన్నడం]], అరవం కూడా బోధించేవారు. [[కోయంబత్తూరు]]లో నారాయణ అయ్యర్ వారి వద్ద [[సంగీతం]] నేర్చుకున్నారు. 1864 లో వారి తల్లిగారు [[ఉడుపి]] యాత్రలో మరణించారు. 1863లో సర్వే పార్టీ మూసివేసినతరువాత 1866 లో చన్నపట్టణం రెవెన్యూబోర్డులో ఉద్యోగం చేశారు. 1870 లో చన్నపట్టణంలో హిందూ ప్రొప్రయటరీ స్కూలులో తెలుగు పండితులుగా చేరారు. 1870 సంవత్సరములో హిందూశ్రేయోభివర్ధనీ సమాజమును స్థాపించి దానిలో విద్యార్థులను, ఉపాధ్యాయులను, ఉద్యోగస్తులను సమావేశ పరచి ఒకొక్క సారి ఒకొక్క విషయమునుగూర్చి ఉపన్యాసముచేశేవారు. 1871 లో [[ఆంధ్ర భాషాసంజీవని పత్రిక]] స్ధాపించారు. అందులో పత్రికాలక్షణములు గురించి, పత్రికాసంపాదకులక్షణముల గురించి పద్యాలు వ్రాసేవారు. ఆ ఆంధ్ర భాషాసంజీవనిలో [[ఇంగ్లీషు]] పత్రికలమాదిరి సంపాదకీయాలు ప్రారంభించారు. ఆ పత్రిక 1871 నుండి 1883 వరకూ నడచింది. అటుతరువాత మళ్ళీ 1892 నుడీ 1900 వరకూ నడిచింది. బందరునుండి ప్రచురించబడే [[పురుషార్ధ ప్రదాయిని]] పత్రిక 1872 జూలై సంకలనంలో కొక్కొండవారి ఆంధ్ర భాషాసంజీవని గూర్చి ప్రశంసిస్తూ ఇంగ్లీషులోను [[తెలుగు]]లోనూ సమీక్షలు ప్రకటించారు. ఆ పత్రికలో ప్రచురించబడిన ముఖ్యవిషయములను ఇంగ్లీషు ప్రభుత్వ ట్రాన్సలేటర్ ( Govt. Translator) లెఫ్టనెన్టు కర్నల్ లేన్ దొర గారు (Lt.Col Lane) [[ఇంగ్లీషు]]లోకి తర్జుమాచేసి ప్రతినెలా [[మద్రాసు]] ప్రభుత్వమునకు రిపోర్టు పంపిచేవారు. 1874 నవంబరులో వీరి ఆంధ్రభాషా సంజీవని పత్రికలో సంజీవిని సమాచారమని పేరుతో దేశ పరిపాలన వ్యవహారములను గూర్చిన 16 ప్రశ్నలు ప్రకటించారు. ఈ ప్రశ్నలు తమ పాఠకులు చదివి తమ అభిప్రాయాలను కారణాలు ఉదాహరణలు వ్రాసి పంపమని పత్రికాధివతి కోరారు. ఆ 16 ప్రశ్నలనూ గూడా ప్రభుత్వ ట్రాన్స్ లేటర్ కర్నల్ లేన్ దొర ఇంగ్లీషులోకి తర్జుమా చేసి ప్రభుత్వానికి పంపారు. ఆ 16 ప్రశ్నలు [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వమువారు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య చరిత్ర మొదటి సంకలనములో 58 వ చారిత్రక పఠముగా "Report on Telugu Newspaper for November 1874"లో ఉంది.<ref>History of Freedom Struggle in Andhra Pradesh (1965) Govt of A.P. Volume 1, Document No.58</ref>. ఆంధ్రభాషా సంజీవిని గూర్చి తిరుమల రామచంద్రగారి వ్యాసం 1986.<ref>"తెలుగు పత్రికల సాహిత్య సేవ" తిరుమల రామచంద్ర విశాలాంధ్ర ఆగస్టు 10 ఆదివారం 1986</ref> 1874 అక్టోబరులో స్ధాపించిన కందుకూరి వీరేశలింగం గారి [[వివేకవర్ధని పత్రిక]] ఆంధ్ర భాషాసంజీవనికి పోటీ పత్రికగా నుండేది. 1871 లో కందుకూరి వీరేశలింగంగారు కొక్కొండ వెంకటరత్నంగారిని గొప్పగా ప్రశంసిస్తూ వ్రాసిన లేఖ వకటి 1951[[జూలై]] నెల [[భారతి]] ప్రచురణలో [[నిడదవోలు వెంకటరావు]] గారు ప్రచురించారు. కానీ 1874 నుంచీ వివేకవర్ధనిలో [[కందుకూరి వీరేశలింగం]] గారు కొక్కొండవారి సంజీవనిపై విమర్శలు ప్రచురించటము ప్రారంభించారు. 1875 లో వెంకటరత్నంగారు "హాస్యవర్ధని" స్థాపించారు, 1876 లో కందుకూరి వీరేశలింగం గారు "హాస్య సంజీవని" ప్రచురణ ప్రారంభించారు. ఆ విధముగా కొక్కొండ వారికీ, కందుకూరి వారికీ వ్యంగ్య వాదోపవాదాలు కొనసాగుతూ వుండేవి. 1877 లో కొక్కొెండ వెంకటరత్నం గారు [[మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల|మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీ]]లో [[తెలుగు]] పండితులుగా నియమింప బడ్డారు. 1890 లో ప్రెసిడెన్సీ కాలేజీలో కొక్కొండ వారు ఆంధ్రభాషావర్ధని స్థాపించారు. [[బ్రిటిష్]] ప్రభుత్వమువారు కేవలం సంస్కృత పండితులకే ఇచ్చేటటువంటి [[మహామహోపాధ్యాయ]] బిరుదును అందుకున్న ప్రప్రథమ ఆంధ్ర పండితుడు శ్రీ కొక్కొండ వెంకటరత్నం గారు. 1907 లో ఆ బిరుదు వారికి ఇవ్వబడింది. [[రాజమండ్రి]]లో జరిగిన ఆంధ్ర సాహిత్యపరిషత్తు సమావేశములకు కొక్కొండ వెంకటరత్నం గారు 1912 ఏప్రిల్23 వతేదీన, 1913 ఏప్రిల్ 22 తేదీన జరిగిన సమావెేశమునకు అధ్యక్షత వహించారు. ఆంధ్ర పత్రిక 1915 సంవత్సరాది సంచికలో వారి పద్యాలు.<ref>"జీవిత చరిత్రలు" [[దిగవల్లి వేంకట శివరావు]] అప్రచురిత రచన</ref>
 
ఈయన రచించిన మహాశ్వేత (1867) [[తెలుగు]]<nowiki/>లో తొలి నవలగా కొంతమంది భావిస్తారు.<ref>[http://books.google.com/books?id=sHklK65TKQ0C&pg=PA209&lpg=PA209&dq=kokkonda+venkataratnam+pantulu#v=onepage&q=kokkonda%20venkataratnam%20pantulu&f=false A History of Indian Literature: 1800-1910, western impact: indian ..., Volume 8 By Sisir Kumar Das p.209]</ref>
వీరు [[డిసెంబర్ 14]] [[1915]] తేదీన పరమపదించారు.