కంకంటి పాపరాజు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 39:
 
== రచనలు ==
కంకంటి పాపరాజు విష్ణుమాయా విలాసం([[యక్షగానం]]), [[ఉత్తర రామాయణం]](ప్రబంధం) రచించాడు. విష్ణుమాయా విలాసం [[రచన]]<nowiki/>లో పుష్పగిరి తిమ్మన సహాయం చేశాడని అవతారికలో కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. పాపరాజుకు ప్రఖ్యాతిని కట్టబెట్టిన రచన "ఉత్తర రామాయణం". [[ఉత్తర రామాయణం|ఉత్తరకాండ]] రామాయణంలో అంతర్భాగం, భవభూతి దీన్ని ఉత్తర రామచరితమ్ నాటకంగా మలిచాడు. ఐతే దీన్ని తెలుగులో తిక్కన "నిర్వచనోత్తర రామాయణం"గా అనువదించాడు. [[రంగనాథ రామాయణము|రంగనాథ రామాయణం]]<nowiki/>లోనూ ఉత్తరకాండ ఉన్నా, పాపరాజు రచన ఓ విశిష్టతను సంతరించుకుంది. కంకంటి పాపరాజు ఉత్తర రామాయణాన్ని ప్రబంధశైలిలో గద్య, పద్యాత్మకంగా(చంపూశైలి) రచించాడు.
 
== శైలీ-శిల్పము ==
పాపరాజు ఉత్తర [[రామకథను వినరయ్యా|రామకథ]]<nowiki/>లోని పురాణ లక్షణాన్ని వదలగొట్టి ప్రబంధ పరిమళాలను అద్దాడు. ప్రబంధ శైలిలో పద్యనిర్మాణం, అష్టాదశ వర్ణనలు చేయడం మాత్రమే కాక [[సీతారాములు|సీతారాము]]<nowiki/>ల వేషభాషలు, సరస సంభాషణలు తదితర అంశాలన్నిటా ప్రబంధలక్షణాలు ఆపాదించాడు. ఆ ప్రయత్నంలో ఈ కావ్యాన్ని విలాసకావ్యంగా మలిచారు కంటింటి.<ref >బేతవోలు రామబ్రహ్మం రాసిన పద్యకవితా పరిచయం గ్రంథంలో కంటింటి పాపరాజు వ్యాసం</ref>
=== పాత్ర చిత్రణ ===
పాత్రచిత్రణకు కూడా పురాణస్థాయిని పరిగణనలోకి తీసుకోకుండా రాజవంశంలోని సాధారణ నాయికా నాయకులుగా మలిచాడు. ప్రబంధ లక్షణాలను ఆపాదించే క్రమంలో కంటింటి సీతారాముల పౌరాణిక స్థాయి ఉదాత్తతను కూడా పరిగణించలేదంటే ఆయన ప్రబంధ రచనపై ఎంతటి దృష్టి సారించారో అర్థం చేసుకోవచ్చు.
"https://te.wikipedia.org/wiki/కంకంటి_పాపరాజు" నుండి వెలికితీశారు