గద్వాల సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు

చి వికీ శైలి ప్రకారం సవరణలు చేశాను
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 5:
1650 ప్రాంతంలో ముష్టిపల్లి వీరారెడ్డి [[అయిజా]], [[ధరూర్]] మొదలైన మహళ్లకు నాడగౌడుగా ఉండేవాడు. వీరారెడ్డికి మగ సంతానం లేకపోవడం వలన తన ఏకైక కుమార్తెకు వివాహం చేసి అల్లుడు పెద్దారెడ్డిని ఇల్లరికం తెచ్చుకున్నాడు. వీరారెడ్డి తరువాత అల్లుడు పెద్దారెడ్డి నాడగౌడు అయ్యాడు. పెద్దారెడ్డికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు ఆనందగిరి, చిన్నవాడు సోమగిరి (ఇతననే సోమానాధ్రి, సోమన్నభూపాలుడుగా ప్రసిద్ధుడయ్యాడు). పెద్దారెడ్డి తరువాత అతని రెండవ కొడుకు సోమన్న.ఇతను [[1704]] నుండి నాడగౌడికం చేశాడు.ఇతను కృష్ణా నది తీరాన గద్వాల కోట నిర్మించి తుంగభద్రకు దక్షిణాన రాజ్యాన్ని [[బనగానపల్లె]], [[ఆదోని]], సిరివెళ్ల, [[నంద్యాల]], సిద్ధాపురం, [[ఆత్మకూరు, కర్నూలు జిల్లా|ఆత్మకూరు]], [[అహోబిళం]], [[కర్నూలు]] మొదలైన ప్రాంతాలకు విస్తరింపజేశాడు. ఈ సంస్థానం కింద 103 పెద్ద గ్రామాలు, 26 జాగీరులు ఉండేవి.
[[File:Nala Somanadri.jpg|thumb|సోమనాద్రి]]
[[నిజాం]] అలీ ఖాన్ అసఫ్ ఝా II యొక్క పరిపాలనా కాలంలో, [[దక్కన్ పీఠభూమి|దక్కను]]<nowiki/>లోని కొన్ని ప్రాంతాలలో మరాఠుల ప్రాబల్యం పెరిగి 25 శాతం ఆదాయ పన్ను (''చౌత్'') వసూలు చేయడం ప్రారంభించారు. దీనిని ''దో-అమలీ'' (రెండు ప్రభుత్వాలు) అని కూడా అనేవారు. రాజా సీతారాం భూపాల్ [[1840]] లో మరణించాడు. ఆ తరువాత అతని [[దత్తపుత్రుడు]] రాజా సీతారాం భూపాల్ II సంస్థానంను పరిపాలించాడు. నిజాం VII ఇతనికి "మహారాజ" అనే పట్టంను ప్రధానం చేశాడు. [[1924]] లో మరణించే సమయానికి ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
 
గద్వాల సంస్థానాధీశులు తమ స్వంత నాణేలను ముద్రించుకున్నారు. 1909 నాటికి కూడా ఈ నాణేలు రాయిచూరు ప్రాంతంలో చలామణీలో ఉండేవి. <ref>ImprialGazetterOfIndiaHyderabad పుస్తకం నుండి. ఇంపీరియల్ గజెట్లను [http://www.archive.org/search.php?query=collection%3Amillionbooks%20AND%20language%3AEnglish%20AND%20imperial మిలియన్ బుక్స్] సైటు నుండి దిగుమతి చేసుకోవచ్చు</ref>
"https://te.wikipedia.org/wiki/గద్వాల_సంస్థానం" నుండి వెలికితీశారు