గుమ్మడి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు, ను → ను , → using AWB
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 29:
* [[సంస్కృతము]] పీతకూష్మాండః
 
గుమ్మడి ఆంధ్రులకు ప్రీతికరమైన శుభప్రథమైన తరచూ వాడబడు [[కూర]].ఇది ప్రపంచములో అన్ని దేశాలలో దొరుకు తుంది . గుమ్మడిలో అద్భుత ఔషధాలున్నాయి. గుమ్మడి కాయను భారత సంప్రదాయక వంటకాలలో దీనికి మంచి స్థానమే ఉంది. ఇందులోని పదార్థాలు వివిధ రోగాలను నివారించే గుణం కలిగి ఉండడం విశేషం. [[మలబద్దకం|మలబద్ధకం]] మొదలుకుని [[మధుమేహం]] వరకూ చాలా విధాల ఉపయోగపడే గుమ్మడిలో నిజంగా గమ్మత్తైనదే. [[చైనా]]<nowiki/>లో చక్కెర వ్యాధి వలన సంక్రమించే సమస్యల పరిష్కారానికి తయారు చేసే మందుల్లో గుమ్మడిని వాడుతున్నారు.
 
==భౌతిక రూపము==
పంక్తి 45:
గుమ్మడి విత్తనాలను ఎండబెట్టి పొడిచేసి నీళ్ళలో కలిపి తాగితే [[మూత్ర వ్యవస్థ|మూత్ర]] సంభంద వ్యాధులు తగ్గుతాయి .
 
ఆహారం ద్వారా శరీరంలోకి చేరే కొవ్వును పేగులు గ్రహించకుండా చేయడం ద్వారా [[కొవ్వు పదార్ధాలు|కొవ్వు]] నిల్వలను గణనీయంగా తగ్గించవచ్చు. ఇలా దేహంలో కొవ్వు చేరకుండా కాపాడుకోవాలంటే గుమ్మడి గింజలు తినడం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. గుమ్మడి గింజల్లో ఉండే ఫైటోస్టెరాల్ నిల్వలు కొవ్వు నిల్వలను పోలి ఉంటాయి. ఈ కారణంగా గుమ్మడి గింజలను ఆహారంగా తీసుకున్న వారిలో అవి జీర్ణమైన తర్వాత [[పేగులు]] ఈ ఫైటోస్టెరాల్ నిల్వలను కూడా గ్రహిస్తాయి. దీనివల్ల శరీరంలోకి చేరాల్సిన కొవ్వు శాతం బాగా తగ్గుతుంది. ఇలా గుమ్మడితో లాభాలతో పాటు విటమిన్-ఇ, ఒమెగా-3 [[కొవ్వు పదార్ధాలు|కొవ్వు]] [[ఆమ్లాలు]], [[మెగ్నీషియం]], ఫోలేట్ లాంటి శరీరానికి మేలు చేసే పోషకాలు కూడా లభిస్తాయి. అందుకే కొవ్వు సమస్యతో బాధపడేవారు తమ [[ఆహారం]]<nowiki/>లో గుమ్మడి గింజలు ఉండేలా చూచుకుంటే మంచిది. వీటిలో మెగ్నీషియం మెండుగా ఉంది. ఇంకా మినరల్స్‌ అత్యధికంగా పోగుపడ్డ గింజలు. అంతేకాదు వీటికి ఆహారంలో భాగస్వామ్యం కల్పిస్తే మన జీవితకాలం మరింత పెరుగుతుందట! గుమ్మడి ప్రొస్టేట్ గ్రంథుల వాపును తగ్గించడానికి వైద్య పరంగా గుమ్మడి కాయ సరిపోతుంది. గుమ్మడి విత్తనాలు తినడం వలన [[మలబద్దకం|మలబద్ధకం]] నివారణ ఆవుతుంది. ఆహారం పూర్తిగా జీర్ణమై మలబద్ధక సమస్య తీరుతుంది. తరచూ గుమ్మడిని తీసుకోవడం వలన గ్యాస్ట్రిక్ నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఛాతీ నొప్పి, ఊపిరితిత్తుల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు. గుమ్మడి తీసుకోవడం వలన చక్కెర వ్యాధిగ్రస్తులకు రకరకాల ఉపయోగాలున్నాయి. రక్తంలోని [[గ్లూకోస్|గ్లూకోజ్‌]]<nowiki/>ను బాగా తగ్గిస్తుంది. పైగా గింజల నుంచి తీసే నూనె వాడడం వలన అధిక [[రక్తపు పోటు|రక్తపోటు]] అదుపులో ఉంటుంది.
 
==ఆయుర్వేదములో గుమ్మడి :==
పంక్తి 52:
 
==పుట్టుక==
[[దక్షిణ అమెరికా]]<nowiki/>లోని అతి ప్రాచీన రెడ్ ఇండియన్ సమాధుల్లో లభించిన అవశేషాలను బట్టి వేల ఏండ్ల క్రితం నుంచీ గుమ్మడిని [[మానవులు]] ఆహారంగా వాడేవారని శాస్త్రజ్ఞులు నిర్ణయించారు. [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో చరిత్ర పూర్వ యుగాల నుంచీ గుమ్మడిని పండించడం ఉంది. అయినా గుమ్మడి జాతి తొట్టతొలి [[జన్మస్థలం]] మాత్రం పదివేల సంవత్సరాలకు పూర్వమే ఉభయ అమెరికా ఖండాల్లో అత్యుష్ణ ప్రాంతాల్లో ఆవిర్భవించిందని వారి అంచనా.
 
అయితే గుమ్మడి జాతుల్లో కొన్నింటికి ఉన్న [[సంస్కృతము|సంస్కృత]] పేర్లు కూడా అతి ప్రాచీన కాలం నాటివని నిర్ధారణ అయింది. ఉభయ అమెరికా ఖండాల నుంచి ఎటువంటి నౌకాయానాలు లేనట్టి అంత ప్రాచీన కాలంలోనే ఈ మొక్క [[భారత దేశము|భారతదేశం]] దాకా ఎలా విస్తరించి ఉంటుందనే దానిపైన కూడా శాస్త్రజ్ఞులు విస్తృతంగా చర్చించారు. చివరికి ఎండిన గుమ్మడిపళ్ళు అతి తేలికైనవైనందున అవి మహాసముద్రాల నీటిపై తేలుతూ, మొలకెత్తే సామర్థ్యం కోల్పోని విత్తనాలతో సహా ఒక ఖండం నుంచి మరో ఖండానికి విస్తరించి, అక్కడ అనుకూల పరిస్థితుల్లో మొలకెత్తి ఉండవచ్చుననే నిర్ధారణకు వచ్చారు. అమెరికన్లు 'రెడ్ పంప్కిన్' అని పిలిచే మంచి గుమ్మడి భారతదేశంలో ప్రవేశించి, 'లాల్ కుమ్రా' అని పిలువబడుతున్నది.
 
[[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]<nowiki/>లోనే పుట్టిన కషో అనే మరో జాతి గుమ్మడిని భారతీయ మార్కెట్లలో 'ఆఫ్రికన్ గోర్డ్' అనడాన్ని బట్టి మూలంలో అమెరికాలో జన్మించిన ఆ జాతి అక్కడ నుంచి ముందు ఆఫ్రికా ఖండానికి విస్తరించి, ఆ తరువాత భారతదేశానికి విస్తరించి ఉంటుందని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ప్రస్తుతం ఆఫ్రికన్ గోర్డ్‌గా పిలవబడుతున్నప్పటికీ, ఈ జాతి భారతదేశానికి అతి ప్రాచీన కాలంలోనే వచ్చి చేరింది. విచిత్ర వీణ, తంబూరా వంటి సంగీత వాద్యాలు తయారుచేసేందుకు అతి పెద్దవైన ఈ జాతి గుమ్మడి పండు బుర్రల్నే అత్యం త ప్రాచీన కాలం నుంచి భారతీయులు ఉపయోగించేవారు.
 
==ప్రయోజనాలు==
గుమ్మడి పండునే కాదు; వాటి లేత [[ఆకులు]], [[కాండం]], [[పూలు]] కూడా కూరకు వాడుకుంటారు. గుమ్మడి గింజల్ని తింటారు. [[హల్వా]]<nowiki/>లు వంటి స్వీట్లలో బాదం, పిస్తా, చార (సార) పప్పు లాగే ఈ గింజలలోని పప్పును కూడా డ్రెస్సింగ్‌గా వాడతారు. కొందరైతే గుమ్మడి పండుతోనే హల్వా చేసుకుంటారు. గుమ్మడిలో [[పొటాషియం]], [[భాస్వరము|ఫాస్ఫరస్]], [[గంధకము|సల్ఫర్]], [[మెగ్నీషియం]], [[కాల్షియం]] వంటి ఉపయుక్త ఖనిజాలే కాక, విటమిన్ ఎ (అధికంగానూ), కొద్దిగా విటమిన్ సి (కొద్దిగానూ) ఉన్నందున అది ఆహారపరంగా విలువైనదని గుర్తించారు. గుమ్మడి పండుకు ఎన్నో వైద్యపరమైన ప్రయోజనాలున్నాయి. [[ఉదరము|కడుపు]]<nowiki/>లోని 'టేప్ వార్మ్స్' నిర్మూలన కోసం గుమ్మడి గింజల్ని పంచదారతో తినిపిస్తారు.
 
రాత్రి పడుకోబోయే ముందు తినిపించి, తెల్లవారుఝామునే ఆముదం తాగిస్తారు. [[సెగవ్యాధి|గనేరియా]], మూత్ర వ్యాధులున్న రోగులకు మూత్రం సాఫీగా వెడలేందుకు గుమ్మడి విత్తులు [[చక్కెర|పంచదార]] లేక [[తేనె]]<nowiki/>తో తినిపిస్తారు. సెగగడ్డలు, మొండి వ్రణాలకు గుమ్మడి పండు గుజ్జును మలాం పట్టీగా వేస్తారు. [[తేళ్ళు]], కాళ్ళజెర్రులు, మండ్రగబ్బలు మొదలైనవి కుట్టినప్పుడు, గుమ్మడిపండు తొడిమను ఎండబెట్టి పొడి చేసి, దానితో తయారుచేసిన పేస్టును రాస్తే తక్షణ ప్రయోజనం ఉంటుంది. కాలిన గాయాలకు గుమ్మడి పండు గుజ్జుతో పట్టు వేస్తారు. గుమ్మడి విత్తులు మూత్రకారిగానే కాక, నరాల బలహీనత ఉన్నవారికి టానిక్‌లా పనిచేస్తాయి.
==రకములు==
===సూర్య గుమ్మడి===
"https://te.wikipedia.org/wiki/గుమ్మడి" నుండి వెలికితీశారు