గ్రామ దేవత: కూర్పుల మధ్య తేడాలు

చి →‎అమ్మోర్లు: AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 26:
;అగ్ని దేవత
 
మూడవది తేజస్సు (అగ్ని). పగటిపూట తేజస్సునిచ్చే [[సూర్యుడు|సూర్యునికి]] ప్రతీకగా '''సూరమ్మ'''నూ, రాత్రిపూట తేజస్సు నిచ్చే [[చంద్రుడు|చంద్రునికి]] ప్రతీకగా '''పున్నమ్మ''' నీ దేవతలుగా చేసారు. సూరమ్మను ప్రతీ అమావాస్యనాడు, పున్నమ్మను ప్రతీ [[పౌర్ణమి]]<nowiki/>నాడు పూజించే విదముగా ఏర్పాటు చేసుకొని తమ కులవృత్తిని ఆరోజు మానేయడం చేసేవారు. ఇక అమ్మకి కుడి కన్ను సూర్యుడుగానూ ఎడమ కన్ను చంద్రుడిగాను ఆతల్లికి పెట్టిన పేరు '''ఇరుకళమ్మ''' (సూర్య,చంద్రుల కల వున్న అమ్మ).
 
;వాయు దేవత
పంక్తి 38:
== పోషణ, రక్షణ నిచ్చే దేవతలు==
[[File:Diety reliefs at Village Outskirts in Rajula Tallavalasa, Visakhapatnam district.jpg|thumb|250px|విశాఖ జిల్లాలో ఒక గ్రామ దేవత ప్రతిరూపాలు పూజింపబడుతున్నవి]]
ఇక ప్రజల మనసులో పుట్టి ఏ కోర్కెనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోర్కెని తీర్చే బాధ్యతని స్వీకరంచి భక్తులకు అండగా నిలిచే తల్లి '''తలుపులమ్మ'''. తలపు అంటే ఆలోచన వాటిని తీర్చే తల్లి తలపులమ్మ క్రమముగా ఈమె 'తలుపులమ్మ'గా మారింది. ఇంట్లో నుండి బయటికి వెల్లేటపుడు తల్లికి లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు. వూరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ వూరి పొలిమేరలో వుండేతల్లి '''పొలిమేరమ్మ''' క్రమముగా '''పోలేరమ్మ''' అయింది. పొలిమేరలో వుండే మరొక తల్లి '''శీతలాంబ'''. ఈమె చేతుల్లో [[చీపురు]], [[చేట]] ఉంటాయి. తన గ్రామంలోని ప్రజలకు వ్యాదులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత పిచాచ గణాలను గ్రామంలోనికి రాకుండా వూడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈదేవతే. 'ఎల్ల' అంటే సరిహద్దు అని అర్దము అందుకే 'ఎల్లమ్మ' కూడా ఈ పనిని చేసేదన్నమాట. ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోసించే తల్లి 'పోచ+అమ్మ=పోచమ్మ' అన్నమాట. ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే, పోచమ్మ పోషణ కలిగిస్తుంది. ఇక పాములు బాగా సంచరించే చోటులో వుండే దేవత తల్లి '''పుట్టమ్మ''' ఈమె [[గుడి]]<nowiki/>లో అనేక పుట్టలుంటాయి. అక్కడే సుబ్రహ్మణ్య షష్టికి అందరూ పుట్టలో పాలు పోస్తారు. ఈ తల్లికే 'నాగేశ్వరమ్మ' అని కూడా అంటారు. పాము+అమ్మ=పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి పాపమ్మ అని కూడా అంటారు. [[సుబ్రహ్మణ్య స్వామి|సుబ్రహ్మణ్యేశ్వరుడు]] పేరుమీదే 'సుబ్బ+అమ్మ=సుబ్బమ్మ కూడా దైవముగా ఉంది.
 
==గ్రామదేవతా నామ విశేషాలు ==
పంక్తి 52:
పాగేలమ్మ, ముత్యాలమ్మ, [[గంగమ్మ]], గంగానమ్మ, బంగారమ్మ, గొంతెమ్మ, సత్తెమ్మ, తాళ్ళమ్మ, చింతాలమ్మ, చిత్తారమ్మ, పోలేరమ్మ, మావుళ్ళమ్మ, మారెమ్మ, బంగారు బాపనమ్మ, పుట్టాలమ్మ, దక్షాయణమ్మ, పేరంటాళ్ళమ్మ, రావులమ్మ, గండి పోచమ్మ, మొగదారమ్మ, ఈరినమ్మ, దుర్గమ్మ, మొదుగులమ్మ, నూకాలమ్మ ([[అనకాపల్లి]], విశాఖపట్నం జిల్లా, కాకినాడ, సామర్లకోట, కాండ్రకోట (పెద్దాపురం), చింతలూరు తూర్పుగోదావరి జిల్లా), మరిడమ్మ, నేరెళ్ళమ్మ, పుంతలో ముసలమ్మ (మొయ్యేరు,అత్తిలిదగ్గర,ప.గోజిల్లా), మాచరమ్మోరు, మద్ది అనపమ్మోరు, సోమాలమ్మ, పెద్దింట్లమ్మ, గుర్రాలక్క ([[అంతర్వేది]], తూ.గో.జిల్లా) (గుర్రాలమ్మ), అంబికాలమ్మ, దనమ్మ, మాలక్ష్మమ్మ, ఇటకలమ్మ, దానాలమ్మ, రాట్నాలమ్మ, తలుపులమ్మ ([[తుని]], తూ.గో.జిల్లా), పెన్నేరమ్మ, వెంకాయమ్మ, గున్నాలమ్మ, ఎల్లమ్మ ([[విశాఖపట్నం]]), [[పెద్దమ్మ]], మంటాలమ్మ, గంటాలమ్మ, సుంకులమ్మ, జంబులమ్మ, పేరంటాలమ్మ, కంటికలమ్మ, వనువులమ్మ, సుబ్బాలమ్మ, అక్కమ్మ, గనికమ్మ, ధారాలమ్మ, మహాలక్ష్మమ్మ, లంకాలమ్మ, దోసాలమ్మ, పళ్ళాలమ్మ (వానపల్లి, తూ.గో.జిల్లా), ధనమ్మ, జోగులమ్మ, పైడితల్లి, చెంగాళామ్మ, రావులమ్మ, బూరుగులమ్మ, కనకమహాలక్ష్మి ([[విశాఖపట్టణం]]), పోలమ్మ, కొండాలమ్మ, వెర్నిమ్మ, దేశిమ్మ, గరవాలమ్మ, గరగలమ్మ, దానెమ్మ, మహంకాలమ్మ, వీరుళ్ళమ్మ, మరిడమ్మ, ముళ్ళమాంబిక, యల్లారమ్మ, వల్లూరమ్మ, నాగులమ్మ, వేగులమ్మ, ముడియలమ్మ, పెద్దింట్లమ్మ, నంగాలమ్మ, చాగళ్ళామ్మ, నాంచారమ్మ, సమ్మక్క, సారలమ్మ, మజ్జిగౌరమ్మ, కన్నమ్మ- పేరంటళ్ళమ్మ, రంగమ్మ-పేరంటాలమ్మ, వెంగమ్మ-పేరంటాలమ్మ,తిరుపతమ్మ, రెడ్డమ్మ, పగడాలమ్మ, మురుగులమ్మ ([[బండారులంక]], తూ.గో.జిల్లా), [[విశాఖపట్నం]]లో కుంచమ్మ, ఎరకమ్మ, పెద్దింట్లమ్మ,మరిడమ్మ ఉన్నారు.[[మసకపల్లి]] పామర్రు మండలం [[తూర్పు గోదావరి జిల్లా]]లోని గ్రామదేవతలు గొల్లాలమ్మ, (పినపళ్ళ) మసకపల్లమ్మ, వెలగలమ్మ, ఉర్లమ్మ తల్లి (గణపవరం, కర్లపాలెం మండలం, గూంటూరుజిల్లా)పైళ్లమ్మ తల్లి, బళ్లమ్మ తల్లి, లోల్లాలమ్మ తల్లి, వూదలమ్మ తల్లి, కట్వలాంబిక,నాగాలమ్మ-నాంచారమ్మ తల్లి, సింగమ్మ తల్లి,ఘట్టమ్మ తల్లి, అంజారమ్మ తల్లి, కొట్లమ్మ తల్లి (పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా),
బర్రెమ్మ తల్లి (పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా), బలుసులమ్మ తల్లి (తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా), వెంకమ్మ తల్లి
ఖమ్మం, [[నల్గొండ జిల్లా]]<nowiki/>లలో ముత్యాలమ్మ తల్లి ఆరాధన ఎక్కువగా కానవస్తుంది.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/గ్రామ_దేవత" నుండి వెలికితీశారు