ఘంటా గోపాల్‌రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → ,, typos fixed: పని చేసి → పనిచేసి, → (3), , → ,
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
'''ఘంటా గోపాల్‌రెడ్డి''' వ్యవసాయ శాస్త్రవేత్త, ఉమ్మడి [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్‌]]<nowiki/>లో ఎత్తిపోతల పథకాల సృష్టికర్త.<ref>{{Cite web|url=http://www.andhrabhoomi.net/content/nal-625|title=ఎల్-27 ఎత్తిపోతల పథకం ఆదర్శనీయం {{!}} Andhrabhoomi - Telugu News Paper Portal {{!}} Daily Newspaper in Telugu {{!}} Telugu News Headlines {{!}} Andhrabhoomi|website=www.andhrabhoomi.net|access-date=2018-04-15}}</ref>
 
== జీవిత విశేషాలు ==
గోపాల్‌రెడ్డి [[1932]] [[ఫిబ్రవరి 14]]<nowiki/>న [[నల్లగొండ జిల్లా]] గరిడేపల్లి మండలం [[గడ్డంపల్లి (పినపాక)|గడ్డిపల్లి]]<nowiki/>లో జన్మించాడు. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో 1948-52 వరకు వ్యవసాయ విద్యనభ్యసించాడు. అనంతరం నల్లగొండలో వ్యవసాయ విస్తరణాధికారిగా కొంతకాలం సేవలందించాడు. 1958లో [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]<nowiki/>కు వెళ్లిన గోపాల్‌రెడ్డి 1960-64 వరకు అగ్రికల్చర్ పీజీ పూర్తిచేసి, 1969లో పీహెచ్‌డీ పూర్తిచేశాడు.<ref>{{Cite news|url=https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/ex-minister-rajagopala-reddy-passes-away-1-2-572037.html|title=వ్యవసాయ శాస్త్రవేత్త గోపాల్‌రెడ్డి కన్నుమూత|access-date=2018-04-15}}</ref> 1964 నుంచి 1969 వరకు [[హైదరాబాదు|హైదరాబాద్‌]]<nowiki/>లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించాడు. [[నాగార్జునసాగర్|నాగార్జునసాగర్‌]] ఎడమకాలువ తవ్వకాల సమయంలో కాలువకు ఎగువ భాగంలోని బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు సుదీర్ఘంగా పోరాటం చేశాడు. 1969లో మహాత్మాగాంధీ ఎత్తిపోతల నిర్మాణానికి కృషిచేశాడు. ఈ పథకాన్ని ఏర్పాటుచేసి రైతుల బీడు భూముల్లో పంట సిరులు కురిపించాడు. దీని నిర్మాణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తిపోతల సృష్టికర్తగా ఆయన మన్ననలు అందుకున్నాడు. రైతులకు వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల్లో శిక్షణలు ఇప్పించాడు. పలు కొత్త వంగడాలను ఆయన సృష్టించారు.<ref>{{Cite web|url=http://www.andhrajyothy.com/artical?SID=564538|title=వ్యవసాయ మాంత్రికుడు గోపాల్‌రెడ్డి కన్నుమూత -|website=www.andhrajyothy.com|access-date=2018-04-15}}</ref> శ్రీమాతృకృపా గడ్డిపల్లి అభ్యుదయం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 1984-85లో గడ్డిపల్లిలో కృషి విజ్ఞాన కేంద్రాన్ని నెలకొల్పాడు.
 
1980లో గడ్డిపల్లి చుట్టూ ఉన్న ఏడు గ్రామాల రైతులను సమీకరించి అందరి సహకారంతో రైతు సేవా సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా రైతులకు అనేక సేవలు అందించాడు. గడ్డిపల్లి కేవీకే కార్యదర్శిగా అనేక సంవత్సరాలు పనిచేసి వ్యవసాయ పరంగా విస్తృత సేవలు అందించాడు. కేవీకే ద్వారా చేస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1994లో ఉత్తమ కేవీకేగా ఎంపిక చేసింది. అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చతురానందమిశ్రా చేతుల మీదుగా అవార్డును అందుకున్నాడు. అలాగే జిందాల్ అవార్డును కూడా పొందాడు. దీని ద్వారా వచ్చిన రూ.25 లక్షలను గ్రామంలో పాఠశాల ఏర్పాటుకు కేటాయించాడు. ఇవే కాకుం డా గ్రామంలో ఆదర్శ పాఠశాల ఏర్పాటుకు 8 ఎకరాల స్థలాన్ని ఉచితంగా అందజేసాడు.<ref name="ghanta">{{Cite web|url=http://www.ntnews.com/District/suryapet/article.aspx?contentid=833166|title=అపర భగీరథుడు గోపాల్‌రెడ్డి అస్తమయం|access-date=2018-04-15}}</ref>
"https://te.wikipedia.org/wiki/ఘంటా_గోపాల్‌రెడ్డి" నుండి వెలికితీశారు