జైన మతం: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 17:
=='''చరిత్ర'''==
[[File:Mahavir.jpg|150px|right|thumb|వర్థమాన మహావీరుడు]]
క్రీ.పూ ఆరవ శతాబ్దంలో మతపరంగా సమాజం ఒక కుదుపుకు లోనైంది. ఈ కాలంలో నైతిక, ఆధ్యాత్మిక అశాంతి నెలకొని ఉంది. ప్రపంచం మొత్తం మీద నాడు ఉన్న యధాతధ స్థితిలో విసిగిపోయిన జనం ఎదురు తిరిగారు. గ్రీసు బయోనియో గిరాక్లీటీజ్ నూతన సిద్ధాంతాన్ని ప్రవచించారు. జరతూష్ట్ర [[ఇరాన్]] లో, [[చైనా]]లో [[కన్ఫ్యూషియస్]]లు ఉన్న పరిస్థితులకు వ్యతిరేకంగా తమ నూతన సిద్ధాంతాలను ప్రతిపాదించారు. [[భారత దేశము|భారత దేశం]]<nowiki/>లోనూ ఇదే జరిగింది. ప్రాచీన మత ధర్మాలలో, కర్మకాండ క్రతువుల భారంతో జనం విసిగి పోయి ఉన్నారు. మత సంస్కృతి యొక్క మృత భారంతో నడుములు వంగిపోయాయి.అసమానతలు, సామాజిక స్తబ్దత, అధర్మం, [[బలులు]], [[కులవ్యవస్థ]] లతో సమాజం కుళ్ళిపోయింది. [[విప్లవం]] తప్పనిసరి అయింది. "వ్యక్తి ఆడగాని, మగ గాని మానవ మాతృడుగా తన ముక్తిని తానే సాధించుకోవాలి. జీవితం లక్ష్యం కాదు. ఆధ్యాత్మీకరణ మార్గంలో అది ఒక పరికరం మాత్రమే. అంతిమ లక్ష్యం భౌతికం కాదు ఆధ్యాత్మిక సామాజీకరణం కాదు. "ఆధ్యాత్మీకరణం" అన్నది నూతన విప్లవం.
 
ఈ నేపథ్యంలో భారత దేశంలో రెండు మతాలు, ఉపనిషన్మతానికి వ్యతిరేకంగా వెలిశాయి. అవి జైన, బౌద్ధ మతాలు. ఈ రెండింటి తాకిడితో బ్రాహ్మణ మతం అనేక మార్పులకు లోనైంది. అసలు మనం భగవద్గీతను, ఈ రెండు మతాల సవాళ్ళకు సమాధానంగానే చూడవలసి ఉంటుంది. హిందూ మతానికి అవి వ్యతిరేకమే అయినా, మొత్తం మతాలు భారతదేశంలో ప్రక్క ప్రక్కనే నివాసం చేశాయి.
పంక్తి 27:
 
==జైన మతం పురాతన సత్వం==
సన్యసించిన మొదట్లో అతడు నిర్గ్రంధులనే ఒక తెగ ఆచారాలను, విధానాలను అనుసరించారు. ఆ తెగను అంతకు 200 సంవత్సరాల ముందు పార్శ్వనాధుడనే వాడు స్థాపించాడు. ఆ తరువాత 'నిర్గ్ంధ" పదాన్ని మహావీరుని అనుచరులకు మొదట్లో ఉపయోగించారు. పార్శ్వనాధుడు 22 వ తీర్థంకరునిగా గుర్తు పెట్టుకొన్నారు. కనుక జైన మతం వర్థమాన మహావీరుని కంటే ముందే ఉంటుందంటారు. అంతే కాదు, ఇది వేదమతం కాలం నుంచే ఉందంటారు. ఎలాగంటే ఈ మతానికి 24 మంది తీర్థంకరులున్నారని, చివరివాడు వర్థమానుడని, మొదటి వాడు ఋషభదేవుడు, అరిష్టనేములని అంటారు. ఋషభదేవుడు మొదటి తీర్థంకరుడు. అతని గురించి [[ఋగ్వేదం]]<nowiki/>లో పేర్కొనబడింది. అంతే కాదు యితడు [[విష్ణుపురాణం]] లో, [[భాగవత పురాణం]]<nowiki/>లో నారాయణావతారంగా కీర్తించబడ్డాడు. దీనిని బట్టి [[జైన మతం]] ఋగ్వేద మతం అంత పాతది. ఈ 24 తీర్థంకరుల లేదా ప్రవక్తల ప్రవచనమే జైనం. ఆ 24 ప్రవక్తలు వీరు;
{{col-begin}}
{{col-4}}
పంక్తి 143:
#'''వాయుకాయ జీవులు ''' : గాలి, తుఫాన్
#'''వనస్పతిక జీవులు ''' : మొక్కలు, పొదలు, చెట్లు, వాటి బెరడు, కాండం, ఆకులు, విత్తనాలు...వీటిలో ఒక్కోదానిలో ఒక్కో ఆత్మే ఉంటుంది. అందుకని ఇవి ఏకకాయజీవులు. ఉర్లగడ్డలు, కంద, చేమ, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, మొదలైనవి అసంఖ్యాక ఆత్మలు గల బహుకాయజీవులు.
ఏకేంద్రియ జీవికి 4 ప్రాణాలు (స్పర్శ, శ్వాస, శరీరం, ఆయుష్షు), పంచేంద్రియజీవులకు 10 ప్రాణాలుంటాయి. ఈ ఏకేంద్రియ జీవులు కూడా పదార్థాన్ని [[ఆహారం]], [[శరీరం]], [[ఇంద్రియాలు]], [[శ్వాసలో గురక|శ్వాసల]] ద్వారా స్వీకరించి దాన్ని [[శక్తి]]<nowiki/>గా మార్చుకుని బతుకుతాయి.
== జైనులకు మైనారిటీ హోదా ==
మైనారిటీ'లను నిర్వచిస్తూ రాజ్యాంగానికి సవరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా జైనులు మైనారిటీలుగా గుర్తింపు పొందేందుకు మార్గం సుగమం కానుంది. ప్రధాని [[మన్మోహన్ సింగ్|మన్మోహన్]] అధ్యక్షతన19.12.2008 న జరిగిన మంత్రివర్గ సమావేశంలో మైనారిటీలను నిర్వచిస్తూ రాజ్యాంగానికి 103వ సవరణ చేపట్టాలన్న ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసినట్లు హోంమంత్రి [[చిదంబరం]] తెలిపారు. జైనులకు మైనారిటీ హోదా కల్పించడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని పేర్కొంటూ పలుసార్లు [[సుప్రీంకోర్టు]] ఆదేశాలు జారీ చేసిందని, ఈ నేపథ్యంలో చట్టసవరణ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. (ఆంధ్రజ్యోతి 20.12.2008)
పంక్తి 149:
== జైనుల కట్టడాలు-శిల్పము ==
 
జైనుల కట్టడాలలో ప్రతీదీ ఎంతో నేత్రపర్వంగా వుంటుంది. వారి ఆరామాలు, ఆలయాలూ, ఎక్కువ భాగం విశాల ప్రదేశాలలో నిర్మితాలు.వీఉ దేవాలయాలను సమూహాలుగా నిర్మిస్తారు. [[:en:Girnar|గిర్నరా]] శిల్పాలు బహు ప్రాచుర్యాన్ని పొందిన జైన శిల్పాలు. అదే విధంగా [[చిత్తూరు]]<nowiki/>లోని జయస్తంభాలు, ఆబూశిఖరం మీద ఆలయాలు మనోహర నిదర్సనాలు.బెంగాలులోని పార్శ్వనాధ విగ్రహ మున్న [[:en:Shikharji|సమేతశిఖర తీర్ధము]], పాట్నాలోని [[:en:Pawapuri|జలమందర]] తలమందర దేవాలయములు మరికొన్ని నిదర్సనాలు. జైన శిల్ప శిథిలాలలో ముందు మన దృష్టిని ఆకర్షించేవి [[:en:Udayagiri and Khandagiri Caves|ఒరిస్సాగుహలు]]. వీటిలో చాలా భాగము తీర్ధంకర విగ్రహాలతో నిండి ఉన్నాయి. ఈ తీర్ధంకురులలో [[పార్స్వనాధుడు]] అత్యంత ప్రముఖ స్థానం పొందినది. ఈ గుహలలో త్రిశూలలు, స్తూపాలు, స్వస్తికలు, చక్రాలు, శ్రీదేవీ విగ్రహాలు, తదితర ప్రతీకలు ఉన్నాయి. జైనశ్రమణులు పెద్దపెద్ద సంఘాలుగా నివసించే ఆచారము లేదు. అందువలన బౌద్ధ చైత్యాలను పోలిన మందిరాలు వీరికవసరము లేకపోయింది. [[:en:Udayagiri and Khandagiri Caves|ఉదయగిరిగుహలు]] చాలా ప్రాచీనమైనవి. ఖండగిరిలోనివి తరువాతి కాలములోనివి.ఉదయగిరిలోని హాతిగుంఫ చాల ప్రకృతిసిద్ధ మయినది. ఇందులో [[:en:Kharavela|ఖరవేల]] రాజ్యకాలం నాటి ఒక అపభ్రంశ ప్రాకృత శాసనము ఉంది. దానివల్లనే ఈగుహకు అంత ప్రాచుర్యము. ఈ గుహలోని శిల్పంలో మధుర శిల్పంలో వలెనే స్త్రీ పురుషుల వేష ధారణలలో గ్రీసుభారత శైలుల సమ్మిళితప్రభావం స్పష్టముగా కనిపిస్తుంది. ఈ శిల్పాలలో ఆభ్రణ [[సౌభాగ్యము]], శాస్త్ర నైపుణ్యమేగాక అక్కడక్కడా వినూత్న భావశబలతా, జీవితసౌందర్యము, సునిశితహాస్యము, కూడా కనబడును.ఈ ఘట్టాలలో ఆఖేటమూ, యుద్ధమూ, నాట్యమూ, శ్ర్ంగారమూ, మొదలయిన జీవన శైలిలు కనబడును.
 
జైనశిల్పాలలో లేదా కట్టడాలలో రెండు ప్రత్యేక గుణాలు కనిపిస్తాయి-స్తూపారాధన, విగ్రహారాధన, స్తూపాలు ప్రథమంలో ప్రసిద్ధ మతాచార్యుల నిర్యాణచిహ్నాలుగానే పరిగిణింపబడినా క్రమంగా రానురానూ అసమానశిల్పకళానిలయాలుగా మారిపోయాయి. ఇందుకు మధురలోని వోద్వ స్తూపమే నిదర్సనము. స్తూప నిర్మాణము బౌద్ధులలో ఉన్నంత ప్రబలంగా జైనులలో లేక పోయినా వీరు కూడా ఇందులో ఒక ప్రశంసాపాత్రమైన స్థితిని చేరుకున్నారు.
"https://te.wikipedia.org/wiki/జైన_మతం" నుండి వెలికితీశారు