టి.కనకం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 25:
 
===పేరు తెచ్చిన చిత్రాలు===
[[కీలుగుర్రం]] (1949), [[గుణసుందరి కథ]] (1949), [[షావుకారు]] (1950)లోని పాత్రలు ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. [[షావుకారు]] చిత్రంలో చాకలి రామి పాత్రను కనకం ధరించి. ఆపాత్ర ఆమెకు చీర మోకాళ్ళపైకి ఎగకట్టి పయిటచెంగు జారవిడుస్తూ అమాయకంగా నోటిలో గడ్డిపరకను కొరుకుతూ, వోరకంటితో వయ్యారపు చూపులతో, [[రౌడీ రంగడు]]<nowiki/>తో తళుకు బెళుకుల శృంగార చేష్టలకు అభినయానికి ప్రజలందరూ ముగ్ధులౌతూ ఉండేవారు. ఒక ప్రక్క చిత్రాలలో నటిస్తూనే మరోపక్క నాటకాల్లో కూడా పాత్రలు ధరించింది.
 
[[దస్త్రం:T. Kanakam.jpg|thumb|right|టి.కనకం]]
 
==నాటకాలు==
నాటకాలలో ఆమె [[కురుక్షేత్రం]] నాటకంలో కృష్ణ పాత్రను, పాండావోద్యోగంలో అర్జునుడు, కృష్ణ పాత్రలను, [[కృష్ణ తులాభారం]]<nowiki/>లో నారదుడు, కృష్ణ పాత్రలను, రామాంజనేయ యుద్ధంలో రాముడి పాత్రను, [[చింతామణి (నాటకం)|చింతామణి]] నాటకంలో చింతామణి పాత్రను మరెన్నో ఇతర నాటకాలలో ఎన్నో ముఖ్యమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను మెప్పించింది. ఈమె నటకరంగంలో ప్రసిద్ధులైన పీసపాటి, షణ్ముఖి ఆంజనేయరాజు, [[రఘురామయ్య]], నల్లా రామమూర్తి, [[రేలంగి వెంకట్రామయ్య]], [[మాధవపెద్ది సత్యం]] మొదలైన వారందరి కలిసి నటించింది. అవకాశాలు మంచిగా ఉన్న రోజుల్లో ఆమె విలాసవంతమైన జీవితం గడిపారు. తర్వాత అవకాశాలు తగ్గడంతో దుర్భరమైన జీవితం గడపవలసి వచ్చింది. మరణించే వరకు ఆమె [[విజయవాడ]]లో నివాసం ఉంది.
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/టి.కనకం" నుండి వెలికితీశారు