"తిరుపతి వేంకట కవులు" కూర్పుల మధ్య తేడాలు

చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
(2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
{{main|చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి}}
చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి [[ప్రమోదూత]] సంవత్సర [[శ్రావణ శుద్ధ ద్వాదశి]] సోమవారం అనగా [[1870]] [[ఆగస్టు 8]]న [[తూర్పు గోదావరి]] జిల్లా [[కడియం]] గ్రామంలో జన్మించాడు. ఆయన ముత్తాత తమ్ముడు [[వేంకటేశ్వర విలాసము]], [[యామినీ పూర్ణతిలక విలాసము]] అనే మహాద్గ్రంధాలను రచించిన పండితుడు. ఆయన సేకరించిన అమూల్య తాళపత్ర గ్రంథాలు వేంకట శాస్త్రికి అందుబాటులో ఉన్నాయి.
తరువాత వారు [[యానాం]]కు మకాం మార్చారు. [[యానాం]]<nowiki/>లో వేంకట శాస్త్రి తెలుగు, [[ఆంగ్లం]], [[సంస్కృతం]] భాషలు అధ్యయనం చేశాడు. కానుకుర్తి భుజంగరావు, అల్లంరాజు సుబ్రహ్మణ్య కవిరాజు వంటివారు వేంకటశాస్త్రి గురువులు.
 
శ్రీవెంకటకవి చదువుకై ఎందరెందరో గురువులను ఆశ్రయించి తిరిగితిరిగి శ్రీ చర్ల బ్రహ్మయ్యశాస్త్రిని ఆశ్రయించారు. అప్పటికే వారివద్ద కౌముది చదువుతున్న శ్రీ తిరుపతితో పరిచయమైనది. కాని కాలునిలువని వెంకటకవి విద్యాగ్రహణమునకై [[వారణాసి]]కి పోవలెనను ఉబలాటము కలిగి, గురువులతో మాయమాటలు చెప్పి ఒక మిత్రునితో కాశికి బయలుదేరినాడు. డబ్బులేదు.నిడమర్రు చేరి అక్కడి ఉద్యోగుల సభలో శతఘంటకవనము, చేయగలనని ప్రగల్భముగా పద్యాలు చెప్పెను. అప్పటికి ఆయన వయసు 20సం. కూత ఘనముగా ఉన్నదని ఆయనతో అష్టావధానము చేయించిరి. పూర్తి చేసి, అయ్యా నేనెప్పుడు అష్తావధానము చేయలేదని ఊరక అడిగిన ధనమీయరని ప్రగల్భములు పలికితిని. లోపములున్న మన్నింపమని పలికిరి. వేంటనే సభ్యులందరు కోపమేమీ లేదని బాగుగా చేసితివి అని పలికి రూ.30 ఇచ్చి సత్కరించిరి వెంకటకవిని.అదే ఆయన మొదటి అవధానము.రెండవ అవధానము గుండుగొల్లులో చేసిరి. శ్రీ శాస్త్రిగారు కాశిలో ఎక్కువకాలముండలేదు. గురువుల ఆదేశమును అనుసరించి స్వదేశము తిరిగివచ్చిరి.కాశీ సమారాధనముకు, గంగపూజకు డబ్బుకొరకు కోనసీమలో ముమ్మిడివరము, ఐనాపురము, కేసవకుర్తిలో అవధానము చేసి ధనం సంపాదించి గంగపూజ చేసారు.
మొదటినుండి తిరుపతి శాస్త్రి వాదనా పటిమ అసాధారణంగా ఉండేది. ఇక వేంకట శాస్త్రి పురాణ సాహిత్యాలపై ఉపన్యాసాలివ్వడంలోనూ, [[మెరుపు]]లా పద్యాలల్లడంలోనూ దిట్ట. ఒకసారి [[వినాయక చవితి]] ఉత్సవాలకు చందాలు వసూలు చేయడంలో ఇద్దరూ తమ తమ ప్రతిభలను సమన్వయంగా ప్రదర్శించారు. ఒకరి ప్రతిభపై మరొకరికి ఉన్న గౌరవం వారి స్నేహాన్ని బలపరచింది.
 
వేంకట శాస్త్రి [[వారాణసి]] వెళ్ళి తిరిగి వచ్చినాక [[కాకినాడ]]లో జంటగా [[అవధానము (సాహిత్యం)|శతావధానం]] ప్రదర్శించారు. ఆ తరువాత జీవితాంతం ఆ సాహితీ మూర్తులు ఒకరికొకరు తోడున్నారు. తిరుపతి శాస్త్రి సదా వేంకటశాస్త్రిని తన [[గురువు]]<nowiki/>గా భావించాడు. తిరుపతి శాస్త్రి మరణానంతరం కూడా వేంకట శాస్త్రి తన రచనలను జంట రచనలుగానే ప్రచురించాడు.
 
తిరుపతి వెంకటేశ్వరుల దిగ్విజయములకు నాంది పలికినది కాకినాడలో. అది వారి మొదటి శతావధానమేకాక సంపూర్ణ శతావధానమ కూడను. అప్పటికి వెంకటశాస్త్రికి 20సం. తిరుపతి శాస్త్రిగారికి 19వ ఏడు. బాలసరస్వతులవలె నున్నవారిని సభ్యులు అభిమానించుచునే అడుగడుగున గడ్డు పరీక్షలు చేసిరి. కవులన్నింటిలో నెగ్గిరి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2985819" నుండి వెలికితీశారు